జమ్మూలో అతి తక్కువ పోలింగ్: ప్రశాంతంగా ముగిసిన మూడో విడత

Third phase Lok sabha elections live updates

5:58 PM IST

సాయంత్రం 5.30గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు

దేశ వ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో సాయంత్రం 5.30గంటల వరకు 61.31 శాతం పోలింగ్ నమోదయ్యింది.  

అస్సాం 74.05 

బిహార్  54. 95

చత్తీస్ ఘడ్ 64. 03

దాద్రా నగర్ హవేలి   71.43

డయ్యూ డామన్   65.34

గోవా  70.96

గుజరాత్  58.81

జమ్ము కాశ్మీర్  12.46

కర్ణాటక  60. 87

కేరళ 68.62

మహారాష్ట్ర  55.05

ఒడిషా  457.84

త్రిపుర  71.13

ఉత్తర ప్రదేశ్  56.36

పశ్చిమ బెంగాల్ 78.94

5:36 PM IST

కుటుంబంతో కలిసొచ్చి ఓటేసిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నాయకులు జగదీశ్ షెట్టర్ ధార్వాడ్ జిల్లాలోని హుబ్లీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులందరితో కలిసి పోలింగ్ బూత్ కు చేరుకుని షెట్టర ఓటేశారు. 
 
5:24 PM IST

ఓటర్లతో వరుణ్ గాంధీ సెల్పీ

ఉత్తర ప్రదేశ్ లోని పిలిబిత్ లోక్ సభ నియోజకర్గం నుండి కేంద్ర మంత్రి  మనేకా గాంధీ తనయుడు వరుణ్ గాంధీ బిజెపి అభ్యర్థిగా బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గంలో కూడా ఇవాళ ఎన్నికలు జరగడంతో ఆయన వివిధ పోలింగ్ బూత్ లను సందర్శించాడు. ఈ సందర్భంగా వరుణ్ గాంధీ ఓటర్లను ఆత్మీయంగా పలకరిస్తూ వారితో సెల్పీ దిగుతూ కనిపించారు. 

3:57 PM IST

మధ్యాహ్నం 3.30గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు...

మంగళవారం దేశవ్యాప్తంగా వివిధ రాష్టాల్లో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల పోలింగ్ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశవ్యాప్తంగా మద్యాహ్నం 3.30 గంటల వరకు 51.15 పోలింగ్ శాతం నమోదైనట్లు తెలిపారు. దీంట్లో అత్యల్పంగా జమ్ము కాశ్మీర్ లో కేవలం 10.64 శాతమే పోలింగ్ జరగ్గా అత్యధికంగా పశ్చిమ బెంగాల్ లో 67 శాతం నమోదయ్యింది. 

అస్సాం 62.12

బిహార్  46.94

చత్తీస్ ఘడ్ 55.29

దాద్రా నగర్ హవేలి  56.81

డయ్యూ డామన్  54.84

గోవా  58.39

గుజరాత్  50.37

జమ్ము కాశ్మీర్ 10.64

కర్ణాటక  49.96

కేరళ 54.91

మహారాష్ట్ర  44.80

ఒడిషా  46.29 

త్రిపుర  60.84

ఉత్తర ప్రదేశ్  46.99

పశ్చిమ బెంగాల్ 67.52 

3:56 PM IST

కర్ణాటకలో భారీ వర్షం... పోలింగ్ కు అంతరాయం

కర్ణాటకలో కొద్దిసేపటి క్రితమే భారీ వర్షం మొదలయ్యింది.  ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా ఉదయం నుండి జోరుగా సాగుతున్న పోలింగ ప్రక్రియకు అంతరాయం కలుగుతోంది. మరీముఖ్యంగా ఉత్తర కర్ణాటకలో వర్షంతో పాటు పిడుగులు పడుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు ఇళ్లలోనుండి బయటకు రావడానికి భయపడుతున్నారు.
 
3:31 PM IST

అస్సాంలో ఓటేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్సాంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజధాని డిస్పూర్ లోని ఓ పోలింగ్ బూత్ లో ఆయన ఓటేశారు. ఎలాంటి హడావుడి లేకుండా పోలింగ్ బూత్ కు చేరుకున్న ఆయన తన ఓటు హక్కును వినియోగించుకుని వెళ్లిపోయారు.  

2:35 PM IST

పోలింగ్ కేంద్రం వద్ద బాంబులతో దాడి...టీఎంసీ కార్యకర్తలకు గాయాలు

పశ్చిమ బెంగాల్ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా హింసాత్మక వాతావరణం చోటుచేసుకుంది.ముర్షిదాబాద్ సమీపంలోని దోమ్‌కల్ మున్సిపాలిటీ పరిధిలోని రాణి నగర్‌ పోలింగ్ బూత్ వద్ద హింస చెలరేగింది. పోలింగ్ కేంద్రానికి సమీపంలో వున్న కొందరు టీఎంసీ కార్యర్తలపైకి దుండగులు నాటుబాంబులను  విసరారు. ఈ దాడిలో ముగ్గురు టీఎంసీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హింసాత్మక ఘటన నేపథ్యంలో పోలీసులు ఇక్కడ పోలింగ్‌ కేంద్రాన్ని మూసివేసి పోలింగ్ ను నిలిపివేశారు.  

2:34 PM IST

ఓటేసిన జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ

జమ్ము కాశ్మీర్ తాజా మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ లోక్ సభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమె అనంతనాగ్ జిల్లాలోని బిజ్‌బెహారా ప్రాంతంలోని పోలింగ్ బూత్ నెంబర్ 37D లో ఓటేశారు. 

2:33 PM IST

వీవీపాట్ యంత్రంలో పాము కలకలం

మూడో విడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ కేరళలో పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలా కన్నౌర్ లో ఏర్పాటుచేసిన ఓ పోలింగ్ బూత్ లో పాము కలకలం సృష్టించింది. వివిపాట్ మిషన్లో పాము ఉన్నట్లు ఎన్నికల సిబ్బంది గుర్తించడంతో కలకలం రేగింది. అయితే వెంటనే స్పందించిన ఈసీ పాములు పట్టే వారి సాయంతో వీవీప్యాట్‌ యంత్రం నుంచి బయటకు తీశారు. దీంతో మళ్లీ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై సజావుగా సాగుతోంది. 

2:04 PM IST

ఓటు హక్కు వినియోగించుకున్న అరుణ్ జైట్లీ

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఓటు వేశారు. అహ్మదాబాద్‌లోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

2:01 PM IST

బెంగాల్‌లో బీజేపీ, తృణమూల్ కార్యకర్తల ఘర్షణ

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశాయి. దీనికి ప్రతీకారంగా మోతీగంజ్‌లోని టీఎంసీ కార్యాలయాన్ని భాజపా శ్రేణులు ధ్వంసం చేశాయి

1:33 PM IST

ఓటు వేసిన అద్వానీ

బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కె అద్వానీ ఓటు వేశారు. అహ్మదాబాద్ షాపూర్‌లోని హిందీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

1:30 PM IST

ఓటు హక్కు వినియోగించుకున్న అఖిలేశ్ దంపతులు

సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సైఫైలోని పోలింగ్‌బూత్‌లో భార్య డింపుల్ యాదవ్‌తో కలిసి అఖిలేశ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ దేశాన్ని అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ఓటు ద్వారా తమకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రజలు తమ వ్యతిరేకతను చాటుకోవాలని అఖిలేశ్ పిలుపునిచ్చారు. ప్రజలు బీజేపీని సాగనంపి కొత్త ప్రభుత్వాన్న, కొత్త ప్రధానిని ఎన్నుకుంటారని నమ్ముతున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

12:43 PM IST

ఓటు హక్కు వినియోగించుకున్న ఛత్తీస్‌గఢ్ సీఎం

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాగేల్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దుర్గ్‌లోని 55వ పోలింగ్ బూత్‌లో సీఎం ఓటేశారు.

12:39 PM IST

12 గంటల వరకు నమోదైన పోలింగ్

మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా ఉదయం 11 గంటల నాటికి నమోదైన పోలింగ్ వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించింది.

బిహార్‌: 25.65%
కర్ణాటక: 21.05%
అసోం: 28.64%
గోవా: 28.49%
గుజరాత్‌: 24.93%
కేరళ: 25.79%
మహారాష్ట్ర: 17.26%
ఒడిశా: 18.58%
త్రిపుర: 29.21%
యూపీ: 22.39%
బెంగాల్‌: 35%
ఛత్తీస్‌ఘడ్‌: 27.29%
దాద్రానగర్ హవేలీ: 21.62%
డామన్& డయ్యూ: 23.93%

12:17 PM IST

వీవీప్యాట్‌లో పాము

కేరళలోని కన్నూర్ లోక్‌సభ పరిధిలోని ఓ పోలింగ్ బూత్‌లో వీవీప్యాట్ మెషిన్‌లో పాము కనిపించడంతో అక్కడ కలకలం రేగింది. దీంతో అధికారులు కొద్దిసేపు పోలింగ్‌ను నిలిపివేశారు. 

12:15 PM IST

ఏ పార్టీకి ఓటేసినా బీజేపీకే: ఈవీఎంలపై అఖిలేశ్ అనుమానాలు

సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఈవీఎంలన్నింటిలోనూ పలు సమస్యలు ఉన్నాయని.. ఏ పార్టీకి ఓటు వేసినా అన్నీ బీజేపీకే పడుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికే 350 పైచిలుకు ఈవీఎంలను మార్చారని, ఇది నేరపూరిత నిర్లక్ష్యమని అఖిలేశ్ మండిపడ్డారు. 
 
11:50 AM IST

ఓటు హక్కు వినియోగించుకున్న మల్లిఖార్జున ఖర్గే

కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ ప్రతిపక్షనేత మల్లిఖార్జున ఖర్గే ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుల్బార్గాలోని పోలింగ్ బూత్ నెంబర్ 119లో ఆయన ఓటు వేశారు. 

11:44 AM IST

11 గంటల నాటికి పోలింగ్ వివరాలు

మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా ఉదయం 11 గంటల నాటికి నమోదైన పోలింగ్ వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించింది.

బిహార్‌: 20.80%
కర్ణాటక: 12.72%
అసోం: 28.07%
గోవా: 16.88%
గుజరాత్‌: 13.24%
కేరళ: 21.09%
మహారాష్ట్ర: 9.03%
ఒడిశా: 8.67%
త్రిపుర: 15.28%
యూపీ:16.28%
బెంగాల్‌: 23.85%
ఛత్తీస్‌ఘడ్‌: 19.31%
దాద్రానగర్ హవేలీ: 11.40%
డామన్& డయ్యూ: 19.43%

11:39 AM IST

కేరళలో ఇద్దరు ఓటర్లు మృతి

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా కేరళలో విషాదం చోటు చేసుకుంది. ఓ పోలింగ్ బూత్ వద్ద ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న ఇద్దరు ఓటర్లు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అయితే వీరి మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. 

11:38 AM IST

ఎన్నికల అధికారిపై బీజేపీ కార్యకర్తల దాడి

ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల అధికారిపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మొరాదాబాద్‌లోని పోలింగ్ బూత్ నెం. 231లో సమాజ్‌వాదీ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను కోరుతున్నాడంటూ ఎన్నికల అధికారిపై వారు దాడి చేశారు. 

11:35 AM IST

ఓటేసిన హార్దిక్ పటేల్

కాంగ్రెస్ నేత, పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. విక్రమ్‌గామ్‌లోని బూత్ నెంబర్ 252లో ఆయన ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చౌకీదార్ కావాలంటే నేపాల్ నుంచి తెచ్చుకుంటా.. కానీ ఈ దేశానికి కావాల్సింది చౌకీదార్ కాదు.. ప్రధాని. దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించే ప్రధాని కావాలన్నారు. 

11:21 AM IST

ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం

మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా ఉదయం 9 గంటల నాటికి నమోదైన పోలింగ్ వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించింది.

బిహార్‌: 9.35’%
కర్ణాటక: 6.02%
అసోంల: 12.36%
గోవా: 9.30%
గుజరాత్‌: 6.76%
కేరళ: 6.57%
మహారాష్ట్ర: 3.79%
ఒడిశా: 4.98%
త్రిపుర: 4.28%
యూపీ: 9.80%
బెంగాల్‌: 16.23%
ఛత్తీస్‌ఘడ్‌: 9.59%

11:17 AM IST

ఈవీఎంల మొరాయింపు: వయనాడ్‌లో ఉద్రిక్తత

లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కేరళలోని వయనాడ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ పోలింగ్ బూత్‌లో ఈవీఎం పనిచేయకపోవడంతో అక్కడ గందరగోళం నెలకొంది. దీంతో ఎన్డీఏ అభ్యర్థి తుషార్ వెల్లప్పల్లి రీపోలింగ్‌కు డిమాండ్ చేస్తున్నారు. 

11:11 AM IST

ఓటు హక్కు వినియోగించుకున్న అన్నాహజారే

సామాజికవేత్త, గాంధేయవాది అన్నాహజారే ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహరాష్ట్ర అహ్మద్‌నగర్‌ జిల్లా రాలేగాన్ సిద్ధిలో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం అన్నాహజారే మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలపై అభ్యర్థి పేరు, ఫోటో ఉంటే చాలని .. పార్టీ పేరు, గుర్తు అనవసరమని ఆయన వ్యాఖ్యానించారు.

