Asianet News TeluguAsianet News Telugu

‘ఏదైనా జరగొచ్చు’ మూవీ రివ్యూ

ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో అన్నట్లుగా రిలీజ్ అయ్యే ప్రతీ సినిమాలోనూ ఏదో విషయం ఉండే ఉంటుంది, లేకపోతే అంత డబ్బు ఎందుకు ఖర్చు పెడతారని ఆత్రుత పడటమే తప్ప ఫలితం ఉండటం లేదు. విషయం లేని సినిమాలు విష వలయంలా వారం వారం తెలుగు సినిమాని కమ్మేస్తున్నాయి. ఈ నేపధ్యంలో కొత్త వాళ్లతో కొత్త దర్శకుడు ఏదో విషయం ఉందనిపించే పోస్టర్స్, ట్రైలర్స్ తో మన ముందుకు వచ్చాడు.

Edaina Jaragochu Telugu movie Review
Author
Hyderabad, First Published Aug 23, 2019, 6:49 PM IST

ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో అన్నట్లుగా రిలీజ్ అయ్యే ప్రతీ సినిమాలోనూ ఏదో విషయం ఉండే ఉంటుంది, లేకపోతే అంత డబ్బు ఎందుకు ఖర్చు పెడతారని ఆత్రుత పడటమే తప్ప ఫలితం ఉండటం లేదు. విషయం లేని సినిమాలు విష వలయంలా వారం వారం తెలుగు సినిమాని కమ్మేస్తున్నాయి. ఈ నేపధ్యంలో కొత్త వాళ్లతో కొత్త దర్శకుడు ఏదో విషయం ఉందనిపించే పోస్టర్స్, ట్రైలర్స్ తో మన ముందుకు వచ్చాడు. యాజ్ యూజవల్ గా ఏదో వెరైటీ పాయింట్ తో దర్శకుడు ఇంప్రెస్ చేయబోతున్నాడని ఆసపడుతూ థియోటర్ కు వెళ్తే ఏం జరిగింది. ఏదైనా జరగచ్చు అని డైరక్టర్ ముందే చెప్పాడు కాబట్టి అలాగే జరిగిందా...అసలు ఆ టైటిల్ ఏంటి...సినిమా జనాలకు నచ్చుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

కథేంటి:

ఏప్రియల్ 1న పుట్టిన ముగ్గురు ఫ్రెండ్స్ తాము నిజంగా  ఫూల్స్ మి కాదని నిరూపించుకోవాలని,మిలియనీర్స్ అవ్వాలనుకుంటారు.వాళ్లలో ఒకడైన జై (విజయ్‌ రాజా)  ఓ ప్రెవైట్ కంపెనీలో రికవరీ ఏజెంట్ గా జాయిన్ అవుతాడు.   పనిలో పనిగా ఓ అమ్మాయి  శశిరేఖ(పూజ సోలంకి) తో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి కొన్ని ఇబ్బందుల్లో ఉంటుంది. ఆమెకు సాయిం చేయాలని  ఈ ముగ్గురు కాళీ(బాబీ సింహా)  అనే రౌడీ దగ్గర ఇరుక్కుపోతారు. జై ఆ రౌడీ  జీవిత రహస్యం ఒకటి తెలుసుకుని డిస్ట్రిబ్ చేస్తారు. దాంతో కాళీ వీళ్ల అంతు చూడాలని వీళ్ల వెంట పడతాడు. కాళీ  నుంచి ఈ ముగ్గురూ ఎలా బయిటపడ్డారు. కాళీ లైఫ్ సీక్రెట్  ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే:

తెలుగులో హారర్ కామెడీలు మెల్లిగా తగ్గుమొహం పట్టాయి. ప్రేమ కథా చిత్రామ్ నాటి మ్యాజిక్ మళ్లీ (కలెక్షన్స్ వైజ్) ఏదైనా చిత్రానికి జరిగితే తప్ప ఈ సినిమాలకు ఊపు రాదు. అయితే అప్పుడు ఆ టైమ్ లో రాసుకున్న కథలు పరిస్దితి ఏమిటి..వాటిని ప్రక్కన పడేయాల్సిందేనా...ప్రతీ శుక్రవారం ట్రెండ్ మారిపోతే ప్రేక్షకుల టేస్ట్ మారిపోయినట్లు భావించాల్సిందేనా అని కొందరు మేకర్స్ కు మేకు లాంటి సందేహం గుచ్చుకుంటుంది.

