Asianet News TeluguAsianet News Telugu

Thippara Meesam Review: శ్రీ విష్ణు `తిప్పరా మీసం` రివ్యూ

పవర్ ఫుల్ టైటిల్,  సెన్సేషనల్‌ హిట్‌ 'అర్జున్ రెడ్డి'ని గుర్తు చేసే ట్రైలర్, డ్రగ్స్‌, మందు, అమ్మాయిలకు బానిసైన ఓ ఆవేశపరుడైన కుర్రాడి క్యారక్టరైజేషన్ ఇవన్నీ యూత్ కు టార్గెట్ చేస్తూ...   ఖచ్చితంగా సినిమా చూడాలనిపించే ఎలిమెంట్సే.  అయితే ఇవన్నీ ఫెరఫెక్ట్ గా వర్కవుట్ అవ్వాలంటే వీటిని అందిపుచ్చుకునే కథ,కథనం ఉండాలి. అలాగే  సాఫ్ట్ రోల్స్ చేసుకుంటూ పోతున్న శ్రీవిష్ణు కు ఈ పాత్ర ఎంతవరకూ నప్పుతుంది...ఒప్పించగలడు అనేదే ప్రధానమైన ప్రశ్న. టైటిల్ తగ్గట్లుగా అతని కెరీర్ లో పెద్ద హిట్ కొట్టి తనేంటో చెప్తూ  మీసం తిప్పే సినిమాయేనా? నెగిటివ్ షేడ్స్ లో డార్క్ మోడ్ లో  కనపడే ఈ కథని ఎంత వరకూ మనం ఆస్వాదించగలం... అసలా ఆ కథేంటి, బ్రోచేవారెవరురా సినిమాతో శ్రీ విష్ణు  రీసెంట్ గా మంచి విజయం అందుకోవడంతో తిప్పరామీసం సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.   వాటిని అందుకోగలిగాడా...  వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.
--సూర్య ప్రకాష్ జోశ్యుల
 

Sree Vishnu's Thippara Meesam telugu Review
Author
Hyderabad, First Published Nov 8, 2019, 1:07 PM IST

కథేంటి

మణి శంకర్ (శ్రీవిష్ణు) పబ్ లో డీజే గా చేస్తూంటాడు. స్కూల్ టైమ్ నుంచీ ఆల్కహాల్ కు డ్రగ్స్ కు అలవాటు పడతాడు. అతని తల్లి లలితమ్మ (రోహిణి)కు అతని చేష్టలకి విసుగు వచ్చేసి, ఓ రీహేబిటేషన్ సెంటర్లో జాయిన్ చేస్తే అక్కడ నుంచి పారిపోతాడు. తన తల్లి ఇలా జాయిన్ చేసిందని, ఆమెపై కోపం పెంచుకుని,  మరీ దారుణంగా తయారవుతాడు. అతని వయస్సుతో పాటు ఆ కోపం పెరిగిపెద్దై..చివరకు తల్లిపైనే కక్ష తీర్చుకునే వ్యక్తిలా తయారవుతాడు. ఈ క్రమంలో ఓ సారి మణి.. క్రికెట్ బెట్టింగ్ లో 30 లక్షలు పోగొట్టుకుంటాడు.  రెండు నెలల్లో తిరిగి ఇవ్వాల్సిన డెడ్ లైన్. దాంతో ఆ డబ్బులు ఎక్కడా దొరక్కపోవటంతో... అడవిలో సాగే ఓ డేంజర్ గేమ్ కు మూడు లక్షలు ఎంట్రీ ఫీజ్ కట్టి పాల్గొంటాడు. ఆ ఇల్లీగల్ గాంబ్లింగ్ గేమ్ లో గెలిచి ఇరవై లక్షలు ప్రైజ్ మనీ సంపాదిస్తే..దాన్ని కాళీ అనే వేరే పార్టిసిపేంట్ పట్టుకుని జంప్ అవుతాడు. దాంతో నిర్దాక్ష్యణంగా డబ్బు వసూలు చేసే బుకీ జోసఫ్ ప్రెజర్ పెంచేస్తాడు.  