10:57 AM IST

ఓటు హక్కు వినియోగించుకున్న క్రికెటర్ పుజారా

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా టీమిండియా క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా ఓటు హక్కును వినియోగించుకున్నాడు. రాజ్‌కోట్‌లోని మదాపర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో పుజారా ఓటేశాడు.
 
10:54 AM IST

ఈవీఎంలపై కేజ్రీవాల్ సందేహాలు

ఈవీఎంలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అనుమానాలు వ్యక్తం చేశారు. గోవాలో ఈవీఎంలతో తలెత్తిన సమస్యతో వేరే పార్టీలకు వేసిన ఓట్లు కూడా బీజేపీకే పడుతున్నాయని ఆరోపించారు. ఇది నిజంగానే సాంకేతిక సమస్యనా..? లేక ఉద్దేశ్యపూర్వంగానే ఇలా చేస్తున్నారా అంటూ ఆయన ట్వీట్టర్‌లో ప్రశ్నించారు. 

10:34 AM IST

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని తల్లి హీరాబెన్

ప్రధాని నరేంద్రమోడీ మాతృమూర్తి హీరాబెన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌ రైజిన్‌లోని పోలింగ్‌బూత్‌లో ఆమె ఓటు వేశారు.

10:30 AM IST

ఓటేసిన మోహన్‌లాల్, మమ్ముట్టి, సురేశ్ గోపి

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరువనంతపురంలోని ముదవన్‌ముగల్‌లో మోహన్‌లాల్ ఓటు వేశారు. అటు మెగాస్టార్ మమ్ముట్టి కొచ్చిలోని మమన్‌కమ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరో నటుడు, త్రిసూర్ బీజేపీ అభ్యర్థి సురేశ్ గోపీ శస్థమంగళంలో ఓటు వేశారు. 

10:24 AM IST

ఓటు హక్కు వినియోగించుకున్న శశిథరూర్

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరువనంతపురంలోని పోలింగ్‌బూత్‌లో మంగళవారం ఉదయం ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేరళలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారంటూ ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే అది బీజేపీకే పడుతోందన్నారు. 

9:59 AM IST

ఓటు హక్కు వినియోగించుకున్న నవీన్ పట్నాయక్

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భువనేశ్వర్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో మంగళవారం ఉదయం ఓటేశారు. 

9:25 AM IST

ఓటు వేసిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్

కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒడిషాలోని తాల్చేర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. 

9:21 AM IST

ఓటు హక్కును వినియోగించుకున్న గోవా సీఎం

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సఖాలిలోని పోలింగ్ బూత్‌లో తన భార్యతో కలిసి సావంత్ ఓటు వేశారు. 

9:15 AM IST

ఓటేసిన గుజరాత్ సీఎం విజయ్ రుపానీ

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్‌కోట్‌లోని అనిల్ జ్ఞాన్ మందిర్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో సీఎం కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు. 

9:03 AM IST

ఓటు హక్కు వినియోగించుకున్న శరద్ పవార్ కుమార్తె సుప్రియా

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్రలోని పుణేలో ఉన్న బారామతి పోలింగ్ బూత్‌ వద్ద ఆమె కుటుంభసభ్యులతో కలిసి ఓటు వేశారు. సుప్రియా బారామతి నుంచి బరిలో ఉన్నారు. 

8:50 AM IST

గాంధీనగర్‌లో ఓటేసిన అమిత్ షా

బీజేపీ జాతీయాధ్యక్షుడు, గాంధీనగర్ బీజేపీ అభ్యర్థి అమిత్ షా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని నరన్‌పురా సబ్‌జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆయన తన సతీమణి సోనాల్ షాతో కలిసి ఓటు వేశారు.

8:48 AM IST

ఓటేసిన కేరళ సీఎం

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కన్నూర్ జిల్లా పినరయిలోని ఆర్సీ అమల బేసిక్ యూపీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో విజయన్ ఓటు వేశారు.

8:27 AM IST

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్రమోడీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ పరిధిలోని రానిప్‌లోని నిషాన్ స్కూల్‌లోని పోలింగ్ బూత్‌లో ప్రధాని ఓటు వేశారు. ప్రోట్‌కాల్‌ను పక్కనబెట్టి సాధారణ ప్రజలతో కలిసి ఆయన క్యూలైన్‌లో నిల్చొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. ఓటు హక్కు వినియోగించుకుని తన బాధ్యతను నెరవేర్చినట్లు తెలిపారు. కుంభమేళాలో పాల్గొన్నంత ఆనందం తనకు కలిగిందన్నారు. 

