Asianet News TeluguAsianet News Telugu

నీవల్లే ఈ స్థాయిలో ఉన్నా, మళ్ళీ కలుద్దాం డాడి అంటూ.. హీరో నిఖిల్ ఎమోషనల్ పోస్ట్

తండ్రి మరణంతో హీరో నిఖిల్ సిద్ధార్థ్ పుట్టెడు ధు:ఖంలో మునిగిపోయాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోతున్నాడు యంగ్ హీరో. తన ఉన్నతికి పాటుపడిన తన తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని ఎమోషనల్ అవుతూ.. ట్వీట్ చేశాడు నిఖిల్. 

Hero Nikhil Sidharth Emotional Post
Author
Hyderabad, First Published Apr 29, 2022, 3:44 PM IST

తండ్రి మరణంతో హీరో నిఖిల్ సిద్ధార్థ్ పుట్టెడు ధు:ఖంలో మునిగిపోయాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోతున్నాడు యంగ్ హీరో. తన ఉన్నతికి పాటుపడిన తన తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని ఎమోషనల్ అవుతూ.. ట్వీట్ చేశాడు నిఖిల్. 

యంగ్‌ హీరో నిఖిల్‌  తండ్రి కావలి శ్యామ్‌ సిద్దార్థ్‌ నిన్న (ఏప్రిల్‌ 28న) కన్ను మూశారు. నిఖిల్ ఇంట విషాదచాయలు అలుముకున్నాయి. టాలీవుడ్ ప్రముఖులు నిఖిల్ తండ్రి మరణానికి సంతాపం ప్రకటించారు. ఇక నిఖిల్ తన తండ్రితో ఉన్న బంధాన్ని, ఆయన  జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ అయ్యాడు. నా తండ్రి శ్యామ్‌ సిద్దార్థ్‌ మరణంతో కుంగిపోయాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను డాడీ, లవ్‌ యూ అంటు పోస్ట్ చేశారు.

అంతే కాదు ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో సినిమా చూడటం, కలిసి తిరగడం, బయట బిర్యానీలు తినడం, సరదాగా నవ్వుకోవడం, ముంబైలో సమ్మర్‌ను ఎంజాయ్‌ చేయడం.. ఇవన్నీ నేను మిస్‌ అవుతాను. నీ కొడుకుగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. మనం తప్పకుండా మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నాను అని ట్విట్టర్ లో పెద్ద నోట్ రాశాడు నిఖిల్. 

 

మరో నోట్‌లో తండ్రి గురించి చెప్తూ.. ఆయన మంచి మనసున్న వ్యక్తి. వేలాదిమంది విద్యార్థులకు ఆయన దిశానిర్దేశం చేసేవారు. తన చుట్టూ ఉండేవాళ్లను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచేవాడు. నాన్న లెజండరీ నటులు సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు  వీరాభిమాని. నన్ను వెండితెరపై చూడాలని కలలు కన్నాడు. ఆయన సహాయ సహకారాలు, ప్రోత్సాహం అందించడం వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. ఎప్పుడూ కష్టాన్ని నమ్మే నాన్న చదువులో కూడా ఫస్టే ఉన్నాడు. ఆయన జేఎన్‌టీయూ ఎలక్ట్రానిక్‌ ఇంజనీరింగ్‌లో స్టేట్‌ టాపర్‌ అయనలో గోప్ప గుణాలకు నేను గర్వపడుతున్నారు. మాన న్నాననుచూసి అంటూ బాధపడ్డాడు నిఖిల్. 

అంతే కాదు తన తండ్రి పడిన ఇబ్బంది గురించి వివరంగా చెప్పాడు నిఖిల్. లైఫ్ ను హ్యాపీగా ఎంజాయ్‌ చేద్దామనుకునే సమయంలో అరుదైన వ్యాధిబారిన పడ్డాడు. కార్టికోబాసల్‌ డీజెనరేషన్‌ అనే వ్యాధితో ఎనిమిదేళ్లుగా పోరాడాడు. చివరికి ఈ పోరాటంలో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచాడు. నీ గురించి తలవకుండా ఒక్కరోజు కూడా నాకు ముందుకు సాగదు డాడీ అంటూ..నిఖిల్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios