`వకీల్‌సాబ్‌` చిత్రం వచ్చే నెలలో ఇది ఓటీటీలో వస్తుందనే ప్రచారం జరిగింది. కానీ తాజాగా అధికారికంగా ఇది ఓటీటీలో వచ్చే డేట్‌ని ప్రకటించింది యూనిట్‌. 

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన `వకీల్‌సాబ్‌` ఈ నెల 9న విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ఏకంగా వందకోట్లకి పైగా కలెక్షన్లని రాబట్టింది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇంకా థియేటర్లలో రన్‌ అవుతుంది. అయితే కరోనా కారణంగా చాలా వరకు థియేటర్లు బంద్‌ పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసినిమాని ఓటీటీలో తీసుకురావాలని చిత్ర బృందం భావించింది. 

వచ్చే నెలలో ఇది ఓటీటీలో వస్తుందనే ప్రచారం జరిగింది. కానీ తాజాగా అధికారికంగా ఇది ఓటీటీలో వచ్చే డేట్‌ని ప్రకటించింది యూనిట్‌. ఈ నెల 30నే అమెజాన్‌ ప్రైమ్‌లో రాబోతుందని పేర్కొంది. బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అయిన `పింక్‌` చిత్రానికిది రీమేక్‌ అనే విషయం తెలిసిందే. మాతృకలో ప్రధాన అంశాన్ని మార్చకుండా, తెలుగుకి తగ్గట్టు పవన్‌ మార్క్ స్టయిల్, కమర్షియల్‌ అంశాలు జోడించి తెరకెక్కించారు. తెలుగులో ఈ సినిమాకి బ్రహ్మారథం పడుతున్నారు. 

Scroll to load tweet…

లాయర్లు గా పవన్‌, ప్రకాష్‌ రాజ్‌, బాధితులుగా నివేదా థామస్‌, అంజలి నటనలకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. నేటి కాలంలో మహిళలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చిత్రంలో చూపించిన అంశాలు ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా మహిళలకు మరింతగా కనెక్ట్ అవుతున్నాయి. `మగువ మగువ .. `సాంగ్‌ సినిమా రేంజ్‌ని మార్చేసింది. ఈ సినిమాని దిల్‌రాజు నిర్మించిన విషయం తెలిసిందే.