WWW Movie Review: డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ మూవీ రివ్యూ

సినిమాటోగ్రాఫర్స్ నుంచి టర్న్ తీసుకుని దర్శకుడిగా రాణిస్తున్న కేవీ గుహన్‌ `118` తర్వాత రూపొందించిన మరో సినిమా `డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ`. రాజశేఖర్‌ తనయ శివానీ రాజశేఖర్‌ నటించిన రెండో సినిమా. ఇటీవల ఆమె `అద్భుతం` చిత్రంతో మెప్పించిన విషయం తెలిసిందే. 

WWW telugu movie review

సినిమాటోగ్రాఫర్స్ నుంచి టర్న్ తీసుకుని దర్శకుడిగా రాణిస్తున్న కేవీ గుహన్‌ `118` తర్వాత రూపొందించిన మరో సినిమా `డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ`. రాజశేఖర్‌ తనయ శివానీ రాజశేఖర్‌ నటించిన రెండో సినిమా. ఇటీవల ఆమె `అద్భుతం` చిత్రంతో మెప్పించిన విషయం తెలిసిందే. అరుణ్‌ ఆదిత్‌ హీరోగా నటించారు. రామంత్ర క్రియేష‌న్స్ పతాకంపై డా.రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన ఈ చిత్రానికి ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రించారు. తెలుగులో వ‌స్తున్న ఫ‌స్ట్ కంప్యూట‌ర్ స్క్రీన్ బేస్డ్ మూవీ కావ‌డం, డి. సురేష్ బాబు, దిల్‌రాజు లాంటి అగ్ర నిర్మాతలు ఈ సినిమాకు స‌పోర్ట్ చేయ‌డంతో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. శుక్రవారం(డిసెంబ‌రు24)న సోనిలీవ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

కథ:  
విశ్వ(అదిత్ అరుణ్), అష్రఫ్(ప్రియదర్శి), సదా (సత్యం రాజేష్), క్రిస్టీ(దివ్య శ్రీపాద) నలుగురు మంచి స్నేహితులు, సాఫ్ట్ వేర్ టెకీలు. వీరంతా వేరు వేరు నగరాల్లో ఉంటూ కంప్యూటర్ లో నే వర్చువల్ గా మాట్లాడుకుంటూ సరదాగా చిల్ అవుతుంటారు.  క్రిస్టీకి మిత్ర(శివాని రాజశేఖర్) మంచి ఫ్రెండ్. ఆమె అద్భుతమైన ఆర్టిస్ట్(పెయింటర్‌). మిత్ర వాయిస్‌ చూసిన కనెక్ట్ అయిన విశ్వ.. ఆమెని చూసి ఫిదా అవుతాడు. ఆమె ప్రేమలో పడతాడు. ఆమె కోసం ఏదైనా చేసేందుకు సిద్ధపడుతుంటాడు. తన సోదరుడికి జాబ్‌ వచ్చేలా విశ్వ చేయడంతో ఆయనకు కనెక్ట్ అవుతుంది మిత్ర. ఇద్దరు కలుసుకోవాలనుకుంటారు. అంతలోనే దేశంలో కరోనా కారణంగా మోడీ ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటిస్తారు. ఎక్కడికక్కడ లాక్‌ అయిపోతారు. ఇంతలో అనూహ్యంగా ఓ వ్యక్తి (సందీప్, కిల్లింగ్ వీరప్పన్ ఫేమ్) ఫ్లాట్ లోకి చొరబడి.. క్రిస్టీని కత్తితో పొడిచేసి గాయాపరుస్తాడు. మిత్రను కూడా చంపేస్తా అంటూ బెదిరిస్తుంటాడు. దీన్ని వర్చువల్‌గా చూస్తున్న విశ్వ షాక్‌కి గురవుతాడు. మిత్రను కూడా దారుణంగా చంపుతానని బెదిరిస్తాడు. ఆమె బతకాలంటే నువ్వు ఉరేసుకుని చనిపోవాలనే కండీషన్‌ పెడతారు. అస‌లు ఆ వ్య‌క్తి ఎవ‌రు?, విశ్వ‌ని ఎందుకు ఉరివేసుకుని చావ‌మ‌న్నాడు. ఆ వ్యక్తి నుంచి వీరు ఎలా బయటపడ్డారు. అసలు విశ్వ టీమ్‌ ఏం చేస్తారనేది మిగిలిన కథ. 

విశ్లేషణ:
పాపులర్‌ సినిమాటోగ్రఫర్ కె.వి. గుహన్ డిఫరెంట్‌ సినిమాలు తీస్తూ తన ప్రత్యేకతని చాటుకుంటున్నారు. `118` అలాంటి థ్రిల్లరే అని చెప్పొచ్చు. ఆయన చేసిన మరో ప్రయోగం `డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ`. సమకాలీన ప్రపంచంలో కంప్యూటర్ టెకీలు ఎలా తమకున్న టాలెంట్ ని దుర్వినియోగం చేసి విలాసవంతమైన లైఫ్ కి అలవాటు పడి సమాజంలో ఎలా దోషులుగా మారుతున్నారనేదాన్ని ఇందులో కళ్లకి కట్టినట్టు చూపించారు దర్శకుడు గుహన్‌. మంచి సందేశాన్ని అందించారు. రెండు కంప్యూటర్ల స్క్రీన్ మీదనే సినిమా మొత్తం రన్ కావడం ప్రయోగమనే చెప్పాలి. ఇదొక కొత్త రకమైన ఐడియాగా చెప్పొచ్చు. ఎంతో ఎగ్జైటింగ్ అనిపించే ఇలాంటి కథలను అనుకున్న బడ్జెట్ లోనే తెరమీద రిచ్ గా చూపించొచ్చని గుహన్ నిరూపించారు. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా కనెక్టింగ్‌గా ఉంటుంది. అయితే చాలా వరకు కంప్యూటర్‌ స్క్రీన్‌పై కనిపించడం కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. సెకండాఫ్‌ వరకు సినిమా సస్పెన్స్ గా సాగడం బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో ఒక్కోటి రివీల్‌ అవడం, ఆ వ్యక్తి దాడి చేయడానికి కారణం విశ్వ టీమ్‌ చేసే హ్యాకింగే కారణమనేది, వీరి వల్ల అతని జీవితం ఎలా నాశనమైందో చెప్పే సన్నివేశం ఆకట్టుకుంటాయి. హ్యాకింగ్‌, సైబర్‌ క్రైమ్‌ వల్ల అమాయకులు ఎలా బలవుతున్నారనేది బోల్డ్ గా చూపించిన విధానం
బాగుంది. సినిమా రెండు గంటల లోపే ఉండటం కూడా ప్లస్‌గా చెప్పాలి.  కాకపోతే మరింత థ్రిల్లింగ్‌గా చెబితే ఇంకా బాగుండేది.

నటీనటుల నటనః 
ఇల్లీగల్ హ్యాకర్ హెడ్ గా విశ్వ పాత్రలో అదిత్ అరుణ్ ఆకట్టుకున్నారు. చాలా బాగా నటించాడు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడే ప్రియురాలిని ఎలా కాపాడుకోవాలో తెలియక కొట్టుమిట్టాడే ఓ సిన్సియర్ లవర్ పాత్రలో లీనమై నటించాడు. అతనికి జంటగా నటించిన శివాని రాజశేఖర్ మిత్ర పాత్రలో ఓ సిన్సియర్ ప్రేమికురాలిగా ఆకట్టుకుంది. క్యూట్‌గా, ఇన్నోసెంట్‌గా నటించి మెప్పించింది. ప్రియదర్శి, దివ్య, సత్యం రాజేష్ వారి పాత్రలకు తగ్గట్టు చేశారు. కిల్లింగ్ వీరప్పన్ ఫేమ్ సందీప్ కూడా ఉన్న కాసేపు అయినా భయపెట్టి.. ప్రేక్షకులను థ్రిల్ ను ప‌రిచ‌యం చేశాడు. వైవా హర్ష త‌న‌ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. రియాజ్ ఖాన్ సైబర్ క్రైమ్ పోలీసు అధికారి గా కాసేపు ఫర్వాలేదనిపించారు.

సాంకేతికంగాః
దర్శకుడు గుహ‌న్ మేకింగ్ తో పాటు సినిమాటోగ్ర‌ఫి కూడా చాలా ప్ల‌స్ అయింది. విజువల్స్ లో కొత్తదనం కనిపిస్తుంది. సైమన్‌ కె. కింగ్ సంగీతం, బ్యాక్‌ గ్రౌండ్‌స్కోర్‌ కథకి బాగా సెట్‌ అయ్యింది. సస్పెన్స్ ని, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్ ని తన బీజీఎంతో మరింతగా పెంచారు.అన్ని పాట‌లు స్క్రీన్ మీద ప్ల‌జెంట్‌గా ఉన్నాయి. తమ్మిరాజు ఎడిటింగ్‌ బాగుంది. ప్రొడక్షన్‌ పరంగా సినిమా చాలా రిచ్‌గా కనిపిస్తుంది. రామంత్ర క్రియేష‌న్స్ నిర్మాణ విలువ‌ల్ని పాటించారు. రెగ్యుల‌ర్ సినిమాలు కాకుండా క‌థాబ‌లం ఉన్న చిత్రాలు, స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్స్ ఇష్ట‌ప‌డేవారికి కనెక్ట్ అయ్యే చిత్రమిది. 

ఫైనల్‌గాః హ్యాకింగ్‌, సైబర్‌ నేరాల వల్ల సాధారణ మనుషులు, అమాయకులు ఎలా బలవుతున్నారనేది తెలియజేసే చిత్రమవుతుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios