యాక్షన్ థ్రిల్లర్ ‘ట్యాక్సీ’రివ్యూ
థ్రిల్లర్స్ అంటే థ్రిల్లింగ్ గా అడుగడుగునా అనిపించాలి. ఇలా అన్నీ కుదిరితేనే.. ఇస్తేనే వర్కవుట్ అవుతాయి. ఈ విషయం కొత్త దర్శకులకు కొందరకుబాగా తెలుసు.
ఓటిటిలు వచ్చాక ప్రేక్షకుడు మైండ్ సెట్ మారిపోయింది. తనకు నచ్చిన సినిమాని ఎంపిక చేసుకునే ఆప్షన్స్ పెరిగిపోయాయి. చూసిన కథని పెద్ద హీరోలతో తప్పించి మళ్లీ చూడ్డానికి ఆసక్తి చూపడటం లేదు. ఈ క్రమంలో చిన్న సినిమాలో కొత్తదనం చూపాల్సిన సిట్యువేషన్ క్రియేట్ అయ్యింది. ఇది వరకటి సినిమాలో లేని కొత్త అంశమేదో.. కనిపించాలి. అది మాస్ మసాలా సినిమా అయితే.. ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండకూడదు అంటున్నారు. హీరోయిజం ఓ రేంజ్ లో ఉండాలి..థ్రిల్లర్స్ అంటే థ్రిల్లింగ్ గా అడుగడుగునా అనిపించాలి. ఇలా అన్నీ కుదిరితేనే.. ఇస్తేనే వర్కవుట్ అవుతాయి. ఈ విషయం కొత్త దర్శకులకు కొందరకుబాగా తెలుసు. మరి ఈ దర్శకుడు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని సినిమా చేసాడు? కథేంటి....ఏం నమ్మి ఈ సినిమాని మన ముందుకు తీసుకువచ్చాడు? వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథ
యంగ్ సైంటిస్ట్ ఈశ్వర్ (వసంత్ సమీర్ పిన్నమ రాజు) నిజాయితీపరుడు.తన ప్రయోగాలు దేశానికి ఉపయోగపడాలని భావిస్తూంటాడు. అతను కాలిఫోర్నియం 252 పై ప్రయోగాలు చేసి సక్సెస్ అవుతాడు. కాలిఫోర్నియం 252 తో బంగారం నిల్వలు కనిపెట్టవచ్చు. ఎక్కడో భూమి లోతుల్లో ఉన్న బంగార నిల్వల అంతు తేల్చచ్చు. అప్పుడు మన దేశం నెంబర్ వన్ అవుతుంది అని ఆశింతి గనుల శాఖా మంత్రి ముందు ప్రపోజల్ పెడతాడు. మరిన్ని ప్రయోగాలు కోసం సెంటర్ గవర్నమెంట్ నుంచి ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వమని అడుగుతాడు. అయితే కాలిఫోర్నియం 252 ఒక్కో గ్రాము 180 కోట్లు. అంతటి విలువైన సంపదను ఎవరు వదులుకుంటారు. పొలిటీషన్స్, వారిని అంటిపెట్టుకునే మాఫియా రంగంలోకి దూకుతుంది. ఈశ్వర్ లాంటి నిజాయితీ పరుడుని వంచటం కష్టం. అందుకే అతని పర్శనల్ లైఫ్ ని తమ గుప్పిట్లో తీసుకుంటే అనే ఆలోచన వస్తుంది. అక్కడ నుంచి ఈశ్వర్ పై నేరారోపణలు, అతని భార్య (అల్మాస్ మోటివాలా) మిస్సింగ్ లు జరిగిపోతూంటాయి. వాటి నుంచి ఈశ్వర్ తప్పించుకోవటానికి తన వంతు ప్రయత్నం మొదలెడతాడు.
మరో ప్రక్క ఎథికల్ హ్యాకర్ ఉజ్వల్ (సూర్య శ్రీనివాస్) కు కెరీర్ పరంగా ఎదటానికి మంచి కాంట్రాక్ట్ వస్తుంది. దాంతో స్నేహితులు,సన్నిహితులు నుంచి అప్పులు చేసి తెచ్చి మరీ తన సంస్దను డవలప్ చేస్తూ పై మెట్టు ఎక్కాలనుకుంటాడు. కానీ అనుకోని విధంగా తనకు వచ్చిన కాంట్రాక్ట్ సమస్యల్లో పడటం, ప్రాజెక్టు ఆగిపోవటం, చివరకు అప్పులు మిగలటం జరుగుతుంది. ఆ ఫైనాన్సియల్ ప్రెజర్ తట్టుకోవటానికి అతను ఓ డెసిషన్ తీసుకుంటాడు. ఇలా వేర్వేరు సమస్యలతో ఉన్న ఈశ్వర్, ఉజ్వల్ అనుకోని పరిస్దితుల్లో ఓ క్యాబ్ ఎక్కుతారు. ఆ క్యాబ్ పై కొందరు ఎటాక్ చేస్తారు. వాళ్లనుంచి తప్పించుకున్న వీళ్లిద్దరు తమపై ఎటాక్ కు ప్లాన్ చేసింది విద్యుత్ (నవీన్ పండిత) అని తెలుసుకుంటాడు. అతనెవరు..వీళ్లిద్దరని టార్గెట్ చేయటానికి కారణం ఏమిటి... ఎటాక్ జరిగిన తర్వాత నుంచి వాళ్ల జీవితాలు ఎలా టర్న్ తీసుకున్నాయి. మిస్సైపోయిన ఈశ్వర్ భార్యతిరిగి కనపడిందా..అతనిపై పడిన పోలీస్ కేసులు,నేరారోపణలు చివరకు ఏమయ్యాయి ..ఈ కథలో టాక్సీ డ్రైవర్ ( సద్దాం హుస్సేన్) పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ముందే చెప్పుకున్నట్లు ఓటిటిలు వచ్చాక థ్రిల్లర్స్ కు డిమాండ్ బాగా పెరిగింది. అలాగే మళయాళ థ్రిల్లర్స్ ని దాటే లా ఉండకపోతే పట్టించుకోవటం లేదు. ట్రెండ్ లో ఉంటూ కొత్త ఎలిమెంట్స్ ని కథలో చొప్పిస్తూ థ్రిల్ చేయాల్సిన అవసరం పెరిగింది. ఈ విషయాలను కొత్త దర్శకుడు హరీష్ సజ్జా గమనిస్తూనే ఉన్నారు. దాంతో మూస ధోరణిలో వెళ్లకుండా కొత్త తరహా సినీ ప్రపంచాలని ఆవిష్కరించే ప్రయత్నం చేసాడు. కొన్ని సార్లు తడపడ్డా..పడిపోకుండా టాక్సీని రైట్ ట్రాక్ లో నడిపే ప్రయత్నం చేసాడు. టాక్సీ ఎక్కిన ఇద్దరి వ్యక్తుల జీవితాలను వారి గతం ఎలా వెంబడించింది...ఒకరికొకరు తెలియకుండా టాక్సీ ఎక్కినా...వాళ్లిద్దరు ఒకరికొకరు ఎలా ఇంటర్ లింక్ అయ్యి ఉన్నారు వంటి ఆసక్తికరమైన ట్విస్ట్ లు రాసుకుని ఈ దర్శకుడు తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ వరకు హీరోని సమస్యలో పడేయటం..... సెకండ్ హాఫ్ లో ఆ సమస్యనుంచి బయిటపడటానికి అతను ఏం ప్రయత్నం చేసాడు..ఎలా తన సమస్యలను అధిగమనించాడు అన్న థోరణిలో స్క్రీన్ ప్లే రాసుకున్నారు.
ఇలాంటి కథ ఓపెన్ చేసినప్పుడు ఒక ఎమోషన్ తో ప్రేక్షకుడు కనెక్ట్ చేసేయాలి. అందుకు కొద్దిగా ఎక్కువ టైమ్ తీసుకున్నారు. అలాగే ఇలాంటి థ్రిల్లర్ కథల్లో ఉత్కంఠ నెలకొల్పడం చాలా కీలకం. విలన్ చేతిలో ఇరుక్కుపోయిన హీరోకు ఏదైనా జరుగుతుందేమో అనే టెన్షన్ క్రియేట్ కావాలి.. అలా చేయటంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. దాంతో హీరోకు ఏం కాదులే అని రిలాక్స్ అవటానికి ప్రేక్షకులుకు అవకాసం దొరకలేదు. ఇది కంప్లీట్ గా దర్శకుడి సినిమా. థ్రిల్లర్ అయినా రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కు లోటు రానివ్వలేదు. .ముఖ్యంగా కొత్త హీరోపైనా భారీ యాక్షన్ సీన్లు ప్లాన్ చేసారు. అవి పండాయి.. చివర్లో హ్యాకింగ్ నేపధ్యంలో డిజైన్ చేసిన ఫైట్ సీక్వెన్స్ ఒక స్పెషల్ ఎట్రాక్షన్. యాక్షన్ ని ఇష్టపడే వారికి ఇవన్నీ బాగా నచ్చుతాయి. సెకండాఫ్ లో వచ్చే కీ ట్విస్ట్ కూడా ఊహించలేము. మిగతావి మన ఊహకు అందుతాయి. బడ్జెట్ ఇంకాస్త ఉండి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
నటీనటుల్లో ...
