తన రాజకీయ జీవితంలో తొలిసారి రాహుల్ గాంధీ అమేథీతో పాటు మరో స్థానం నుంచి ఏకకాలంలో పోటీ చేస్తున్నారు. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ బరిలోకి దిగారు.

తన రాజకీయ జీవితంలో తొలిసారి రాహుల్ గాంధీ అమేథీతో పాటు మరో స్థానం నుంచి ఏకకాలంలో పోటీ చేస్తున్నారు. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ బరిలోకి దిగారు. ఈ క్రమంలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత రాహుల్‌తో పాటు మరో గాంధీలు పోటీలో నిలిచారు.

వీరిలో ఒకరు కొట్టాయంలోని ఎరుమెలి గ్రామానికి చెందిన రాహుల్ గాంధీ కేఈ స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేశారు. ఇతను సంప్రదాయ సంగీతంలో రీసెర్చ్ స్కాలర్. ఇతని తండ్రి కుంజుమన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

కాంగ్రెస్ కుటుంబానికి ఇతను వీరాభిమాని అని స్థానికులు చెబుతున్నారు. మరోకరు మక్కల్ ఖగజం పార్టీకి చెందిన కె.రఘుల్ గాంధీ కాగా, వయనాడ్ సమీపానికి చెందిన శివప్రసాద్ గాంధీ కూడా స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు.

ఈయన సంస్కృత పండితుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం వీరంతా సామాన్య కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. అయితే రాహుల్ గాంధీ పోటీ చేస్తుండటంతో కాంగ్రెస్‌తో పాటు తమకు సహజంగానే బలమైన నియోజకవర్గం కావడంతో వామపక్షాలు కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.