ప్రముఖ సినీ నటి సుమలత బుధవారం మాండ్య లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. సుమలత తన మద్దతు దారులతో కలిసి ఈ రోజు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్దకు వచ్చి.. నామినేషన్ పత్రాలు సమర్పించారు.

సుమలత మాండ్య స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి ముందు ఛాముండేశ్వరీ ఆలయాన్ని సుమలత సందర్శించారు. తన కుమారుడితో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 

మొదట ఆమె కాంగ్రెస్ నుంచి సీటు దక్కుతుందని భావించారు. అయితే.. కాంగ్రెస్-జేడీఎస్ పొత్తులో భాగంగా ఆ టికెట్ కర్ణాటక సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడకు దక్కింది. దీంతో.. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సినీతారలకు ఎల్లప్పుడు మద్దతుగా నిలిచే మాండ్యా ప్రజలు ఈసారి ఎవరికి ఓటు వేస్తారో చూడాలి.