Asianet News TeluguAsianet News Telugu

రానా వివాహం..ఎంతమందికి ఆహ్వానం అంటే..

ఆగస్టులోనే రానా.. మిహికా మెడలో మూడు ముళ్లు వేయనున్నరు. అయితే ఇండియాలో కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉండటంతో కొద్ది మంది బంధువుల మధ్యే పెళ్లి చేసుకుంటారా లేక విదేశాల్లో పెళ్లి జరుపుతారా ? అన్న విషయంలో ఫ్యాన్స్ మధ్య డిస్కషన్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఓ ఇన్ సైడ్ ఇన్ఫో బయిటకు వచ్చింది.

Rana Miheeka wedding to have only 70 guests
Author
Hyderabad, First Published Jun 2, 2020, 8:48 AM IST


లాక్‌డౌన్‌ సమయంలో తన ప్రేమ విషయాన్ని బయటపెట్టి వివాహానికి సిద్దపడుతున్నారు టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ రానా. తన ప్రేమకు మిహికా బజాజ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇరువైపుల కుటుంబాలు కలిసి రీసెంట్ గా  ‘రోకా’ ఫంక్షన్ కూడా నిర్వహించారు. అలాగే ఆగస్టులోనే రానా.. మిహికా మెడలో మూడు ముళ్లు వేయనున్నరు. అయితే ఇండియాలో కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉండటంతో కొద్ది మంది బంధువుల మధ్యే పెళ్లి చేసుకుంటారా లేక విదేశాల్లో పెళ్లి జరుపుతారా ? అన్న విషయంలో ఫ్యాన్స్ మధ్య డిస్కషన్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఓ ఇన్ సైడ్ ఇన్ఫో బయిటకు వచ్చింది.

అందుతున్న సమాచారం మేరకు..ఈ వివాహానికి రెండు వైపుల నుంచి కేవలం డబ్బై మంది మాత్రమే హాజరుకానున్నారు. హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్  లోని ఓ ప్రెవేట్ ఫామ్ హౌస్ లో ఈ వివాహం మూడు రోజులు పాటు జరగనుంది. ఇదో ప్రెవేట్ పంక్షన్ గా జరపనున్నారు. అయితే వివాహం మాత్రం చాలా లావిష్ గా జరపనున్నారు.
  
రీసెం గా రానా వివాహం గురించి సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘లాక్‌డౌన్ వల్ల పెళ్లి పనులకు టైమ్ దొరికింది. ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాం. ఆగస్టు 8న కుటుంబ సభ్యుల సమక్షంలో మ్యారేజ్‌కు సంబంధించిన ఫంక్షన్ ఉంటుంది. ఈ శుభకార్యానికి ప్రభుత్వ నిబంధనలు పాటిస్తాం’ అని చెప్పారు. 

అలాగే ఇటీవల మంచు లక్ష్మీతో ఇన్‌స్టా లైవ్‌ చాటింగ్‌లో పాల్గొన్న రానా తన ప్రేమ, పెళ్లి తదితర విషయాలపై సమాధానిమిచ్చారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ ‘రోకా వేడుకకు పిలవలేదు. కనీసం పెళ్లికైనా నీ స్నేహితులను పిలుస్తావా..? అంటూ ప్రశ్నించింది. దానికి రానా.. ‘అప్పటి పరిస్థితులను బట్టి పిలుస్తా. ఒకవేళ అప్పుడు కూడా ఇప్పటి పరిస్థితులే ఉన్నట్టయితే ఫొటోలు పంపిస్తా చూడండి’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు.

హైదరాబాద్ చెందిన బంటీ బజాజ్, సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె మిహికా. ఆమె చెల్సియా వర్సిటీ నుంచి ఇంటీరియర్ డిజైన్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఇంటీరియర్ డిజైనింగ్ లో రాణించడంతో..డ్యూ డ్రాప్ డిజైన్ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ నడుపుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios