కామెడీ విలన్‌ ఫిష్‌ వెంకట్‌ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కిడ్నీల ఫెయిల్యూర్‌తో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్న ఆయనకు సాయం చేసేందుకు ప్రభాస్‌ ముందుకు వచ్చారు. 

డార్లింగ్‌ ప్రభాస్‌ మరోసారి తన పెద్ద మనసుని చాటుకున్నారు. ఆయన తెలుగు ప్రజలకు ఏ ఆపద వచ్చినా తనవంతు సాయం అందించడం మనం చూశాం. కరోనా సమయంలో, వరద బాధితులకు కోట్లల్లో సహాయాలు అందించారు. అదే సమయంలో ఆపదలో ఉన్నవారిని కూడా ఆదుకున్నారు.

నటుడు ఫిష్‌ వెంకట్‌కి ప్రభాస్‌ భారీ సాయం

 సాయం కోసం తన గడపతొక్కితే కాదనకుండా సాయం చేసే మనసు ఆయనది. తన గొప్ప మనసుని చాటి చెబుతుంటారు. తాజాగా ఆయన మరోసారి ఆయన తన పెద్ద మనసుని చాటుకున్నారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న నటుడు ఫిష్‌ వెంకట్‌కి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

కామెడీ విలన్‌గా ఎన్నో సినిమాల్లో నటించి అలరించారు ఫిష్‌ వెంకట్‌. ఆయన ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు. కిడ్నీలు డ్యామేజ్‌ కావడంతో చాలా కాలంగా ఆసుపత్రి పాలయ్యారు. 

దాన్నుంచి కోలుకుని మామూలు మనిషి అయ్యారు, కానీ ఇప్పుడు మరోసారి ఆయన కిడ్నీల సమస్యతో బాధపడుతున్నారు. ఈ సారి ఆ సమస్య చాలా తీవ్రంగా మారింది. దీంతో గత కొన్ని రోజులుగా ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. 

ఆపరేషన్‌ చేస్తేగానీ సెట్‌ కాదని వైద్యులు సూచించారు. అయితే వారి కుటుంబానికి ఆ స్థోమత లేదు. దీంతో సహాయం కోసం వేడుకుంటూ వస్తున్నారు.

కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న ఫిష్‌ వెంకట్‌

సినీ పెద్దలు ఎవరైనా సహాయం చేస్తారేమో అని వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. ఫిష్‌ వెంకట్‌ భార్య స్వయంగా వేడుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రభాస్‌ స్పందించారు. ఆపరేషన్‌కి రెడీ అవ్వమని వారికి తెలిపారు. ఈ విషయాన్ని ఫిష్‌ వెంకట్‌ కూతురు వెల్లడించారు.

 ప్రభాస్‌ అసిస్టెంట్‌ నుంచి ఫోన్‌ వచ్చిందని, ఆపరేషన్‌కి రెడీ అవ్వమని, డోనర్‌ని రెడీ చేసుకోమని తెలిపినట్టు ఆమె వెల్లడించింది. అయితే కిడ్నీ డోనర్‌ కోసం వేచి చూస్తున్నామని చెప్పారు. తమ ఫ్యామిలీ మెంబర్స్ కి బ్లడ్‌ కలవడం లేదని తెలిపింది. 

ఇతరుల నుంచి కిడ్నీ డోనర్స్ ని చూస్తున్నామని తెలిపింది. కిడ్నీ డోనర్‌ దొరికితే ఆపరేషన్‌కి కావాల్సిన డబ్బు తాము అందిస్తానని ప్రభాస్‌ టీమ్‌ తెలిపినట్టు ఆమె వెల్లడించారు. 

అయితే ఈ ఆపరేషన్‌కి దాదాపుగా యాభై లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు సూచించినట్టు తెలిపారు. దీంతో ప్రభాస్‌ యాభై లక్షల వరకు సహాయం చేసేందుకు ముందుకు రావడం విశేషం.

ప్రభాస్‌ సినిమాలు

ఇక ప్రభాస్‌ నటుడిగా ఇప్పుడు బిజీగా ఉన్నారు. ఆయన `ది రాజా సాబ్‌` షూటింగ్‌లో పాల్గొంటున్నారు. దీంతోపాటు హను రాఘవపూడ దర్శకత్వంలో `ఫౌజీ` చిత్రం చేస్తున్నారు. ఇందులోని ఆయన లుక్‌ ఇటీవలే లీక్‌ అయిన విషయం తెలిసిందే. 

ఈ ఏడాది చివర్లో `ది రాజా సాబ్‌` మూవీ విడుదల కానుంది. వచ్చే ఏడాది `ఫౌజీ` మూవీ రాబోతుంది. దీంతోపాటు `స్పిరిట్‌`, ప్రశాంత్‌ వర్మతో ఓ మూవీ, `సలార్‌ 2`, కల్కి 2` చిత్రాలు చేయాల్సి ఉంది.