సినీ నటులకు క్రేజ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. వాళ్లు ఒక్కసారిగా కనిపిస్తే... అభిమానులు వారితో కరచాలనం చేయాలని, ఫోటో దిగాలని సంబరపడిపోతుంటారు. అలాంటి సినీతారలు మన ఇంటి దగ్గరకే వస్తే... అభిమానులు ఊరుకుంటారా..? సన్ని డియోల్ కి కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది.

బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర కుమారుడైన సన్నీడియోల్.. బీజేపీలో చేరి పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్‌పూర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గురుదాస్‌పూర్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ఓట్లు అడుగుతున్నారు సన్నీడియోల్.

ప్రచారంలో భాగంగా గురువారం(09 మే 2019) నాడు రోడ్ షో నిర్వహించారు సన్నీడియోల్. ఓ వ్యాన్‌పై కూర్చొని అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న సన్నీడియోల్ వద్దకు ఓ మహిళ వచ్చేందుకు ఆరాటపడింది. దానిని గ్రహించిన సన్నీడియోల్.. ఆమెను వ్యాన్‌పైకి ఆహ్వానించారు. చేతిని అందించి పైకి రమ్మన్నారు. అయితే, వ్యాన్‌పైకి ఎక్కిన మహిళ కరచాలనం చేస్తూ సన్నీడియోల్ చెంపపై ముద్దు పెట్టింది.

ఆమె చేష్టలకు ముందు షాకైన సన్నీ.. తర్వాత తేరుకున్నారు. చిరు నవ్వుతో ప్రజలకు అభివాదం చేశారు. కాగా... దీనికి సంబంధించిన వీడియో.. ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.