Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ వల్లే అమేథిలో కాంగ్రెస్‌ రిగ్గింగ్‌లు: మండిపడ్డ స్మృతీ

5వ విడత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ.

union minister smriti irani makes comments on congress chief rahul gandhi
Author
Lucknow, First Published May 6, 2019, 2:00 PM IST

5వ విడత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ. అమేథిలో కాంగ్రెస్ కార్యకర్తలు పోలింగ్ బూత్‌లను ఆక్రమించి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

రాహుల్ ప్రొత్సహంతోనే కాంగ్రెస్ కార్యకర్తలు చెలరేగిపోయాయని ఆమె వ్యాఖ్యానించారు. అమేథిలో బూత్‌ల ఆక్రమణపై తాను ఎన్నికల అధికారులకు, ఉత్తరప్రదేశ్ అధికారులకు సమాచారం అందించానని స్మృతీ తెలిపారు.

దీనిపై అధికార యంత్రాంగం తగిన చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. రాహుల్ దుర్మార్గాలను గమనించి అమేథి ఓటర్లు ఆయనను శిక్షించాలా వద్దా లేదా అనేది తేల్చుకోవాలని స్మృతీ ఇరానీని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అమేథి నుంచి ఎప్పటి లాగే కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బరిలో నిలిచారు. ఆయనపై పోటీగా కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ రంగంలోకి దిగారు. దీంతో ఇరు పార్టీలు ఇక్కడ విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios