Asianet News TeluguAsianet News Telugu

`అన్వేషి` మూవీ రివ్యూ.. అనన్య నాగళ్ల నటించిన సస్పెన్స్ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

`వకీల్‌ సాబ్‌` చిత్రంతో పాపులర్‌ అయిన అనన్య నాగళ్ల అడపాదడపా సినిమాలతో రాణిస్తుంది. అందులో భాగంగా ఆమె ప్రస్తుతం `అన్వేషి` అనే సినిమాలో కీలక పాత్ర పోషించింది.  ఈ మూవీ శుక్రవారం (నవంబర్‌ 17) విడుదలైంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

anveshi movie review ananya did nagalla starrer suspense thriller engage you ? arj
Author
First Published Nov 18, 2023, 1:51 PM IST

`వకీల్‌ సాబ్‌` చిత్రంతో పాపులర్‌ అయిన అనన్య నాగళ్ల అడపాదడపా సినిమాలతో రాణిస్తుంది. అందులో భాగంగా ఆమె ప్రస్తుతం `అన్వేషి` అనే సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఇందులో విజయ్‌ ధరణ్‌ దాట్ల, సిమ్రాన్‌ గుప్తా జంటగా నటించగా, అజయ్‌ ఘోష్‌, జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్‌ ముఖ్య పాత్రలు పోషించారు. వీజే ఖన్నా దర్శకత్వం వహించిన ఈ మూవీని గణపతి రెడ్డి నిర్మించారు. ఈ మూవీ శుక్రవారం (నవంబర్‌ 17) విడుదలైంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

కథః
విక్రమ్‌ (విజయ్‌ ధరణ్‌ దాట్ల) తప్పిపోయిన ఓ అమ్మాయి కోసం వెతుకుతుండగా బస్‌లో అను(సిమ్రాన్‌ గుప్త)ని చూసి ఫిదా అవుతాడు. తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆ తర్వాత బ్యాంక్‌లో కనిపించడంతో కాపీకి ఆహ్వానించి లవ్‌ ప్రపోజ్‌ చేస్తాడు. ఆ తర్వాత కలుద్దామని చెప్పిన ఆ అమ్మాయి తనెక్కడ ఉంటానో కనిపెట్టమని ట్విస్ట్ ఇస్తుంది. దీంతో ఆమెని వెతుకుతూ మారెడు కోన గ్రామానికి వెళ్తాడు. ఆ ఊరు దట్టమైన అడవి మధ్యలో దూరంగా ఉంటుంది. భయపడుతూనే పోలీసుల సహాయంతో ఆ ఊరికి చేరుకుంటారు. అను కోసం ఎవరిని అడిగినా, ఆమె చనిపోయిందనే సమాధానం వస్తుంటుంది. దీంతో విక్రమ్‌, అతని ఫ్రెండ్‌ ఆశ్చర్యపోతుంటారు. ఎవరిని అడిగినా అదే ఆన్సర్‌ వస్తుంది. పోలీస్‌ ఫ్రెండ్‌ వీరిని స్థానికి ఎస్‌ఐ ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ అనుని చూసి హ్యాపీ అవుతాడు. ఆమె ఎస్‌ఐ కూతురు. ఆ ఊర్లో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. అది కూడా అను హాస్పత్రి సమీపంలో జరగడంతో చనిపోయిన అను ఆత్మగా మారి వారిని చంపేస్తుందని ఎస్‌తోపాటు జెట్పీ చైర్మన్‌ ఇలా అంతా భావిస్తారు. అదే అని నమ్మిస్తుంటారు. విచారించేందుకు వచ్చిన డిటెక్టివ్‌ కూడా చనిపోవడంతో ఇది మరింత బలపడుతుంది. మరి ఈ కేసుని విక్రమ్‌ ఎలా ఛేదించాడు, ఇంతకి చనిపోయిన అను ఎవరు? ఆమె ఎలా చనిపోయింది? తన విక్రమ్‌-అనుల ప్రేమ ఏ తీరం చేరింది? అనేది మిగిలిన కథ. 