7:58 AM IST

ప్రత్యేక పూజల తర్వాత ఓటేసిన యడ్యూరప్ప

ఎన్నికల్లో తమకు విజయం చేకూరాలని కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప ప్రత్యేక పూజలు నిర్వహించారు. షిమోగా జిల్లాలోని శికాయిపురాలోని హుచార్య దేవాలయాన్ని ఆయన సందర్శించి పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆయన ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

7:23 AM IST

మూడో విడత బరిలో ప్రముఖులు

మూడో విడత ఎన్నికల్లో రాజకీయ ప్రముఖులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి, బీజేపీ చీఫ్ అమిత్ షా గుజరాత్‌లోని గాంధీ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. వీరితో పాటు ఎస్పీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్, సినీనటి జయప్రద, వరుణ్ గాంధీ, ప్రతిపక్షనేత మల్లిఖార్జున ఖర్గే తదితరులు బరిలో ఉన్నారు. 

7:04 AM IST

ప్రారంభమైన పోలింగ్

మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్ జరగనుంది. అయితే జమ్మూకశ్మీర్, అస్సాం రాష్ట్రాల్లో మాత్రం కాస్త త్వరగా పోలింగ్ నిలిపివేయనున్నారు. 
 
5:57 PM IST:

దేశ వ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో సాయంత్రం 5.30గంటల వరకు 61.31 శాతం పోలింగ్ నమోదయ్యింది.  

అస్సాం 74.05 

బిహార్  54. 95

చత్తీస్ ఘడ్ 64. 03

దాద్రా నగర్ హవేలి   71.43

డయ్యూ డామన్   65.34

గోవా  70.96

గుజరాత్  58.81

జమ్ము కాశ్మీర్  12.46

కర్ణాటక  60. 87

కేరళ 68.62

మహారాష్ట్ర  55.05

ఒడిషా  457.84

త్రిపుర  71.13

ఉత్తర ప్రదేశ్  56.36

పశ్చిమ బెంగాల్ 78.94

5:35 PM IST:

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నాయకులు జగదీశ్ షెట్టర్ ధార్వాడ్ జిల్లాలోని హుబ్లీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులందరితో కలిసి పోలింగ్ బూత్ కు చేరుకుని షెట్టర ఓటేశారు. 
 
5:23 PM IST:

ఉత్తర ప్రదేశ్ లోని పిలిబిత్ లోక్ సభ నియోజకర్గం నుండి కేంద్ర మంత్రి  మనేకా గాంధీ తనయుడు వరుణ్ గాంధీ బిజెపి అభ్యర్థిగా బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గంలో కూడా ఇవాళ ఎన్నికలు జరగడంతో ఆయన వివిధ పోలింగ్ బూత్ లను సందర్శించాడు. ఈ సందర్భంగా వరుణ్ గాంధీ ఓటర్లను ఆత్మీయంగా పలకరిస్తూ వారితో సెల్పీ దిగుతూ కనిపించారు. 

4:35 PM IST:

మంగళవారం దేశవ్యాప్తంగా వివిధ రాష్టాల్లో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల పోలింగ్ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశవ్యాప్తంగా మద్యాహ్నం 3.30 గంటల వరకు 51.15 పోలింగ్ శాతం నమోదైనట్లు తెలిపారు. దీంట్లో అత్యల్పంగా జమ్ము కాశ్మీర్ లో కేవలం 10.64 శాతమే పోలింగ్ జరగ్గా అత్యధికంగా పశ్చిమ బెంగాల్ లో 67 శాతం నమోదయ్యింది. 

అస్సాం 62.12

బిహార్  46.94

చత్తీస్ ఘడ్ 55.29

దాద్రా నగర్ హవేలి  56.81

డయ్యూ డామన్  54.84

గోవా  58.39

గుజరాత్  50.37

జమ్ము కాశ్మీర్ 10.64

కర్ణాటక  49.96

కేరళ 54.91

మహారాష్ట్ర  44.80

ఒడిషా  46.29 

త్రిపుర  60.84

ఉత్తర ప్రదేశ్  46.99

పశ్చిమ బెంగాల్ 67.52 

3:55 PM IST:

కర్ణాటకలో కొద్దిసేపటి క్రితమే భారీ వర్షం మొదలయ్యింది.  ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా ఉదయం నుండి జోరుగా సాగుతున్న పోలింగ ప్రక్రియకు అంతరాయం కలుగుతోంది. మరీముఖ్యంగా ఉత్తర కర్ణాటకలో వర్షంతో పాటు పిడుగులు పడుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు ఇళ్లలోనుండి బయటకు రావడానికి భయపడుతున్నారు.
 