అందులోంచి వచ్చే ధైర్యంతో సరైన సినిమా పడితే జనం ట్రెండ్, టైమ్ అని ఆలోచించకుండా హిట్ చేసేస్తారు అనే ధైర్యం వచ్చేస్తుంది. దాంతో అప్పుడు తాము అనుకున్న కథనే అలవోకగా తెరకెక్కించేస్తారు. అయితే జనం ఓ మూడ్ లో ఉన్నప్పుడు కొట్టుకుపోయినంత ఈజిగా మిగతా టైమ్ లో వాటిని ఎక్కించటం కష్టం. అదే పరిస్దితి ‘ఏదైనా జరగొచ్చు’ది.

ఇప్పుడీ సినిమాలది అవుటాఫ్ మూడ్. పోనీ మూడ్ ని ప్రక్కన పెట్టి మిగతావన్ని అద్బుతంగా ఉన్నాయి ..హిట్ అయ్యిపోతుంది అనుకోవటానికి అలాగా కూడా లేదు. మొత్తం టైటిల్ కు తగ్గట్లు ఏదైనా తెరపై జరగచ్చు అన్నట్లుగానే ఉంది. సినిమా అంతా చూసాక ఈ కథలో  ఓ పద్దతి పాడు లేకుండా ఏ సీన్ లో ఏదైనా జరగొచ్చు అని ఉద్దేశ్యంలో పెట్టుకున్నారని మనకు అర్దమై నిట్టూర్చబుద్దేస్తుంది.

వన్ మ్యాన్ షో:

ఈ సినిమాకు ప్లస్ పాయింట్ బాబి సింహా. జిగర్తాండ చిత్రంతో నేషనల్ అవార్డ్ పొందిన ఈ తమిళ నటుడు ఈ సినిమాలో మరోసారి తన విశ్వరూపం చూపించాడు. అలాగే అజయ్ ఘోష్ సైతం ఈ సినిమాలో తన నటనతో భయపెడతాడు. వీళ్దిద్దరే ఈ సినిమాకు మూల స్దంబాలు. వీళ్ళు హీరోను డామెనేట్ చేస్తారని తెలిసినా తీసుకుని సినిమాకు ఓ లుక్ తీసుకొచ్చాడు దర్శకుడు. అయితే అంతా బాగానే ఉన్నా ..ఏదో తక్కువైంది అన్నట్లు...ఆ రేంజి ఆర్టిస్ట్ లను బాలెన్స్ చేసే ప్రధాన పాత్రలు లేవు.

గుర్తింపు కల నటలు ప్రధాన పాత్రల్లో లేకపోవటం ఈ సినిమాకు మైనస్ గా నిలిచింది. దాంతో ఫస్టాఫ్ ఇంట్రస్టింగ్ గా ఉన్న ఈ సినిమా సెకండాఫ్ దగ్గరకు వచ్చేసరికి డల్ అయ్యింది. కన్ఫూజన్ మిగిలింది.  అయితే దర్శకుడుగా మేకింగ్, నటీనటుల దగ్గర నుంచి నటన రాబట్టే విషయంలో కొత్తవాడైనా డైరక్టర్ ఎక్కడా తడబడలేదు. మంచి సబ్జెక్టు వస్తే బాగా డీల్ చేయగలడని డెమో ఇచ్చినట్లు అయ్యింది. 

టెక్నికల్ గా...

స్క్రీన్ ప్లే మైనస్ గా నిలిచిన ఈ సినిమాలో డైలాగులు బాగున్నాయి. ఎడిటింగ్ మరో పదినిముషాలు మొహమాట లేకుండా కట్ చేస్తే బాగుండేదనిపిస్తుంది.  ఈ జానర్ కు  తగ్గట్టుగా కెమెరా వర్క్  ఉందిది. ఛేసింగ్, సీన్స్ లో కెమెరా పనితనం అద్బుతం అనిపిస్తుంది. శ్రీకాంత్ పెండ్యాల అందించిన సంగీతం విషయానికివస్తే  బీజీఎమ్ వరకు బాగుంది. కానీ పాటలు ఏమీ బాగోలేదు. దానికి తగినట్లు పాటల ప్లేస్ మెంట్ కూడా కరెక్ట్ గా లేదు. సీజీ వర్క్ సైతం సినిమాకు కలిసొచ్చేది కాదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాకు తగ్గట్లే ఉన్నాయి.  నటీనటుల్లో బాబీసింహా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో పరిచయమైన విజయ్ రాజా నటుడుగా మరింత రాటుతేలాల్సి ఉంది. తొలి చిత్రమైనా తడబాటులేకుండా చేసుకుంటూ పోయాడు.

ఫైనల్ థాట్: ఇలా తీస్తే మాత్రం సినిమాకు ఏదైనా జరగొచ్చు..

Rating: 2
 

Follow Us:
Download App:
  • android
  • ios