Asianet News TeluguAsianet News Telugu

నా మద్ధతు వారికే.. అయితే ఒక షరతు: కేజ్రీవాల్

లోక్‌సభ ఎన్నికల ఫలితాలలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాదని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో వివిధ పార్టీల మద్దతును కూడగట్టేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల్లో తన మద్ధతును ఎవరికో తెలిపారు.

we will support any party after lok sabha results says aap chief kejriwal
Author
New Delhi, First Published May 10, 2019, 4:49 PM IST

లోక్‌సభ ఎన్నికల ఫలితాలలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాదని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో వివిధ పార్టీల మద్దతును కూడగట్టేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల్లో తన మద్ధతును ఎవరికో తెలిపారు.

తాను ప్రధాని నరేంద్రమోడీకి, బీజేపీకి తప్పించి మరే పార్టీకైనా కేంద్రంలో మద్ధతు తెలుపుతామన్నారు. అధి కూడా ఢిల్లీకి ప్రత్యేక రాష్ట్ర హోదా ఇస్తామన్న పార్టీకి మాత్రమేని షరతు పెట్టారు. అయితే ఏ పార్టీకి మద్ధతు ఇస్తామనేది ఫలితాల అనంతరమే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని కేజ్రీవాల్ వెల్లడించారు.

మరోవైపు ఢిల్లీ  ఈస్ట్ ఆప్ అభ్యర్థి ఆతిషిపై బీజేపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని కేజ్రీవాల్ తప్పుబట్టారు. ఉన్నత విద్యను అభ్యసించిన ఓ మహిళ పట్ల బీజేపీ నేతలు అలా ప్రవర్తించడం సరికాదని అరవింద్ వెల్లడించారు. కాగా, ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఆరో విడతలో.. ఈ ఆదివారం పోలింగ్ జరగనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios