లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా సాధ్వి ప్రగ్యాసింగ్ ఠాకూర్‌ను తాము అడ్డుకోలేమిని ఎన్ఐఏ కోర్టు తీర్పు వెలువరించింది.

వివరాల్లోకి వెళితే... 2008లో జరిగిన మాలేగావ్ బాబు పేలుడు కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సాధ్వి ప్రగ్యాసింగ్‌ను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలంటూ.. ఆ పేలుళ్లలో మరణించిన సయ్యద్ అహ్మద్ తండ్రి నిసార్ బిలాల్ ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అనారోగ్యాన్ని కారణంగా చూపి బెయిల్‌పై వచ్చిన ప్రగ్యాను పోటీకి అనర్హురాలిగా పేర్కోవాలంటూ ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన ఎన్ఐఏ న్యాయస్థానం.. ఆమె పోటీకి సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని, ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయని స్పష్టం చేసింది.

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించే అధికారం ఈ కోర్టుకు లేదని న్యాయమూర్తి వీఎస్ పడాల్కర్ వెల్లడించారు. 2008లో జరిగిన మాలేగావ్ బాంబు పేలుళ్లలో ఆరుగురు మరణించగా, 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ప్రగ్యాపై ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది.