ప్రముఖ గాయనీ ఆశా భోంస్లే... కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై ప్రశంసల వర్షం కురిపించారు. స్మృతి ఇరానీ ఇటీవ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అమేథీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా.. ఆమె గెలవడానికి గల కారణాన్ని ఆశా భోంస్లే ట్విట్టర్ వేదికగా వివరించారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... గురువారం దేశ రాజధాని ఢిల్లీలో నరేంద్ర మోదీ భారత ప్రధానిగా రెండో సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఆశా భోంస్లేకి కూడా ఆహ్వానం అందింది. ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లిన ఆశా భోంస్లే.... తనకు ఎదురైన ఓ సందర్భాన్ని ట్విట్టర్ వేదికగా వివరించారు.

‘‘మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రష్ లో నేను నిల్చున్నాను. అక్కడ నాకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు స్మృతి ఇరానీ వచ్చి నాకు సహకరించింది. నేను క్షేమంగా ఇంటికి వెళ్లేందుకు ఆమె సహకరించింది. అందరినీ స్మృతి జాగ్రత్తగా చూసుకుంటుంది... అందుకే ఆమె గెలిచింది’’ అంటూ ఆశా భోంస్లే ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా... ఆమె ట్వీట్ స్మృతి స్పందించారు. నమస్కారం ఎమోజీని సమాధానంగా పెట్టారు.

నిన్న ప్రధాని మోదీతోపాటు 57మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయగా... వారిలో స్మృతి ఇరానీ కూడా ఉన్నారు.