3:31 PM IST:

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్సాంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజధాని డిస్పూర్ లోని ఓ పోలింగ్ బూత్ లో ఆయన ఓటేశారు. ఎలాంటి హడావుడి లేకుండా పోలింగ్ బూత్ కు చేరుకున్న ఆయన తన ఓటు హక్కును వినియోగించుకుని వెళ్లిపోయారు.  

3:02 PM IST:

పశ్చిమ బెంగాల్ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా హింసాత్మక వాతావరణం చోటుచేసుకుంది.ముర్షిదాబాద్ సమీపంలోని దోమ్‌కల్ మున్సిపాలిటీ పరిధిలోని రాణి నగర్‌ పోలింగ్ బూత్ వద్ద హింస చెలరేగింది. పోలింగ్ కేంద్రానికి సమీపంలో వున్న కొందరు టీఎంసీ కార్యర్తలపైకి దుండగులు నాటుబాంబులను  విసరారు. ఈ దాడిలో ముగ్గురు టీఎంసీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హింసాత్మక ఘటన నేపథ్యంలో పోలీసులు ఇక్కడ పోలింగ్‌ కేంద్రాన్ని మూసివేసి పోలింగ్ ను నిలిపివేశారు.  

2:46 PM IST:

జమ్ము కాశ్మీర్ తాజా మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ లోక్ సభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమె అనంతనాగ్ జిల్లాలోని బిజ్‌బెహారా ప్రాంతంలోని పోలింగ్ బూత్ నెంబర్ 37D లో ఓటేశారు. 

2:33 PM IST:

మూడో విడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ కేరళలో పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలా కన్నౌర్ లో ఏర్పాటుచేసిన ఓ పోలింగ్ బూత్ లో పాము కలకలం సృష్టించింది. వివిపాట్ మిషన్లో పాము ఉన్నట్లు ఎన్నికల సిబ్బంది గుర్తించడంతో కలకలం రేగింది. అయితే వెంటనే స్పందించిన ఈసీ పాములు పట్టే వారి సాయంతో వీవీప్యాట్‌ యంత్రం నుంచి బయటకు తీశారు. దీంతో మళ్లీ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై సజావుగా సాగుతోంది. 

2:04 PM IST:

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఓటు వేశారు. అహ్మదాబాద్‌లోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

2:01 PM IST:

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశాయి. దీనికి ప్రతీకారంగా మోతీగంజ్‌లోని టీఎంసీ కార్యాలయాన్ని భాజపా శ్రేణులు ధ్వంసం చేశాయి

1:34 PM IST:

బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కె అద్వానీ ఓటు వేశారు. అహ్మదాబాద్ షాపూర్‌లోని హిందీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

1:30 PM IST:

సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సైఫైలోని పోలింగ్‌బూత్‌లో భార్య డింపుల్ యాదవ్‌తో కలిసి అఖిలేశ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ దేశాన్ని అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ఓటు ద్వారా తమకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రజలు తమ వ్యతిరేకతను చాటుకోవాలని అఖిలేశ్ పిలుపునిచ్చారు. ప్రజలు బీజేపీని సాగనంపి కొత్త ప్రభుత్వాన్న, కొత్త ప్రధానిని ఎన్నుకుంటారని నమ్ముతున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

12:43 PM IST:

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాగేల్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దుర్గ్‌లోని 55వ పోలింగ్ బూత్‌లో సీఎం ఓటేశారు.

1:22 PM IST:

మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా ఉదయం 11 గంటల నాటికి నమోదైన పోలింగ్ వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించింది.

బిహార్‌: 25.65%
కర్ణాటక: 21.05%
అసోం: 28.64%
గోవా: 28.49%
గుజరాత్‌: 24.93%
కేరళ: 25.79%
మహారాష్ట్ర: 17.26%
ఒడిశా: 18.58%
త్రిపుర: 29.21%
యూపీ: 22.39%
బెంగాల్‌: 35%
ఛత్తీస్‌ఘడ్‌: 27.29%
దాద్రానగర్ హవేలీ: 21.62%
డామన్& డయ్యూ: 23.93%

12:17 PM IST:

కేరళలోని కన్నూర్ లోక్‌సభ పరిధిలోని ఓ పోలింగ్ బూత్‌లో వీవీప్యాట్ మెషిన్‌లో పాము కనిపించడంతో అక్కడ కలకలం రేగింది. దీంతో అధికారులు కొద్దిసేపు పోలింగ్‌ను నిలిపివేశారు. 

