తాను ఓటును ఇష్టమైన పార్టీకి కాకుండా ఇష్టం లేని పార్టీకి వేయించారని ఓ వృద్ధఉురాలు ఆరోపించడం ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపింది. వివారాల్లోకి వెళితే.. అమేథి నుంచి ఎప్పటి లాగే కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బరిలో నిలిచారు.

ఆయనపై పోటీగా కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ రంగంలోకి దిగారు. దీంతో ఇరు పార్టీలు ఇక్కడ విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నాయి. ఈ క్రమంలో ఓ వృద్ధురాలు సోమవారం ఓటు వేసేందుకు వెళ్లారు.

ఆమెకు బీజేపీ అంటే విపరీతమైన అభిమానం.. ఆ పార్టీకి ఓటేయ్యాలని భావించిన ఆమె సంతోషంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లింది. అయితే అక్కడి వారు తన చేతిని పట్టుకుని బలవంతంగా కాంగ్రెస్ బటన్ నొక్కించారని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.