నేను అక్కడ నుంచే వచ్చా, వారి గురించి నాకు తెలుసు : మోదీపై విజయశాంతి ఫైర్

First Published 20, Apr 2019, 6:15 PM IST
vijayashanthi fires on pm modi
Highlights

తాను బీజేపీ నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించానని అందుకే ఆ పార్టీ నేతల నేపథ్యం తెలుసునన్నారు. ఒక ప్రధానికి ఉండాల్సిన లక్షణాలు మోదీకి లేవన్నారు. ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ- మోదీల మధ్య పోరు అంటూ స్పష్టం చేశారు. 

బెంగళూరు: భారత ప్రధాని నరేంద్రమోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీపీసీసీ కాంపైన్ కమిటీ చైర్మన్ విజయశాంతి. కర్ణాటకలోని ముదోళ్ లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విజయశాంతి మోదీపై విరుచుకుపడ్డారు. 

తెలుగుప్రజలు అత్యధికంగా ఉంటున్న సేడంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాములమ్మ దేశంలో నరేంద్ర మోదీలాంటి నేరచరిత్ర కలిగిన వ్యక్తులు మరోకరు ఉండరంటూ విరుచుకుపడ్డారు. 

తాను బీజేపీ నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించానని అందుకే ఆ పార్టీ నేతల నేపథ్యం తెలుసునన్నారు. ఒక ప్రధానికి ఉండాల్సిన లక్షణాలు మోదీకి లేవన్నారు. ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ- మోదీల మధ్య పోరు అంటూ స్పష్టం చేశారు. 

గడిచిన ఐదేళ్లు పీఎం నరేంద్రమోదీ అబద్దాలతో కాలయాపన చేశారని ప్రజలను మోసం చేశారని విమర్శించారు. బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్‌కే ఓటు వెయ్యాలని విజయశాంతి ఓటర్లను కోరారు.  

loader