12:15 PM IST:

సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఈవీఎంలన్నింటిలోనూ పలు సమస్యలు ఉన్నాయని.. ఏ పార్టీకి ఓటు వేసినా అన్నీ బీజేపీకే పడుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికే 350 పైచిలుకు ఈవీఎంలను మార్చారని, ఇది నేరపూరిత నిర్లక్ష్యమని అఖిలేశ్ మండిపడ్డారు. 
 
11:50 AM IST:

కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ ప్రతిపక్షనేత మల్లిఖార్జున ఖర్గే ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుల్బార్గాలోని పోలింగ్ బూత్ నెంబర్ 119లో ఆయన ఓటు వేశారు. 

11:44 AM IST:

మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా ఉదయం 11 గంటల నాటికి నమోదైన పోలింగ్ వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించింది.

బిహార్‌: 20.80%
కర్ణాటక: 12.72%
అసోం: 28.07%
గోవా: 16.88%
గుజరాత్‌: 13.24%
కేరళ: 21.09%
మహారాష్ట్ర: 9.03%
ఒడిశా: 8.67%
త్రిపుర: 15.28%
యూపీ:16.28%
బెంగాల్‌: 23.85%
ఛత్తీస్‌ఘడ్‌: 19.31%
దాద్రానగర్ హవేలీ: 11.40%
డామన్& డయ్యూ: 19.43%

11:39 AM IST:

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా కేరళలో విషాదం చోటు చేసుకుంది. ఓ పోలింగ్ బూత్ వద్ద ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న ఇద్దరు ఓటర్లు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అయితే వీరి మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. 

11:53 AM IST:

ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల అధికారిపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మొరాదాబాద్‌లోని పోలింగ్ బూత్ నెం. 231లో సమాజ్‌వాదీ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను కోరుతున్నాడంటూ ఎన్నికల అధికారిపై వారు దాడి చేశారు. 

12:11 PM IST:

కాంగ్రెస్ నేత, పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. విక్రమ్‌గామ్‌లోని బూత్ నెంబర్ 252లో ఆయన ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చౌకీదార్ కావాలంటే నేపాల్ నుంచి తెచ్చుకుంటా.. కానీ ఈ దేశానికి కావాల్సింది చౌకీదార్ కాదు.. ప్రధాని. దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించే ప్రధాని కావాలన్నారు. 

11:21 AM IST:

మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా ఉదయం 9 గంటల నాటికి నమోదైన పోలింగ్ వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించింది.

బిహార్‌: 9.35’%
కర్ణాటక: 6.02%
అసోంల: 12.36%
గోవా: 9.30%
గుజరాత్‌: 6.76%
కేరళ: 6.57%
మహారాష్ట్ర: 3.79%
ఒడిశా: 4.98%
త్రిపుర: 4.28%
యూపీ: 9.80%
బెంగాల్‌: 16.23%
ఛత్తీస్‌ఘడ్‌: 9.59%

11:17 AM IST:

లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కేరళలోని వయనాడ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ పోలింగ్ బూత్‌లో ఈవీఎం పనిచేయకపోవడంతో అక్కడ గందరగోళం నెలకొంది. దీంతో ఎన్డీఏ అభ్యర్థి తుషార్ వెల్లప్పల్లి రీపోలింగ్‌కు డిమాండ్ చేస్తున్నారు. 

11:15 AM IST:

సామాజికవేత్త, గాంధేయవాది అన్నాహజారే ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహరాష్ట్ర అహ్మద్‌నగర్‌ జిల్లా రాలేగాన్ సిద్ధిలో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం అన్నాహజారే మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలపై అభ్యర్థి పేరు, ఫోటో ఉంటే చాలని .. పార్టీ పేరు, గుర్తు అనవసరమని ఆయన వ్యాఖ్యానించారు.

10:57 AM IST:

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా టీమిండియా క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా ఓటు హక్కును వినియోగించుకున్నాడు. రాజ్‌కోట్‌లోని మదాపర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో పుజారా ఓటేశాడు.
 
10:54 AM IST:

ఈవీఎంలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అనుమానాలు వ్యక్తం చేశారు. గోవాలో ఈవీఎంలతో తలెత్తిన సమస్యతో వేరే పార్టీలకు వేసిన ఓట్లు కూడా బీజేపీకే పడుతున్నాయని ఆరోపించారు. ఇది నిజంగానే సాంకేతిక సమస్యనా..? లేక ఉద్దేశ్యపూర్వంగానే ఇలా చేస్తున్నారా అంటూ ఆయన ట్వీట్టర్‌లో ప్రశ్నించారు. 

