Lata Mangeshkar..ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కన్నుమూత
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ముంబై: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం నాడు మరణించారు. గత నెల 8వ తేదీన Coronaతో Lata Mangeshkar ఆసుపత్రిలో చేరారు అప్పటి నండి ఆమె ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. శనివారం నాడు ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. వివిధ భాషల్లో సుమారు 30 వేలకు పైగా లతా మంగేష్కర్ Songs పాడారు. తెలుగులో ఆమె మూడు పాటలు పాడారు. 1942లో ఆమె తొలి పాట పాడారు. అప్పుడు ఆమె వయస్సు 13 ఏళ్లు.
కరోనాతో బాధపడుతున్న లతా మంగేష్కర్ న్యుమెనియతో బాధపడుతున్నారని శనివారం నాడు ఆసుపత్రి వర్గాలు ప్రకటించారు. వెంటిలేటర్ పై ఉంచి ఆమెకు చికిత్స అందిస్తున్నామని hospital వర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు శనివారం నాడు ఆసుపత్రి వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి. అయితే లతా మంగేష్కర్ కోలుకోవాలని దేశ వ్యాప్తంగా ఆమె అభిమానులు ప్రార్ధనలు చేశారు. కానీ ఆదివారం నాడు ఆమె మరణించారు.
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని ఇవాళ ఉదయం ఆమెను పరీక్షించిన doctors బృందం ప్రకటించింది. ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని కూడా వైద్యులు ప్రకటించారు. డాక్టర్ ప్రతీత్ సమదానీ నేతృత్వంలోని వైద్యుల బృందం లతా మంగేష్కర్ ఆరోగ్యాన్ని పరీక్షించారు. 28 రోజుల పాటు ఆమె ఆసుపత్రిలోనే చికిత్స పొందారు.
అనారోగ్యం నుండి కోలుకొంటున్న సమయంలోనే మళ్లీ ఆమె ఆరోగ్యం క్షీణించిందని శనివారం నాడు వైద్యులు ప్రకటించడంతో కుటుంబ సభ్యులు సహా ఆమె అభిమానులు ఆందోళన చెందారు. భారతరత్న సహా పలు అవార్డులు అమెకు దక్కాయి. పద్మ విభూషణ్, పద్మభూషన్ అవార్డులు ఆమె అందుకొంది.
980 సినిమాల్లో ఆమె పాటలు పాడారు. 1947లో మాజ్‌బూర్ చిత్రంతో ఆమె గాయనిగా ప్రస్థానం మొదలైంది. 1928, సెప్టెంబర్ 28న ఆమె జన్మించారు. భారత గానకోకిలగా ఆమె గుర్తింపు పొందింది. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ఆమెను పిలుచుకొంటారు. 1989లో దాదా సాహెచ్ ఫాల్కే అవార్డు ఆమెకు దక్కింది. 1999లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు లభించింది. శాంతినికేతన్, శివాజీ విశ్వవిద్యాలయాలు ఆమెకు గౌరవ డాక్టరేట్లను అందించాయి. 2006లో ది లీజియన్ ఆఫ్ హానర్ అవార్డును ఫ్రాన్స్ అందించింది. అత్యధికంగా ఆమె హిందీ, మరాఠీ భాషల్లో పాటు పాడారు.
లతా మంగేష్కర్ మరణవార్త తెలుసుకొన్న పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆమెను కడసారి చూసేందుకు ఆసుపత్రికి క్యూ కట్టారు. తెలుగులో ఆమె మూడు పాటలు పాడారు. 1955లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన సంతానం సినిమాలో నిదురోరా తమ్ముడా అనే పాట పాడారు. 1965లో ఎన్టీఆర్ దొరికితే దొంగలు సినిమాలో శ్రీవెంకటేశ పాట పాడారు. గురువు అమాన్ అలీఖాన్ వద్ద సంగీతం పాఠాలు నేర్చుకొన్నారు. 170 మంది సంగీత దర్శకుల వద్ద ఆమె పాటలు పాడారు. ఆలేలా, ఛత్రపతి శివాజీ, ఆనార్కలీ సినిమాలతో ఆమెకు గుర్తింపు లభించింది.