విశ్లేషణః
మర్డర్‌ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్‌ చిత్రాలకు మంచి ఆదరణే దక్కుతుంది. ఆద్యంతం ఎంగేజింగ్‌గా సాగే స్క్రీన్‌ప్లే తో కథని నడిపిస్తే, ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేస్తే వాటిని ఇష్టపడే ఆడియెన్స్ ఆదరిస్తుంటారు. అయితే ఇలాంటి కాన్సెప్ట్ లో చాలా సినిమాలు వస్తుంటాయి. కానీ అందులోని ట్విస్ట్ లు, టర్న్ లే సినిమాకి ముఖ్యం. ఎంత ఉత్కంఠగా సినిమాని నడిపించారనేది ముఖ్యం. రెండున్నర గంటలపాటు ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేస్తే సినిమా సక్సెస్‌ అయినట్టే లెక్క. తాజాగా ఇలాంటి జోనర్‌లోనే `అన్వేషి` అనే మూవీ ఈ శుక్రవారం విడుదలైంది. హీరోహీరోయిన్‌, దర్శకుడు కొత్తవారు గానీ, మిగిలిన టెక్నీషియన్లు మంచి అనుభవం ఉన్న వారే పనిచేయడం ఈ సినిమా ప్రత్యేకత. అది సినిమాకి పెద్ద ప్లస్‌ అయ్యింది. అయితే ఎంత టెక్నీషియన్లు ఉన్నా, దర్శకుడు బాగా తీయకపోతే, కథలో దమ్ములేకపోతే ఎవరు మాత్రం ఏం చేయలేదు. బాగున్న సన్నివేశాలను వారంతా ఎలివేట్‌ చేస్తారు, ఇంకా బాగా రావడానికి తమ ప్రతిభని జోడిస్తారు. `అన్వేషి` సినిమాలో టెక్నిషయన్లు బాగా హెల్ప్ అయ్యారని చెప్పొచ్చు. 

దర్శకుడు ఓ లవ్‌ స్టోరీకి మర్డర్‌ మిస్టరీని జోడించి, దానికి కొన్ని థ్రిల్లర్‌ ఎలిమెంట్లు మేళవించి ఈ సినిమాని మలిచిన తీరు చాలా కొత్తగా ఉంది. దాన్ని అంతే బాగా కూడా తెరపై ఆవిష్కరించాడు. అయితే ఆయన అనుభవ లేమి కనిపిస్తుంది. సన్నివేశాలను పకడ్బందీగా తెరకెక్కించడంలో కాస్త తడబాటు కనిపిస్తుంది. సినిమా మొత్తాన్ని ఎంగేజింగ్‌గా తీయడంలో విఫలమయ్యాడు. కానీ కొన్ని సన్నివేశాలను మాత్రం బాగా రాసుకున్నాడు, బాగా డీల్‌ చేశాడు. భయపెట్టే సీన్ల విషయంలో ఆయన సక్సెస్ అయ్యాడు. అదే సమయంలో అంతటి భయంలోనూ కామెడీ పండేలా చేయడంలోనూ ఆయన విజయం సాధించినట్టే, అయితే దాన్ని కొన్ని సీన్లకే పరిమితం చేశాడు. మరికొన్ని సీన్లు అంతగా పేలలేదు. సీన్లలో స్టఫ్ లేకపోవడంతో అవి అంతగా పేలలేదు. పైగా ఫస్టాఫ్‌ అంతా స్లోగా నడిపించాడు. చాలా రెగ్యూలర్‌గా అనిపిస్తుంది. అనుకోసం వెళ్లే సీన్లు, లవ్‌ ఎపిసోడ్‌ అంతగా ఆకట్టుకునేలా లేదు. ఒక్కచూపులోనే ప్రేమలో పడటం, ప్రపోజ్‌ చేయడం ఆమె కోసం వెళ్లడం అనేది కన్విన్సింగ్‌గా లేదు. లవ్‌ని కొత్తగా ఎస్టాబ్లిష్‌ చేయాల్సింది. 

అయితే సెకండాఫ్‌పై మాత్రం బాగా ఫోకస్‌ పెట్టాడు. మొదటి భాగం లవ్‌ ఎపిసోడ్‌, మర్డర్‌ సంఘటనలను చూపిస్తే, సెకండాఫ్‌లో మాత్రం థ్రిల్లర్‌ సైడ్‌ తీసుకెళ్లాడు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడిపించి ఆడియెన్స్ ని థ్రిల్ కి గురి చేస్తుంటారు. ఇక చివర్లో వచ్చే ట్విస్ట్ లు, ఒక్కో మిస్టరీని ఛేదించడం, అసలు విషయాలు రివీల్‌ అవుతుండటం, కొత్త విషయాలు తెరపైకి రావడం వంటివి ఆద్యంతం ఆకట్టుకుంటాయి. థ్రిల్‌ చేస్తాయి. క్లైమాక్స్ ని మాత్రం బాగా రాసుకున్నాడు దర్శకుడు. అంతే బాగా కొత్తగా రివీల్‌ చేశాడు. అదే మాదిరిగా ఫస్టాఫ్‌పై ఫోకస్‌ చేస్తే సినిమా ఇంకా బాగుండేది. మొత్తానికి ఇదొక మర్డర్‌ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల్లో ఓ కొత్త అనుభూతిని ఇచ్చే మూవీ అవుతుంది. థ్రిల్లర్‌ ఇష్టపడే వారు ఎంజాయ్‌ చేసే మూవీ అవుతుంది. 

