బీజేపీ సీనియర్ మహిళా నేత ఉమాభారతిని చూసి... మరో మహిళానేత సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాగూర్ బోరున ఏడ్చేశారు. ఉమా భారతి కనపడగానే.. ఆమెను హగ్ చేసుకొని మరీ ఏడ్చేశారు. ఈ సంఘటన భోపాల్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... సోమవారం ప్రగ్యాసింగ్... ఉమాభారతి నివాసానికి వెళ్లారు. సమావేశం ముగించుకుని ప్రగ్యాసింగ్ తిరిగి వెళ్తుండగా ఆమెను సాగనంపేందుకు ఉమాభారతి కూడా వచ్చారు. ఆమెను కారు ఎక్కించి, సీటులో దిండు వేసి కూర్చోబెట్టారు. కాళ్లకు మొక్కి నమస్కరించారు. 

ఈ సందర్భంగా ప్రగ్యాసింగ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.  వెక్కివెక్కి ఏడుస్తున్న ఆమెను చూసి ఉమాభారతి కూడా భావోద్వేగానికి గురయ్యారు. కొద్దిసేపు ఆమెను ఆలింగనం చేసుకుని అలాగే ఉండిపోయారు. ప్రగ్యాసింగ్‌ను ఓదార్చి ధైర్యం చెప్పి పంపారు. కాగా.. ఈ దృశ్యాన్ని చూసినవాంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.

ఇదిలా ఉండగా... ప్రగ్యాసింగ్ ఈ ఎన్నికల్లో  భోపాల్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్‌తో పోటీ పడుతున్నారు.