స్వలింగ సంపర్కంపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. సెక్షన్ 377 పై గత కొన్నేళ్లుగా తీంవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సెక్షన్ ప్రకారం అసహజ శృంగార చర్యలకు పాల్పడితే ఐదేళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు కూడా విధించే అవకాశం ఉంది. దీంతో ఈ సెక్షన్ వల్ల వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలుగుతోందని నాజ్ ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థ 2001 లో డిల్లీ కోర్టును ఆశ్రయించింది.  ఈ కేసు అటు, ఇటు తిరిగి సుప్రీం కోర్టు ముందుకు వెళ్ళింది. దీంతో ఈ సెక్షన్ పై వాదోపవాదాలు విన్న ఐదుగురు సభ్యుల ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. స్వలింగ సంపర్కం సెక్షన్ 377 పరిధిలోకి రాదని ధర్మాసనం 4-1 మెజార్టీతో తీర్పును వెలువరించింది.  అందరితో సమానంగా లెస్బియన్లు, గేలకు సమాన హక్కులు ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది.

ఈ తీర్పు నేపథ్యంలో స్వలింగ సంపర్కుల హక్కుల అంశంమే దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. వారికి అందరితోపాటే సమానహక్కులు కల్పించాలన్న తీర్పును కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.  పరస్పర అంగీకారంతో జరిగే అసహజ శృంగారం నేరమే అనేది వ్యతిరేకవాదుల వాదన. వారు అందరితో సమానంగా ఎలా చూస్తామన్నది వారి ప్రశ్న. ఈ తీర్పుతో వ్యక్తిగత స్వేచ్చకు ప్రాధాన్యత పెరిగిందన్నది అనుకూల వాదులు వాదన.

ఏదేమైనప్పటికి ఈ తీర్పు మరో చర్చకు దారితీసింది. ఈ స్వలింగ సంపర్కం గురించి స్పందిస్తూ బిజెపి పార్టీ ఐటీ విభాగాధిపతి అమిత్ మాల్వికా ఓ కొత్త ప్రశ్న సంధించారు. ఎంతమంది తమ ఇళ్లను స్వలింగ సంపర్క జంటకు అద్దెకివ్వడానికి సమ్మతిస్తారు? అంటూ తన ట్విట్టర్ వేధికగా ప్రశ్న స్పందించారు. ఈ ప్రశ్నకు నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఇందుకు సమ్మతమే అంటుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

 

ఈ ట్వీట్ కు ఎంపి రాజీవ్ చంద్ర శేఖర్ కూడా స్పందించారు. తాను అందకు సిద్దమేనంటూ ట్వీట్ చేశాడు. లింగ వివక్షత, కుల మతాలకు అతీతంగా ఉండాలని ఆయన సూచించారు.