కౌన్సెలింగ్‌కు డుమ్మా.. పోలీసుల ఆదేశాలు బేఖాతరు: షణ్ముఖ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్టయిన పోలీసులకు పట్టుబడిన యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. షణ్ముఖ్‌కు స్టేషన్ బెయిల్ ఇచ్చిన పోలీసులు.. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు.

అయితే పోలీసులు ఇచ్చిన ఆదేశాలను షణ్ముఖ్ జస్వంత్ పట్టించుకోకుండా.. కౌన్సెలింగ్‌కు హాజరు కాలేదని తెలుస్తోంది. దీంతో జస్వంత్‌పై కోర్టు ప్రోసిడింగ్స్‌కు జూబ్లీహిల్స్ పోలీసులు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10లో షణ్ముఖ్ జస్వంత్ కొద్దిరోజుల క్రితం రెండు కార్లు, రెండు బైకులను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
షణ్ముఖ్‌కు పోలీసులు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయగా.. 170 రీడింగ్ వచ్చింది. దీంతో ఐపీసీ సెక్షన్ 337, 279 కింద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు... అతనిని అదుపులోకి తీసుకున్నారు.
ఆ తర్వాత స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. షణ్ముఖ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. సూర్య అనే మరో వెబ్ సిరీస్‌ను షణ్ముఖ్ ఇటీవలే తన యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేశాడు. వీటికి కోట్లలో వ్యూస్ వస్తున్నాయి.