సినీనటి, మాజీ ఎంపీ జయప్రద పై ఎస్పీ నేత అజమ్ ఖాన్ అనుచరుడు, ఆ పార్టీ సంభాల్ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

సినీనటి, మాజీ ఎంపీ జయప్రద పై ఎస్పీ నేత అజమ్ ఖాన్ అనుచరుడు, ఆ పార్టీ సంభాల్ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జయప్రద ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. కాగా.. ఆమెకు బీజేపీ రాంపూర్ టికెట్ కేటాయించింది. ఆ నియోజకవర్గానికి ఎస్పీ నుంచి అజమ్ ఖాన్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ మొదటి నుంచి శత్రువులు అన్న విషయం అందరికీ తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఈ క్రమంలో జయప్రదపై అజమ్ ఖాన్ సన్నిహితుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. రాంపూర్‌ ప్రజలను జయప్రద తన నృత్యాలతో ఆకట్టుకుంటారని ఫిరోజ్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారు. జయప్రదను చూసేందుకు తమ జిల్లా ప్రజలు రాంపూర్‌కు తరలివెళతారని చెప్పుకొచ్చారు.

కాగా గతంలో ఆజం ఖాన్‌ సైతం జయప్రదపై అభ్యంతరకర వ్యాక్యలు చేశారు. మరోవైపు జయప్రదను ఎస్పీలోకి తీసుకువచ్చి రాంపూర్‌ లోక్‌సభ స్ధానం నుంచి గెలుపొందేలా ఆజం ఖాన్‌ చొరవ చూపడం గమనార్హం. అయితే జయప్రద ఎస్పీ మాజీ ప్రధాన కార్యదర్శి అమర్‌ సింగ్‌ వర్గంలో చురుకుగా వ్యవహరించడంతో వీరిద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి. 

2009 లోక్‌సభ ఎన్నికల్లో జయప్రదకు వ్యతిరేకంగా ఆజం ఖాన్‌ వర్గీయులు ప్రచారం చేశారు. ఇక ఆజం ఖాన్‌ తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తుండగా జయప్రద ఇప్పటికే రాంపూర్‌ నుంచి రెండు సార్లు గెలుపొందారు.