Asianet News TeluguAsianet News Telugu

అల్లర్ల కేసులో దోషిగా హార్దిక్: స్టేకు సుప్రీం నో, పోటీలో లేనట్లే

గుజరాత్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పటీదార్ ఉద్యనేత, కాంగ్రెస్ నాయకుడు హార్డిక్ పటేల్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. 

Supreme court Rejects Hardik Patel plea
Author
New Delhi, First Published Apr 2, 2019, 1:09 PM IST

గుజరాత్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పటీదార్ ఉద్యనేత, కాంగ్రెస్ నాయకుడు హార్డిక్ పటేల్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. విసననగర్ అల్లర్ల కేసులో తనను దోషిగా పేర్కొనడంపై హార్డిక్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అయితే దీనిపై సత్వర విచారణ జరిపేందుకు న్యాయస్థానం నిరాకరించింది. విద్య, ఉద్యోగాల్లో పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ... 2015లో హార్డిక్ సారధ్యంలో పటేళ్లు ఆందోళనకు దిగారు.

దీనిలో భాగంగా పలు ప్రాంతాల్లో అల్లర్లు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఈ అల్లర్లకు నాయకత్వం వహించారన్న నేరంపై గుజరాత్‌లోని విసననగర్ సెషన్స్ కోర్టు గతేడాది జూలైలో ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

ఈ తీర్పును సవాల్ చేస్తూ హార్దిక్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం జైలు శిక్షను రద్దు చేసినప్పటికీ.. దోషిగా తేల్చడంపై మాత్రం స్టే ఇవ్వలేదు.

దీంతో ఆయన మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం హార్దిక్ పిటిషన్‌ను తోసిపుచ్చడంతో.. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడా నిరాశే ఎదురైంది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లోని జామ్‌నగర్ నుంచి పోటీ చేసేందుకు హార్దిక్ సిద్ధమవుతున్నారు.

పోటీలో నిలవాలంటే ఏప్రిల్ 4 లోగా నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. అయితే అత్యున్నత న్యాయస్థానం నుంచి స్టే రాకపోవడంతో హార్దిక్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు.

Follow Us:
Download App:
  • android
  • ios