Asianet News TeluguAsianet News Telugu

Tenali Ramakrishna Review: ‘తెనాలి రామకృష్ణ’ మూవీ రివ్యూ

తెనాలి రామలింగడు ప్రత్యేకత ఎప్పటికప్పుడు తన తెలివితేటలతో ఎదుటివారిని బోల్తా కొట్టించి, సమస్యల నుంచి బయిటపడి అందరి మెప్పూ పొందటం, అందరి క్షేమం చూడటం. మరి ఈ సినిమా కూడా అలాంటి నవ్వులనే పంచుతుందా..కేవలం టైటిల్ కే పరిమితం అవుతుందా...ఈ కాలం తెనాలి రామకృష్ణ కథేంటి...సందీప్ కిషన్ కు ఈ సినిమా హిట్ ఇస్తుందా...వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

tenali ramakrishna telugu movie review
Author
Hyderabad, First Published Nov 15, 2019, 12:37 PM IST

--సూర్య ప్రకాష్ జోశ్యుల

 తెనాలి రామకృష్ణ పేరు వినగానే మన తెలుగువారి పెదాలపై అప్రయత్నంగానే చిరు నవ్వు పూస్తుంది. అందుకు కారణం చిన్నప్పటినుంచి మనం తెనాలి రామలింగడు కథలు చదువుకుంటూ,వింటూ పెరగటమే. ఈ జనరేషన్ వారిని కూడా యానిమేషన్స్ లో తెనాలి రామలింగడు కథలు అలరిస్తూనే ఉన్నాయి. ఆయన పేరునే టైటిల్ గా పెట్టుకుంటూ ఓ సినిమా వస్తోందంటే ఖచ్చితంగా ఓ నవ్వులు కురిపించే పాత్ర మన కళ్లముందు కనపడుతుంది.  తెనాలి రామలింగడు ప్రత్యేకత ఎప్పటికప్పుడు తన తెలివితేటలతో ఎదుటివారిని బోల్తా కొట్టించి, సమస్యల నుంచి బయిటపడి అందరి మెప్పూ పొందటం, అందరి క్షేమం చూడటం. మరి ఈ సినిమా కూడా అలాంటి నవ్వులనే పంచుతుందా..కేవలం టైటిల్ కే పరిమితం అవుతుందా...ఈ కాలం తెనాలి రామకృష్ణ కథేంటి...సందీప్ కిషన్ కు ఈ సినిమా హిట్ ఇస్తుందా...వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

కథేంటి...

చెట్టుక్రింద ప్లీడర్ (సందీప్ కిషన్)...పార్టీల మధ్య రాజీలు చేసి రాజాలా బ్రతికేస్తూంటాడు. ఎప్పటికైనా ఓ పెద్ద కేసు రాదా ...తాను రామ్ జట్మలానిలా పేరు తెచ్చుకోపోతానా..తన లైఫ్ టర్న్ కాదా అని అద్బుతమైన ఆశావాద ధృక్పధంతో ఎదురుచూస్తూంటాడు. అయితే దేవుడు అతని బాధ ఆవేదన చేసుకున్నట్లున్నాడు. ఓ పెద్ద కేసుని వరలక్ష్మి (వరలక్ష్మీ శరత్ కుమార్)రూపంలో పంపించాడు. లోకల్ గా పెద్ద పేరున్న బిలీయనీర్ ఆమె...తన ప్రత్యర్దులు ఇరికించిన ఓ తప్పుడు మర్డర్ కేసులో ఇరుక్కుపోతుంది.  అయితే ఆ స్దాయి మిలీయనీర్ అసలు ఊరు పేరు మాత్రమే కలిగిన ఓ లాయిర్ దగ్గరకు ఎందుకు వచ్చింది... తెనాలి రామకృష్ణ ఆ మాత్రం ఆలోచించకుండా ఆవేశపడిపోయాడా... ఈ కేసు వెనక ఉన్న అసలు కథేంటి... రుక్మిణి(హన్సిక)తో తెనాలి రామకృష్ణకు లవ్ స్టోరీ ఎలా మొదలైంది...కథలో ఆ ప్రేమ కథ ఎలా ఇమిడింది వంటి విశేషాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 
ఎలా ఉందంటే..