హీరోగా చేసిన వసంత్ సమీర్ పిన్నమ రాజు చాలా భాగం వన్ మ్యాన్ షోలాగ సినిమాని తన భుజాలపై మోసాడు. డైలాగు డెలవరీ బాగుంది. రానా, ప్రభాస్ లు గుర్తు వచ్చారు. ఫైట్స్ లో కూడా తన మార్క్ చూపించాలనే తపన కనపడింది. వినియోగించుకుంటే మంచి యాక్షన్ హీరో అనిపిస్తాడు తెలుగుకి తనదైన గ్రేస్ తో అలరించాడు. హీరోయిన్స్ పాత్రలు సోసోగా ఉన్నాయి. మరో కుర్రాడు సూర్య శ్రీనివాస్, కూడా చక్కగా చేసాడు. విలన్ నవీన్ పండిత కొత్తగా అనిపించాడు. సద్దాం హుస్సేన్ లో మంచి కామెడీ ఈజ్ ఉందని మరోసారి ప్రూవ్ అయ్యింది.
టెక్నికల్ గా ...
దర్శకుడు హరీష్ సజ్జా ఏదో కొత్తదనం ఇవ్వాలనే తపన అయితే చాలా చోట్ల కనపడింది. కథలో ఎలాంటి డైవర్షన్స్ తీసుకోకుండా నిజాయితీగా ఒక థ్రిల్లర్ ని ప్రజెంట్ చేసే ప్రయత్నం జరిగింది. పాత్రలని, ట్విస్ట్ లని మరికాస్త బలంగా రాసుకొని వుంటే ఫలితం ఇంకాస్త మెరుగ్గా వుండేది. తన తొలి చిత్రానికే టెక్నాలజీకి మోసాన్ని ముడిపెడుతూ ఓ డిఫరెంట్ కథాంశాన్ని ఈ ట్యాక్సీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. అలాగే బలవంతుడంటే బలమున్నోడు కాదు బలహీనత లేనోడు.. అలాంటి బలహీనత కలిగిస్తే భగవంతుడైనా బలహీనపడాల్సిందే వంటి డైలాగులు నేచురల్ గా బాగున్నాయి.
ఇక మార్క్ k రాబిన్ నేపధ్య సంగీతం బాగుంది. అద్బుతం అని చెప్పలేం. ఫస్టాఫ్ లో వచ్చే ఓ పాట చాలా బాగుంది. ఉరుకుండారెడ్డి కెమరా పనితనం నచ్చుతుంది. విజువల్స్ రిచ్ గా బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమాకు సరపడా ఉన్నాయి. డబ్బింగ్ పై ఇంకాస్త ద్రుష్టి పెట్టాల్సిందేమో అనిపిస్తుంది. ఈ సినిమాలో హైలెట్ ఫైట్ మాస్టర్ బి.జె శ్రీధర్ కొత్త తరహాలో చేసిన స్టంట్స్.
హైలెట్స్
వసంత్ సమీర్ పిన్నమ రాజు నటన,
ఇంటర్వెల్ ముందు ఫైట్
కథనం
డైలాగులు
మైనస్ లు
ఫస్టాఫ్ ని సెకండాఫ్ దాటలేకపోవటం
ఆర్టిస్ట్ లు తెలిసిన వాళ్లు పెద్దగా లేకపోవటం
ఫైనల్ థాట్
ట్విస్ట్ లతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ సినిమా మిమ్మల్ని నిరాశపరచదు.
Rating:2.75
బ్యానర్: హెచ్ అండ్ హెచ్ ఎంటర్టెన్మెంట్స్
నటీనటులు: వసంత్ సమీర్ పిన్నమ రాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్య మీనన్ , ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత తదితరులు.
సంగీతం : మార్క్ k రాబిన్
సినిమాటోగ్రఫీ : ఉరుకుండారెడ్డి
విఎఫ్ఎక్స్ : ఆనంద్ పల్లకి
ఎడిటర్: టి.సి.ప్రసన్న
దర్శకత్వం: హరీష్ సజ్జా
నిర్మాత: హరిత సజ్జా
విడుదల తేదీ:10, మార్చి 2023.