Asianet News TeluguAsianet News Telugu

కార్తికేయ '90 ఎమ్‌.ఎల్‌' రివ్యూ!

మన అదృష్టవశాత్తు గత కొంతకాలంగా తెలుగు సినిమా అరుదైన మెడికల్ కండీషన్స్ ని డిజార్డర్స్ ని మనకు చెప్పి ఎడ్యుకేట్ చేసే పనిలో పడింది. ఇప్పుడు ‘ఫేటెల్ ఆల్కహాల్ సిండ్రోమ్' అనే అరుదైన కండీషన్ ని పరిచయం చేస్తూ ఓ కొత్త దర్శకుడు తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యాడు. 

Karthikeya's 90 ML  Telugu Movie Review
Author
Hyderabad, First Published Dec 6, 2019, 2:00 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

--సూర్య ప్రకాష్ జోశ్యుల
మన అదృష్టవశాత్తు గత కొంతకాలంగా తెలుగు సినిమా అరుదైన మెడికల్ కండీషన్స్ ని డిజార్డర్స్ ని మనకు చెప్పి ఎడ్యుకేట్ చేసే పనిలో పడింది. ఇప్పుడు ‘ఫేటెల్ ఆల్కహాల్ సిండ్రోమ్' అనే అరుదైన కండీషన్ ని పరిచయం చేస్తూ ఓ కొత్త దర్శకుడు తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఆర్ ఎక్స్ 100తో తనేంటో ప్రూవ్ చేసుకున్న కార్తికేయ ఆ తర్వాత వచ్చిన రెండు చిత్రాలు తేడా కొట్టడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో వచ్చిన ఈ 90 ఎమ్ ఎల్ సినిమా ఏ మేరకు అతనికి ప్లస్ అవుతుంది. ఈ సినిమా కథేంటి..ఆ సిండ్రోమ్ ని సినిమాలో ఎలా వాడారు. టైటిల్ కు తగ్గట్లే ఈ సినిమా మనకు కిక్ ఇస్తుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి..?

అనగనగా ఓ దేవదాసు (కార్తికేయ) . అతను పుట్టుకతోటే మనం పైన చెప్పుకున్న ఫేటెల్ ఆల్కహాల్ సిండ్రోమ్ సమస్యతో పుడతాడు. దాంతో డాక్టర్స్ అతనికి రోజుకి మూడు సార్లు 90 ఎమ్ ఎల్ డోస్ ఇవ్వమని ప్రిస్కైబ్ చేస్తారు. అతని రోగానికి అదే విరుగుడు..మందు..వగైరా అని ఆ డాక్టర్ చెప్తాడు. అయితే చిన్నప్పుడు పెద్దగా ఈ తాగుడు సమస్య ఇబ్బంది పెట్టదు కానీ, ఓ వయస్సు వచ్చాక అతనికి ఈ 90 ఎమ్ ఎల్ వ్యవహారం రకరకాల తలనొప్పులు తెచ్చిపెడుతుంది. చదువులో నూటికి తొంబై శాతం మార్కులు తెచ్చుచుకున్నా 90 ఎమ్ ఎల్ తాగుడు విషయం తెలిసి  ఏ కంపెనీ ఉద్యోగం ఇచ్చి ఆదుకోదు.ఇతనో ఆర్ధరైజ్డ్ డ్రింకర్ అన్నా జాలి చూపించరు.

 అయితే ఓ సంఘటనలో  మన హీరో ఓ చిన్న పిల్లాడిని సేవ్ చేయటం, అది వైరల్ అవటంతో సువాసన (నేహా సోలంకి ప్రేమలో పడిపోతుంది. అయితే ఆమెకు కానీ, ఆమె కుటుంబానికి కానీ ఈ తాగుడు గోల, వాసన పడదు. ఆమె ప్రేమ కోసం ఆ 90 ఎమ్ ఎల్ మ్యాటర్ ని కొద్ది రోజులు దాస్తాడు కానీ ఆమె తండ్రి (రావు రమేష్ ) కనిపెట్టేసి, అతను తాగనిదే బ్రతకలేడనే తెలుసుకుని తన కూతురుని ఈ కుర్రాడిని ప్రక్కన పెట్టేయమని చెప్తాడు. అప్పుడు ఏం జరిగింది. తండ్రి మాట విని బ్రేకప్ చెప్పిందా...దేవదాసు ప్రేమ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిందా, సినిమాలో విలన్ రవికిషన్ క్యారక్టర్ ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
అవుట్ డేటెడ్ సరుకు..