నటీనటులుః
విక్రమ్‌ పాత్రలో విజయ్‌ ధరణ్‌ బాగా నటించాడు. అతని నటన బాగుంది. అంతేకాదు చాలా సహజంగా కనిపించాడు. సినిమాల్లో హీరో అనేలా కాకుండా మనలో ఒక అబ్బాయిగా కనిపించాడు. హీరోయిన్‌ సిమ్రాన్‌ ఓకే అనిపించింది. అనన్య కొత్త షేడ్‌ ఉన్న పాత్రలో మెప్పించింది. మరోవైపు అజయ్‌ ఘోష్‌ ఇరగదీశాడు. నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో ఆయన నటన ఆకట్టుకుంటుంది. జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్‌, ఇతర కమెడియన్లు నవ్వించారు. మెప్పించారు. ఎస్‌గా విద్యా సాగర్‌ రాజు నటన ఓకే అనిపిస్తుంది. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి. 

టెక్నీషియన్లుః
దర్శకుడు వీజేఖన్నా సినిమాని బాగా తెరకెక్కించాడు. అప్‌కమింగ్‌ డైరెక్టర్‌ అయినా బాగా డీల్‌ చేశాడు. సెకండాఫ్‌ మాదిరిగా, ఫస్టాఫ్‌పై ఫోకస్‌ చేస్తే బాగుండేది. కామెడీని ఇంకా బాగా రాసుకోవాల్సింది. మరోవైపు సెకండాఫ్‌లో హీరో ఇన్వెస్టిగేషన్‌ కూడా రేసీగా ఉంటే ఇంకా బాగుండేది. సినిమాకి చైతన్య భరద్వాజ్‌ సంగీతం మరో ఆకర్షణ. ఆయన పాటలు, బీజీఎం హైలైట్‌గా నిలుస్తుంది. ముఖ్యంగా ఆర్‌ఆర్‌తో అదరగొట్టాడు, భయపెడుతూనే థ్రిల్‌ చేశాడు. చాలా సన్నివేశాలను ఆర్‌ఆర్‌ లేపిందని చెప్పొచ్చు. ఎడిటింగ్‌ పరంగా కొంత కేర్‌ తీసుకోవాల్సింది.కెకె రావు కెమెరా వర్క్ బాగుంది. చాలా విజువల్స్ లావిష్‌గా ఉన్నాయి.  నిర్మాణ విలువలు సైతం బాగున్నాయి. చిన్న సినిమా అయినా రాజీపడలేదనిపిస్తుంది. 

ఫైనల్‌గాః `అన్వేషి`.. థ్రిల్లర్‌ చిత్రాలను ఇష్టపడేవారికి నచ్చే మూవీ అవుతుంది.

నటీనటులు: అనన్య నాగళ్ల, విజయ్‌ ధరణ్‌ దాట్ల, సిమ్రాన్‌ గుప్తా జంటగా నటించగా, అజయ్‌ ఘోష్‌, జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్‌, జబర్దస్త్ నాగిరెడ్డి, రచ్చ రవి, విద్యా సాగర్‌ రాజు, దిల్‌ రమేష్‌, ప్రభు, సత్య శ్రీ ఇతర పాత్రలు పోషించారు.
దర్శకుడు : వీజే ఖన్నా
నిర్మాత: గణపతి రెడ్డి
సంగీతం: చైత‌న్ భ‌ర‌ద్వాజ్
సినిమాటోగ్రఫీ: కెకె రావు
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
విడుదల తేదీ : నవంబర్ 17, 2023 

Read More: Mangalavaram Movie Review: `మంగళవారం` మూవీ రివ్యూ, రేటింగ్‌..
Read More:  స్లోగా సాగి..సాగి... : ‘స‌ప్త సాగరాలు దాటి సైడ్‌-బీ’ రివ్యూ

Follow Us:
Download App:
  • android
  • ios