కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. నేడు ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల పెళ్లి రోజు. సరిగ్గా 23 సంవత్సరాల క్రితం వీరిద్దరూ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ఆ నాటి స్మృతులను ఇప్పుడు ప్రియాక గాంధీ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

ఈ 23ఏళ్ల కాలంలో కొన్ని మిలియన్ల బ్యూటిఫుల్ మూమెంట్స్ తాను చూసినట్లు ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు.ప్రేమ, ఆనందం, కన్నీరు, స్నేహం, కుటుంబం, దేవుడు నుంచి రెండు అద్భుతమైన బహుమతులు(తన ఇద్దరు పిల్లలను ఉద్దేశించి) ఇవన్నీ తనకు లభించాయని ఆమె పేర్కొన్నారు. తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను అన్నింటినీ కలిసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Also Read బాత్ బీహార్ కీ: నితీష్ కుమార్ పై యుద్ధం ప్రకటించిన ప్రశాంత్ కిశోర్

కాగా... వారి పెళ్లై 23 సంవత్సరాలు కాగా... అంతకముందు ఆరు సంవత్సరాలపాటు  వారు ప్రేమించుకున్నారు.  ఈ నేపథ్యంలో 29 సంవత్సరాలు అంటూ ఆమె పేర్కొన్నారు. కాగా... ఆమె పెట్టిన పోస్టుకి వేలల్లో లైకులు, కామెంట్స్ వస్తుండటం విశేషం. ఆ ఫోటోలలో రాహుల్ గాంధీ కూడా కనపడుతున్నారు.

 

ఇదిలా ఉండగా... 48ఏళ్ల ప్రియాంక గాంధీ... గతేడాది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి చురుకుగా వ్యవహరించారు. తన నాయనమ్మ ఇందిరా గాంధీని తలపిస్తోందంటూ అందరూ ప్రియాంకపై పొగడ్తల వర్షం కురిపించారు. అయితే... అప్పటికే జనాల్లో కాంగ్రెస్ పార్టీ ఆసక్తి పోవడంతో.. పెద్దగా ప్రభావం చూపించలేదు. మళ్లీ అధికారంలోకి బీజేపీనే అడుగుపెట్టింది. ఇదిలా ఉండగా... రాబర్ట్ వాద్రాపై కూడా పలు కేసులు ఉండటం గమనార్హం.