కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి ఎన్నికల వేళ ఊహించని షాక్ తగిలింది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఆమె అమేథి నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె నామినేషన్ కూడా వేశారు. కాగా.. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమేథి నియోజకవర్గంలో ఆమె షాక్ తగిలింది.

స్మృతి అల్లుడు రవిదత్ మిశ్రా.. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ సమక్షంలో రవిదత్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

రవిదత్ గతంలో సమాజ్ వాదీ పార్టీ నేతగా పనిచేశారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే.. తర్వాత బిజేపీలో కీలకంగా వ్యవహరించారు. స్మృతి ఎప్పుడు అమేథి లో పర్యటనకు వచ్చినా రవిదత్ నివాసంలో నే ఉండేది. అలాంటిది ఇప్పుడు రవిదత్ కాంగ్రెస్ లో చేరడం ఆమె తట్టుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ అమేథీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ, స్మృతీ ఇరానీలో పోటీ పడుతున్న విషయం అందరికీ విదితమే. గత ఎన్నికల్లో రాహుల్ విజయం సాధించారు. మరి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయం మే 23న తెలుస్తుంది.