బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఊర్మిల ఎన్నికల బరిలో నిలుస్తున్నారా..? అవుననే సమాధానం వినపడుతోంది.  కాంగ్రెస్ పార్టీ నుంచి ముంబయి లోక్ సభ స్థానానికి ఆమె పోటీ చేయనున్నట్లు సమాచారం. ఉత్తర ముంబయి సీటును కాంగ్రెస్ పార్టీ ఉర్మిలకు కేటాయించినట్లు తెలుస్తోంది.

ఈవిషయంపై అధికారికంగా ఎలా ప్రకటన రాలేదు. కనీసం ఈ విషయంపై ఆమె కుటుంబసభ్యులు మాట్లాడటానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ.. ఆమె పోటీ మాత్రం ఖాయమని చెబుతున్నారు. 

ముంబైలోని ఆరు ఎంపీ నియోజకవర్గాలకు ఏప్రిల్‌ 29న ఎన్నికలు జరుగనున్నాయి. ఒకవేళ ఊర్మిలకు ఎంపీ సీటు దక్కితే, సిట్టింగ్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోపాల్‌ షెట్టిని ఆమె ఎదుర్కోవాల్సి  ఉంటుంది.  ముంబై నార్త్‌ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి గతంలో బాలీవుడ్‌ దిగ్గజం సునీల్‌ దత్‌ 5 సార్లు గెలుపొందారు. సినీ ప్రియులందరికీ రంగీలా సుపరిచితురాలే. 1980-90ల మధ్య రంగీలా ఒక ఊపు ఊపారు.