దేశమంతా సార్వత్రిక ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. అన్ని ప్రాంతాల్లో నేతలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటర్ల మనసు గెలుచుకునేందుకు వారు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. వినూత్నంగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాగా.. ఒకప్పటి బాలీవుడ్‌ డ్రీమ్‌ గర్ల్‌, మధుర నియోజవర్గం బీజేపీ ఎంపీ అభ్యర్థి హేమమాలిని సినిమాటిక్ స్టైల్లో ప్రచారం చేస్తున్నారు. ఆదివారం నుంచి ఆమె ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా మహిళా ఓటర్లను టార్గెట్ చేశారు.

నియోజకవర్గంలోని గోవర్దన క్షేత్ర ప్రాంతంలో ప్రచారం నిర్వహించిన ఆమె.. దారిలో పొలాల వద్ద కనిపించిన మహిళా రైతులకు వద్దకు వెళ్లారు. కొడవలి చేతపట్టి వారితో పాటు వరి కోశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ‘ ఎన్నికల ప్రచారంలో భాగంగా గోవర్దన క్షేత్ర ప్రాంతంలోని మహిళలను కలుసుకున్నాను. మొదటి రోజు ప్రచారంలో పొలాల వద్ద ఉన్న మహిళతో కలిసి మాట్లాడడం అదృష్టంగా భావిస్తున్నాను’ అంటూ ఆ మహిళలతో దిగిన ఫోటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.