ఈ సినిమా ద్వారా పరిచయం అయిన దర్శకుడు శేఖర్ రెడ్డి .. ఈ సిండ్రోమ్ గురించి తెలుసుకుని  ఎగ్జైట్ అయినట్లున్నారు.దాన్ని ట్రీట్మెంట్ లోకు సమర్దవంతంగా తేలేకపోయారు.  రోజూ తప్పనిసరి పరిస్దితుల్లో  90 ఎమ్ ఎల్ తాగే హీరో లవ్ స్టోరీ ఏమౌతుంది అని , మధ్య మధ్యలో విలన్ , చిన్న యాక్షన్ పెట్టుకున్నాడు తప్ప కథ మొత్తం చాలా ప్రెడిక్టిబుల్ గా రొటీన్ గా మారిపోతోందని గమనించుకోలేకపోయాడు.  దాంతో చాలా బోరింగ్ గా సినిమా సాగింది. మొదట పదినిముషాలు ఆ సిండ్రోమ్ గురించి చెప్తూంటే ఎక్సైటింగ్ గా అనిపించినా, ఆ తర్వాత అలాంటి వాడి జీవితంలో ఏమీ కొత్తగా ఏమీ జరగకపోవటంతో విసిగించింది. ఈ సిండ్రోమ్ ని అడ్డం పెట్టి అరిగిపోయిన అవుట్ డేటెడ్ మాస్ ఎలిమెంట్స్ ని ప్లే చేయటంలోనే స్క్రీన్ టైమ్ మొత్తం సరిపెట్టాడు.

సీన్స్ ఎంతలా ఉంటాయంటే... ఓ పెళ్లి దగ్గర తాగాడని పెళ్లి కొడుకుని  కొడుతూంటే... అక్కడ చుట్టూ ఉన్నవాళ్లని ఉద్దేశించి హీరో... మీ జీవితంలో ఎప్పుడూ కూడా ఓ చిన్న ఆల్కహాల్ చుక్కని కూడా టేస్ట్ చేయని వాళ్లే అతన్ని కొట్టడానికి అర్హులు అంటూ స్పీచ్ ఇస్తాడు. అప్పుడు అక్కడున్న వాళ్లలో పెళ్లి కూతురుతో అందరూ తలవంచుకుంటటారు. అప్పుడు ఓ డైలాగు..లిక్కర్ లిమిట్ లో ఉంటే బాడీ హార్స్ పరవ్ అన్ లిమిటెడ్.ఇలాంటి ఆణిముత్యాలు ఈ సినిమాలో అనంతం.
 
ఇక ఫస్టాప్ యావరేజ్ అనిపిస్తే ,సెకండఫ్ దారుణం అనిపిస్తుంది. హీరోయిన్ కు, ఫ్యామిలీ ఎందుకు హీరో తన మెడికల్ కండీషన్ ఇది ఎందుకు రివీల్ చేయడు అనేది మనకు మనస్సులో తొలుస్తూంటుంది. ఎప్పుడైతే అది రివీల్ అవుతుందో అప్పుడే కథ అయ్యిపోతుంది.అందుకే దాన్ని దాచినట్లున్నారు. దాంతో సినిమా మొత్తం డ్రాగ్ చేసిన ఫీలింగ్ వచ్చింది.  విలన్ రవికిషన్ ఎపిసోడ్ అయితే అసలు సినిమా కథకు సంభందం ఉందా అని ఓ టైమ్ లో డౌట్ వస్తుంది. క్లైమాక్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు.
 
టెక్నికల్ గా..


సినిమా కథ,కథనం విషయంలోనే తేలిపోవటంతో దర్శకత్వం వైపు మన దృష్టి మరలదు. ఆర్టిస్ట్ లు  ఫెరఫార్మెన్స్  గురించి చెప్పుకునేందుకు ఏమీ లేదు. కార్తికేయ తనను తాను మాస్ హీరోగా ప్రెజెంట్ చేసుకోవాలని విఫల ప్రయత్నం చేసాడు. అనూప్ రూబెన్స్ సంగీతం కూడా ఈ మ్యాజిక్ చేయలేకపోయింది. సినిమాటోగ్రఫీ ఒక్కటే సినిమాకు హైలెట్. మిగతా విభాగాలు అంతంత మాత్రమే.
 
ఫైనల్ థాట్..


పాయింట్ కొత్తదైనా ...ట్రీట్మెంట్ పాతదైతే ..ఫలితం  ప్రశ్నార్దమే

ఎవరెవరు..


నటీనటలు: కార్తికేయ, నేహా సోలంకి, ప్రగతి, రావు రమేష్, రవి కిషన్  తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌,
కెమెరా: జె.యువ‌రాజ్‌,
ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌,
ఆర్ట్: జీఎం శేఖ‌ర్‌,
 ఫైట్స్: వెంక‌ట్‌.
కథ,స్క్రీన్ ప్లే , దర్శకత్వం: శేఖర్ రెడ్డి

Rating: 2/5

Follow Us:
Download App:
  • android
  • ios