దాంతో తల్లి దగ్గరకు వెళ్లి ఆ డబ్బు ఇవ్వమని అడుగుతాడు. ఆమె తన దగ్గర కేవలం ఐదు లక్షలే ఉందని చెక్ ఇస్తే ...దాన్ని తీసుకుంటాడు. ఆ తర్వాత దాన్ని నలభై లక్షలకు పోర్జరీ చేస్తాడు. బ్యాంక్ లో నలభై లక్షలకు తగ్గ డబ్బు ఆమె ఎక్కౌంట్ లో లేకపోవటంతో చెక్ బౌన్స్ అవుతుంది. దాంతో మణి ఓ లీగల్ నోటీస్ ని తల్లికి పంపుతాడు. ఇదంతా మీడియాలో హెడ్ లైన్స్ లో వస్తుంది.

మరో ప్రక్క డ్రగ్స్ తీసుకుని ..అతని గర్ల్ ఫ్రెండ్ మౌనిక (నిక్కీ తంబోలి) పైనే రేప్ ఎటెమ్ట్ చేయబోతాడు. అతని ఎక్సట్రీమ్ బిహేవియర్ భరించలేక,వదిలేసి వెళ్లిపోతుంది. ఈ లోగా  కోర్టులో చెక్ బౌన్స్ కేసు తల్లిపై కేసు గెలుస్తాడు. కొడుకు ఫ్రాడ్ అనిపించుకోవటం ఇష్టంలేని ఆమె ఫోర్జరీ చేసాడనే నిజం చెప్పకుండా... తన  ఇల్లు అమ్మి నలభై లక్షలు కడుతుంది. మణి మొత్తం డబ్బుని క్రికెట్ బుకీకు పే చేసి ఫైనాన్సియల్ ప్రెజర్ నుంచి బయిటపడతాడు.

ఇక లైఫ్ కూల్ అనుకునే సమయానికి.. ఊహించని విధంగా డ్రగ్ కేసు లో ఇరుక్కుంటాడు.  అతన్ని ఇంటరాగేట్ చేసే ఆఫీసర్ మరెవరో కాదు అతని గర్ల్ ఫ్రెండే మౌనికే. దాన్ని నుంచి బయిటపడే సమయానికి ఓ మర్డర్ కేసులో ఇరుక్కుని ఏడు సంవత్సరాలు జైలు పాలవుతాడు. కానీ నిజానికి ఆ హత్య అతను చెయ్యలేదు. మరి ఎవరు ఈ హత్య చేసి ఇరికించారు. ఈ లోగా అతని జీవితంలో దాచేయబట్ట ఓ రహస్యం రివీల్ అవుతుంది. దాంతో మణిశంకర్ లో మార్పు వస్తుంది. ఇంతకీ ఏమిటా రహస్యం...చివరకు ఆ తల్లి..కొడుకులు ఒకటయ్యారా..అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే...

