పోలింగ్ కేంద్రంలోకి అనుకోని అతిథి... ఆగిన పోలింగ్

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 23, Apr 2019, 2:03 PM IST
Snake inside VVPAT machine holds up polling in Kannur
Highlights

పోలింగ్ కేంద్రంలోని అనుకోని అతిథి వచ్చింది.. దీంతో పోలింగ్ ఆగిపోయింది. ఆ అనుకోని అతిథి  ఎవరో కాదు.. పాము. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలోని కన్నూర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో చోటుచేసుకుంది. 

పోలింగ్ కేంద్రంలోని అనుకోని అతిథి వచ్చింది.. దీంతో పోలింగ్ ఆగిపోయింది. ఆ అనుకోని అతిథి  ఎవరో కాదు.. పాము. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలోని కన్నూర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో చోటుచేసుకుంది. మూడో విడత ఎన్నికల సందర్భంగా కేరళలో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 

అయితే మయ్యిల్ కందక్కయ్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో ఏర్పాటు చేసిన వీవీప్యాట్‌లో ఓటర్లు పామును గుర్తించడంతో అధికారులు పోలింగ్ ప్రక్రియను కొద్దిసేపు నిలిపివేశారు. వీవీప్యాట్ నుంచి పామును తొలగించిన అనంతరం పోలింగ్ తిరిగి ప్రారంభమైంది. 

కన్నూర్ లోక్‌సభ స్థానం నుంచి సీపీఐ(ఎం) పార్టీ తరపున సిట్టింగ్ ఎంపీ పీ.కే. శ్రీమతి, కాంగ్రెస్ నుంచి కే. సురేంద్రన్, బీజేపీ తరపున సీ.కే. పద్మనాభన్ ఎన్నికల బరిలో ఉన్నారు.

loader