ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగుతున్న సంగతి తెలిసిందే. అయితే... ఈ ఎన్నికల కన్నా కూడా.. ఓ ఎన్నికల అధికారిణి ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ రేపింది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగుతున్న సంగతి తెలిసిందే. అయితే... ఈ ఎన్నికల కన్నా కూడా.. ఓ ఎన్నికల అధికారిణి ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ రేపింది. జనాలు ఆమె గురించి అంతలా చర్చించుకోవడానికి ఆమె ఏం చేసిందో తెలుసా..? హీరోయిన్ , మోడల్ లాగా అందంగా ఉండటమే.
పసుపు రంగు చీర కట్టుకొని.. స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకొని... కల్లకి నల్లకళ్లద్దాలు పెట్టుకొని చేతిలో ఈవీఎంతో ఆమె నడుచుకుంటూ వస్తుంటే.. కెమేరామెన్ లు తమ చేతికి పని చెప్పారు. ఇంకేముంది ఆ ఫోటోలు నెట్టింట వైలర్ గా మారాయి.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన రీనా ప్రభుత్వ ఉద్యోగి. లఖ్‌నవూలోని పీడబ్ల్యూడీ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఐదో దశ ఎన్నికల్లో భాగంగా మే 6న లఖ్‌నవూలోని నగ్రామ్‌లో గల ఓ పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించారు. ఇందుకోసం మే 5న ఈవీఎంలు తీసుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్తూ కెమెరాకు చిక్కారు. ఓ మీడియా జర్నలిస్టు ఆమె ఫొటో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో ఒక్కసారిగా ఆమె ఫొటో వైరల్ అయ్యింది.
ఆమె అందంగా ఉండటంతో.. ఆమె విరవాల కోసం నెటిజన్లు గూగుల్ లో తెగ వెతికేశారు. చివరకు ఆమె వివరాలు తెలుసుకోగలిగారు. అయితే.. ఆమె పేరిట మీమ్స్ కూడా క్రియేట్ చేశారు. ఆమెను చూడటానికైనా ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఉంటారని.. అక్కడ 100శాతం పోలింగ్ జరిగి ఉంటుందని నెటిజన్లు జోకులు వేశారు.
ఆ జోకులపై కూడా ఆమె స్పందించడం విశేషం. తాను విధులు నిర్వహించిన దగ్గర 100శాతం పోలింగ్ జరగలేదని..కేవలం 70శాతమే జరిగిందని ఆమె చెప్పారు. రీనా ద్వివేదితోపాటు.. మరో అధికారిణి కూడా పాపులర్ అయ్యింది. ఆమె నీలం రంగు గౌను వేసుకొని అందంగా ఉంది. ఆమె కూడా మోడల్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంది. అయితే... ఆమె వివరాలు మాత్రం బయటకు రాలేదు.