10:34 AM IST:

ప్రధాని నరేంద్రమోడీ మాతృమూర్తి హీరాబెన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌ రైజిన్‌లోని పోలింగ్‌బూత్‌లో ఆమె ఓటు వేశారు.

12:35 PM IST:

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరువనంతపురంలోని ముదవన్‌ముగల్‌లో మోహన్‌లాల్ ఓటు వేశారు. అటు మెగాస్టార్ మమ్ముట్టి కొచ్చిలోని మమన్‌కమ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరో నటుడు, త్రిసూర్ బీజేపీ అభ్యర్థి సురేశ్ గోపీ శస్థమంగళంలో ఓటు వేశారు. 

10:36 AM IST:

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరువనంతపురంలోని పోలింగ్‌బూత్‌లో మంగళవారం ఉదయం ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేరళలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారంటూ ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే అది బీజేపీకే పడుతోందన్నారు. 

10:01 AM IST:

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భువనేశ్వర్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో మంగళవారం ఉదయం ఓటేశారు. 

9:25 AM IST:

కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒడిషాలోని తాల్చేర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. 

12:34 PM IST:

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సఖాలిలోని పోలింగ్ బూత్‌లో తన భార్యతో కలిసి సావంత్ ఓటు వేశారు. 

9:15 AM IST:

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్‌కోట్‌లోని అనిల్ జ్ఞాన్ మందిర్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో సీఎం కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు. 

9:03 AM IST:

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్రలోని పుణేలో ఉన్న బారామతి పోలింగ్ బూత్‌ వద్ద ఆమె కుటుంభసభ్యులతో కలిసి ఓటు వేశారు. సుప్రియా బారామతి నుంచి బరిలో ఉన్నారు. 

10:17 AM IST:

బీజేపీ జాతీయాధ్యక్షుడు, గాంధీనగర్ బీజేపీ అభ్యర్థి అమిత్ షా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని నరన్‌పురా సబ్‌జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆయన తన సతీమణి సోనాల్ షాతో కలిసి ఓటు వేశారు.

9:04 AM IST:

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కన్నూర్ జిల్లా పినరయిలోని ఆర్సీ అమల బేసిక్ యూపీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో విజయన్ ఓటు వేశారు.

8:55 AM IST:

ప్రధాని నరేంద్రమోడీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ పరిధిలోని రానిప్‌లోని నిషాన్ స్కూల్‌లోని పోలింగ్ బూత్‌లో ప్రధాని ఓటు వేశారు. ప్రోట్‌కాల్‌ను పక్కనబెట్టి సాధారణ ప్రజలతో కలిసి ఆయన క్యూలైన్‌లో నిల్చొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. ఓటు హక్కు వినియోగించుకుని తన బాధ్యతను నెరవేర్చినట్లు తెలిపారు. కుంభమేళాలో పాల్గొన్నంత ఆనందం తనకు కలిగిందన్నారు. 

8:57 AM IST:

ఎన్నికల్లో తమకు విజయం చేకూరాలని కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప ప్రత్యేక పూజలు నిర్వహించారు. షిమోగా జిల్లాలోని శికాయిపురాలోని హుచార్య దేవాలయాన్ని ఆయన సందర్శించి పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆయన ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

7:23 AM IST:

మూడో విడత ఎన్నికల్లో రాజకీయ ప్రముఖులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి, బీజేపీ చీఫ్ అమిత్ షా గుజరాత్‌లోని గాంధీ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. వీరితో పాటు ఎస్పీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్, సినీనటి జయప్రద, వరుణ్ గాంధీ, ప్రతిపక్షనేత మల్లిఖార్జున ఖర్గే తదితరులు బరిలో ఉన్నారు. 

7:04 AM IST:

మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్ జరగనుంది. అయితే జమ్మూకశ్మీర్, అస్సాం రాష్ట్రాల్లో మాత్రం కాస్త త్వరగా పోలింగ్ నిలిపివేయనున్నారు. 
 
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మంగళవారం మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దేశంలోని 13 రాష్ట్రాలు,రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 116 స్థానాల్లో పోలింగ్ జరగింది.  మొత్తం 1,640 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం మిషన్లలో నిక్షిప్తమయ్యింది. పశ్చిమ బెంగాల్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే మిగతా అన్నిచోట్ల ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు ముగిశాయి. కానీ అదే పశ్చిమ బెంగాల్ లో అత్యధిక పోలింగ్ శాతం నమోదవగా...జమ్ము కాశ్మీర్ లో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోడానికి ఆసక్తి చూపలేరు.  దీంతో అక్కడ అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదయ్యింది.