మాధవిలత.. తెలుగులో `నచ్చావులే`, `స్నేహితుడా`, `మిథునం`,`అరవింద్‌ 2` చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌. నటిగా తనకు వచ్చిన అవకాశాలే తక్కువ. అందులో సక్సెస్‌ శాతం చాలా తక్కువ. దీంతో సినిమాలకు గుడ్‌బైన్‌ చెప్పింది. బీజేపీ పార్టీలో చేరి ప్రజలకు సేవ చేస్తానని తెలిపింది. ఐదేళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. 

ఇక ఇటీవల రాజకీయాలకు సంబంధించి, సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఓ ఘాటైన, సుధీర్ఘమైన పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించింది. తాను ఎవరికీ బయపడనని, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, తన వద్ద పిచ్చి పిచ్చి వేశాలు వేయొద్దని గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా మాధవిలత హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. 

ఇప్పుడు సినిమాలకు రీఎంట్రీ ఇస్తూ మరోసారి హైలైట్‌ అయ్యింది. తాజాగా ఆమె మోనో యాక్టింగ్‌తో సినిమా చేయబోతుంది. థ్రిల్లింగ్‌ ఎమోషనల్‌ డ్రామ్‌గా రూపొందుతున్న `లేడీ` చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఆమె సోలో పర్‌ఫార్మెన్స్ ఇవ్వబోతుంది. మోనో యాక్టింగ్‌తో మెరవనుందట. రీల్‌ స్టార్‌కి చెందిన రియల్‌ స్టోరీతో ఇది రూపొందుతుందని చిత్ర బృందం ఆదివారం ప్రకటించింది. జీఎస్‌ఎస్‌పి కళ్యాణ్‌ దీనికి దర్శకత్వం వహిస్తూ, సత్యానారయణ జీతో కలిసి నిర్మిస్తున్నారు. 

తాజాగా ఓ ఫోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో `సూసైడింగ్‌ సూన్‌` అని ఉండటం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. మరి రీఎంట్రీ తర్వాతనైనా మాధవిలత హీరోయిన్‌గా గుర్తింపు పొందుతుందేమో చూడాలి.