Asianet News TeluguAsianet News Telugu

సీపీఎంను ఒక్క మాట కూడా అనను: కేరళలో రాహుల్ శపథం

రాజకీయ జీవితంలో తొలిసారిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు చోట్ల ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. ఎప్పటిలాగా అమేథీలో పోటీ చేస్తున్న ఆయన.. ఈసారి కేరళలోని వయనాడ్ నుంచి సైతం బరిలో నిలిచారు.

not say a word against CPM, says Congress Chief Rahul gandhi
Author
Wayanad, First Published Apr 4, 2019, 4:16 PM IST

రాజకీయ జీవితంలో తొలిసారిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు చోట్ల ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. ఎప్పటిలాగా అమేథీలో పోటీ చేస్తున్న ఆయన.. ఈసారి కేరళలోని వయనాడ్ నుంచి సైతం బరిలో నిలిచారు.

గురువారం వయనాడ్‌ అభ్యర్ధిగా రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై సీపీఎం విమర్శలు గుప్పిస్తుందని, కానీ తాను వారికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడబోనని చెప్పారు.

తనతో సీపీఎం పోరాడవలసి ఉంటుందని తనకు తెలుసునన్నారు. సమైక్యతా సందేశాన్ని ప్రజల్లోకి పంపడానికే తాను ఇక్కడికి వచ్చానన్నారు. ఉత్తర కేరళలో వామపక్షాలకు గట్టి పట్టుంది.

అదే ప్రాంతంలోని వయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేస్తుండటం వామపక్ష పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. దీనికి నిదర్శనంగా వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రకటించిన వెంటనే .. రాహుల్ బీజేపీ పోటీ చేసే స్థానం నుంచి పోటీ చేయాలంటూ కేరళ సీఎం పినరయి విజయన్ చెప్పడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios