ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి చేదు అనుభవం ఎదురైంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెబుతున్నట్లుగా మీకు రాష్ట్రప్రభుత్వం నుంచి రుణమాఫీ అందిందా అని ఆమె ప్రజలను ప్రశ్నించారు.

దీనికి అక్కడున్న వారంతా అందింది.. అందింది అంటూ గట్టిగా అరుస్తూ చెప్పడంతో ఆమె ఖంగుతిన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ట్వీట్టర్‌లో షేర్ చేసింది. బీజేపీ అబద్దాలకు ఇప్పుడు ప్రజలు కూడా నేరుగా జవాబిస్తున్నారంటూ ఎద్దేవా చేసింది.