కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దానిని అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ విధించినప్పటికీ కేసులు పెరుగుతున్నాయి. అయితే.. ఈ వైరస్ కారణంగా జూలో జంతువులు ఆకలితో అలమటిస్తున్నాయి. యూపీలోని ఘాజీపూర్ వద్ద నున్న స్లాటర్ హౌస్ మూసివేయడంతో జూ పార్కులోని జంతువులకు ఆహారం అందించేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 

మరోవైపు ఢిల్లీలో మాంసం సరఫరా చేసేవారు తమ వ్యాపారాన్ని నిలిపివేశారు. దీంతో ఘాజిపూర్ స్లాటర్ హౌస్ తిరిగి తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తూర్పు ఎంసిడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం స్లాటర్  హౌస్ కొద్ది రోజులుగా మూసివేయడంతో జూలోని  జంతువులకు, మాంసం వ్యాపారులకు సమస్యలు తలెత్తాయి. 

Also Read లాక్ డౌన్ తో ఇంట్లోనే భర్తలు.. భార్యలకు చిత్రహింసలు...

స్లాటర్ హౌస్ లో ప్రతిరోజూ సుమారు 5 వేల జంతువులను వధిస్తుంటారని, ఫలితంగా వచ్చిన మాంసాన్ని కొంతమేరకు జూ పార్కుకు పంపుతారన్నారు. అయితే ఇప్పుడు స్లాటర్ హౌస్ తెరిస్తే సమస్యలు తలెత్తవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీన్ని నిర్వహించడం పెద్ద సవాలుగా మారవచ్చంటున్నారు. 

బయటి రాష్ట్రాల నుండి ఇక్కడికి వధించేందుకు జంతువులను తీసుకురావడం ఎంతో కష్టమన్నారు. అయితే తగిన ప్రణాళిక ద్వారా స్లాటర్ హౌస్ తెరుస్తామన్నారు.

 ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా కోరలుచాపుతోంది. డిచిన 24 గంటల్లో 227 కరోనా పాజిటివ్ కొత్త కేసులు నమోదైనట్టుగా మంగళవారం నాడు ప్రకటించింది. దేశంలో మొత్తం కరోనా కేసులు 1251కు చేరుకొన్నాయి.కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నవారిలో 32 మంది మృతి చెందితే, మరో 102 మందికి నయమైనట్టుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. 

ఢిల్లీ ఈవెంట్ కారణంగానే దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా కేంద్రం ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో 25 కొత్త కేసులు నమోదైనట్టుగా కేంద్రం ప్రకటించింది.దీంతో ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 97కు చేరినట్టుగా అధికారులు ప్రకటించారు. 

లోకల్ ట్రాన్స్ మిషన్ స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనాపై నర్సులకు కూడ చికిత్స విషయంలో శిక్షణ ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఆన్ లైన్ లో నర్సులకు నర్సులకు ఈ శిక్షణ ఇస్తామని తేల్చి చెప్పింది. దక్షిణ కొరియా, టర్కీ, వియత్నాంల నుండి వైద్య పరికరాలను తీసుకొస్తున్నట్టుగా కేంద్రం తెలిపింది. మాస్కులు, శానిటైజర్లకు కొరత లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొందని కేంద్రం ప్రకటించింది.

కరోనాా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను రైల్వే శాఖ కూడ ముందుకు వచ్చింది. సుమారు 20 వేల రైల్వే కోచ్‌లను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చేందుకు ముందుకు వచ్చింది. ప్రపంచంలో ఇవాళ్టికి 7,88, 522 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధితో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 37,878 మంది మృతి చెందినట్టుగా సమాచారం. మరో వైపు ఈ వ్యాధి సోకిన వారిలో 1,66,768 మంది రికవరీ అయినట్టుగా అధికారవర్గాలు ప్రకటించాయి.