దర్శకుడు నాగేశ్వరరెడ్డి...మొదటనుంచీ ఫార్ములాని ఫెరఫెక్ట్ గా నమ్ముకుని నడుస్తున్నవాడు. వీక్ కథలతోనే కెరీర్ ని నడిపిస్తున్నవాడు. కామెడీ తో కథనం తొక్కేవాడు. అదే తెనాలి రామకృష్ణకు రిపీట్ చేసే ప్రయత్నం చేసాడు. చిన్న స్టోరీ లైన్ కు బోలెడంత కామెడీని అద్దాడు. అయితే అదిచాలా సార్లు పాతగా అనిపించవచ్చు.కానీ కొన్ని సార్లు ఖచ్చితంగా నవ్విస్తుంది. వరలక్ష్మీ పాత్ర కథలోకి వచ్చేదాకా కథ కదలదు. కేవలం పాత్రలు పరిచయం...తెనాలి రామకృష్ణ వృత్తికి సంభందించిన సీన్స్, హన్సికతో లవ్ ఎఫైర్ వీటితో లాగేస్తాడు. కథకు సెటప్ అవసరమే అయినా ఎక్కువ సేపు ఉన్నట్లుంది. కాంప్లిక్ట్ లేని సీన్స్ రన్ అవటంతో ప్రీ ఇంటర్వెల్ దాకా భారంగా అనిపిస్తుంది.

వరలక్ష్మి రాగానే కథలోకి కాంప్లిక్ట్ ప్రవేశించి ఇంట్రస్టింగ్ గా నడక నడవటం మొదలెడుతుంది.  సెకండాఫ్ లో కోర్టు సీన్ తో ఓపెన్ అయ్యి... ఫన్, థ్రిల్ తో నడిచే సీన్స్ తో బాగుందనిపిస్తుంది. అయితే ఆ స్పీడు అక్కడితోనే ఆగిపోయింది. నేరేషన్ స్లో అయ్యిపోవటం మొదలైంది. అయితే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఇంట్రస్ట్ గా అనిపించి రిలీఫ్ ఇస్తుంది. డైలాగులు బాగా రాసనా కథ రచనలోనే సమస్య ఉంది.  కథ సవ్యమైన నడక నడవకపోవటం, క్యారక్టరైజేషన్స్ సినిమాని ఎంత కామెడీ చేసినా కలిసొచ్చేలా చేయలేకపోయాయి. 

కేఏ పాల్, జగన్ కోడి కత్తి, గ్రామ వాలంటీర్స్ వంటి రిఫెరెన్స్ లతో కూడిన సీన్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సాయి కార్తీక్ సాంగ్స్..కు పెద్దగా కష్టపడినట్లు లేదు. కామెడీ సినిమాకు ఇవి చాలనుకున్నట్లున్నారు. అలాగే బ్యాక్ గ్రౌండ్  స్కోర్ కూడా యావరేజ్. ఛోటా కే ప్రసాద్ ఎడిటింగ్ మాత్రం చూసేవాడికి చాలా కోపం తెప్పించేలా ఉంది. ఏం ఇంకాస్త ట్రిమ్ చేయచ్చు కదా అని ప్రతీసారి అనిపిస్తుంది. సాయి శ్రీరామ్ కెమెరా వర్క్ ఎప్పటిలాగే బాగుంది.  నివాస్ డైలాగులు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. అక్కడక్కడా వల్గర్ టోన్ వినిపించినా.

లాయర్ గా సందీప్ కిషన్ జీవించాడు..అద్బుతం అనలేము కానీ...బానే చేసాడు అని చెప్పాలి. అయితే అతని ఈజ్, ఎనర్జీ మాత్రం సినిమాకు బాగా ప్లస్ అయ్యిందనే చెప్పాలి. కామెడీ, డాన్స్, యాక్షన్ వంటివి గతంలో ప్రూవ్ చేసుకున్నవే...ఇందులోనూ రిపీట్ చేసాడు.

ఫైనల్ థాట్..
ఈ రామకృష్ణుడు అల్లరి నరేష్ అయితే ఇంకొచెం అల్లరి ఉండేదేమో..

Rating: 2/5

Follow Us:
Download App:
  • android
  • ios