Asianet News TeluguAsianet News Telugu

ఏం చేసిందని డీఎంకే గెలుస్తుంది: ఎగ్జిట్ పోల్స్‌పై పళనిస్వామి విమర్శలు

ఆదివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై దేశంలోని రాజకీయ నేతలు పలు రకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా తమిళనాడు సీఎం పళనిస్వామి స్పందించారు. 

tamilnadu cm palaniswami response on exit polls
Author
Chennai, First Published May 20, 2019, 6:38 PM IST

ఆదివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై దేశంలోని రాజకీయ నేతలు పలు రకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా తమిళనాడు సీఎం పళనిస్వామి స్పందించారు. ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ విజయం సాధిస్తుందని వెల్లడికావడంతో విపక్షాలు మండిపడుతున్నాయి.

ఈ క్రమంలో ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పళనిస్వామి. ఎగ్జిట్ పోల్ అనేది ఒక అబద్ధమని.. ఏం చేసిందని డీఎంకే 27 స్ధానాలు గెలుచుకుంటుంది. అధికార ఏఐఏడీఎంకే కూటమి రాష్ట్రంలో అన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలిపారు.

పుదుచ్చేరిలో సైతం అన్నాడీఎంకేనే గెలుస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. తమిళనాట 39 లోక్‌సభ స్థానాలకు గాను ప్రతిపక్ష డీఎంకే 27 స్థానాలను గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్‌లో వచ్చింది.

అన్నాడీఎంకే 2014లో 37 స్ధానాలు గెలుచుకుంది.. నాటి ఎన్నికల్లో 45 శాతం ఓటు దక్కించుకుంది. తాజా ఎన్నికల్లో తమిళనాడులో ఏఐఏడీఎంకే-బీజేపీ కలిసి పోటి చేసిన సంగతి తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios