దేశ ప్రజలంతా ఎన్డియే పక్షానికే మరోసారి అధికారాన్ని కట్టబెట్టాలని భావించారని...ఇప్పటికే దాదాపు తమ గెలుపు ఖాయమైందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  తెలిపారు. ఇప్పటివరకు  జరిగిన ఆరు విడతల్లో మాదిరిగానే ఈ ఏడో విడత పోలింగ్ లో కూడా బిజెపికి అనుకూలంగానే ప్రజలు ఓటేయనున్నట్లు వెల్లడించారు. కేంద్రంలో అధికారాన్ని చేపట్టాలన్న యూపీఏ ఆశలు నెరవేరే పరిస్థితులు లేవని యూపి సీఎం పేర్కొన్నారు. 

లోక్ సభ  ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న చివరిదశ పోలింగ్ లో యోగి పాల్గొన్నారు. గోరఖ్ పూర్ లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం   మీడియాతో మాట్లాడుతూ...ఈ నెల 23న వెలువడనున్న ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమికి  అనుకూలంగా వస్తాయన్నారు.  దాదాపు 400 లోక్‌సభ స్థానాలను తమ కూటమి కైవసం చేసుకుంటుందని యోగి ధీమా వ్యక్తం చేశారు. 

ఇకక ఉత్తర ప్రదేశ్ లోనూ మళ్లీ  2014 నాటి  ఫలితాలే పునరావృతం అవుతాయన్నారు. దేశంలోనే అత్యధికంగా యూపీలో 74 ఎంపీ స్థానాలను బిజెపి గెలిచి కేంద్ర  ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందన యోగి ఆదిత్యనాథ్ జోస్యం చెప్పారు.