ఇది క్యారక్టర్ డ్రైవెన్ ప్లాట్. ప్లాష్ బ్యాక్ నేరేషన్ లో జరుగుతుంది.  ఆ క్యారక్టర్ ను మనం ఇష్టపడితేనే అతని ఇబ్బందులు,కష్టాలుని మనం అనుభవించగలం. ఇక్కడ దర్శకుడు అది చేయలేకపోయాడు. పూర్తిగా హీరోను యాంటి సోషల్ ఎలిమెంట్ గా చూపిస్తాడు. అది కూడా ఎంటర్టైన్మెంట్ వేలో ఉండదు. చాలా నేచురల్ గా చూపిస్తున్నామనుకుని సీన్స్ లో మినిమం కాంప్లిక్ట్ లేక విసిగిస్తాడు. ఫస్టాఫ్ పూర్తిగా యాంటి సెంటిమెంట్ తో రన్ అయ్యింది. తల్లిపై రివేంజ్ తీర్చుకునే ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉందనుకునే లోగా...బొత్తిగా బోర్ కొట్టిస్తుంది. అప్పటికీ  శ్రీ విష్ణు తన నటనతో లాక్కెళ్లే ప్రయత్నం చేసినా..కామెడీ కానీ, రొమాన్స్ కానీ, థ్రిల్లింగ్ మూవ్ మెంట్స్ కానీ అసలేమీ లేకుండా అలా వెళ్లటంతో ఇంటర్వెల్ దాకా ఏమీ జరగలేదనిపించింది.  ఇక సెకండాఫ్ లోనూ అదే వరస..పెద్దగా మార్పేమీ ఉండదు. ప్రీ క్లైమాక్స్ లోనే కాస్తంత కథ కదులుతుంది. హీరో మర్డర్ కేసులో ఇరుక్కునే దాకా సినిమాలో కదలిక ఉండదు. ఒకే రకమైన సీన్స్ రిపీట్ అవుతూంటాయి. క్లైమాక్స్ లో మరీ ఓవర్ మదర్ సెంటిమెంట్...తమిళ సినిమాలను గుర్తు చేస్తుంది.  అయితే సెంటిమెంట్ నచ్చేవాళ్లకు లాస్ట్ అరగంట నచ్చచ్చు. తల్లి సెంటిమెంట్ చూస్తూంటే ...ఛత్రపతిలో సీన్స్ గుర్తు వస్తూంటాయి.

నటీనటులు,టెక్నికల్ ఎలిమెంట్స్..

 'నీదీ నాదీ ఒకే కథ'లో తండ్రితో ఎప్పుడూ తిట్లు తినే కొడుకుగా కనిపించిన శ్రీవిష్ణు, ఈ 'తిప్పరా మీసం'లో తల్లితో నిత్యం ఘర్షణ పడే కొడుకుగా మెప్పించాడు. ముఖ్యంగా అతని వాయిస్ బాగా ప్లస్ అయ్యింది. కాకపోతే కంటెంట్ కలిసి రాక, నటన కూడా నసగా మారింది. ఇక శ్రీవిష్ణు జోడీగా 'కాంచన 3', 'చీకటిగదిలో చితక్కొట్టుడు' సినిమాల హీరోయిన్ నిక్కీ తంబోలి నటించింది. ఆమెను  హీరోయిన్ గా డైజస్ట్ చేసుకోవటం కష్టం అనిపిస్తుంది. అందుకేనేమో అసలు రొమాన్స్, లవ్ సీన్స్ పెట్టలేదు.

ప్రొడక్షన్ వ్యాల్యూస్ జస్ట్ ఓకే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ..కొన్ని సీన్స్ ని విషయం లేకపోయనా ఏదో ఉన్నట్లు అనిపించింది. అర్జున్ రెడ్డి లోని రెక్లెస్ నెస్ కు మదర్ సెంటిమెంట్ కలిపారు కానీ స్క్రీన్ ప్లే సరిగా రాసుకోకపోవటం ఇబ్బందిగా తయారైంది. మిగతా విభాగాలు అన్నీ సినిమాకు తగ్గట్లే ఉన్నాయి. చెప్పుకోదగ్గవి ఏమీ లేవు. డైలాగులు కొన్ని బాగున్నాయి.

  ఫైనల్ ధాట్
అనుకరణ తో  'అర్జున్ రెడ్డి' అవ్వలేరు  

Rating: 1.5/5

ఎవరెవరు..
బ్యాన‌ర్: శ్రీ ఓం సినిమా- రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్- ఎల్ కృష్ణ విజయ్ ప్రొడక్షన్స్
న‌టీన‌టులు: శ్రీ‌విష్ణు, నిక్కీ తంబోలి, రోహిణి త‌దిత‌రులు
సంగీతం: సురేష్ బొబ్బిలి
కెమెరా:  సిధ్
ద‌ర్శక‌త్వం: కృష్ణ విజయ్‌.ఎల్‌
రిలీజ్ తేదీ: 08 న‌వంబ‌ర్ 2019

also read: ఏడు చేపల కథ’ రివ్యూ!

                మీకు మాత్రమే చెప్తా మూవీ రివ్యూ

 

Follow Us:
Download App:
  • android
  • ios