సినీ నటి సుమలత... స్వతంత్ర అభ్యర్థిగా మాండ్య లోక్ సభ స్థానానికి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్-జేడీఎస్ పొత్తులో భాగంగా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ కూడా పోటీ చేశారు. ఇప్పటికే పోలింగ్ ముగిసింది. ఫలితాలు మే 23వ తేదీన విడుదల కానున్నాయి. ఈ క్రమంలో గెలుపు ఎవరదనేదానిపై పలు సంస్థలు సర్వేలు చేపడుతున్నాయి.

వీటిపై మీడియా సుమలతను ప్రశ్నించగా.. ఆమె సర్వేలపై స్పందించారు. ‘ లోక్ సభ స్థానానికి పోటీ చేశాను. పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం ఇది నాకు విశ్రాంతి సమయం. ప్రజలతో కలిసి ఉండేందుకు ఇష్టపడతాను. అంతకుమించి సర్వేలను సీరియస్ గా తీసుకోను’ అని సుమలత తెలిపారు.

రియస్‌గా తీసుకోనని సుమలత తేల్చిచెప్పారు. మండ్యలో ఓ వివాహ వేడుకతోపాటు పలు గ్రామాలను ఆమె సందర్శించారు. ఇదే సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ మండ్య ప్రజల తీర్మానానికి కట్టుబడతానన్నారు. ఒక్కో సర్వే ఒక్కో విధంగా ఉందన్నారు. నేను సర్వే చేయించనన్నారు.
 
ఓ కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే చళువరాయస్వామి తారసపడడంతో ఇరువురూ కాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత చళువరాయస్వామి మీడియాతో మాట్లాడుతూ మండ్యలో ఆత్మాభిమా నం గెలవనుందన్నారు. ఇప్పటిదాకా సుమలతకు పరోక్షంగా మద్దతు ఇచ్చిన చళువరాయస్వామి ఒక్కసారిగా బహిరంగంగానే తన అభిప్రాయాన్ని ప్రకటించారు.