సినీ నటుడు, రాజకీయ నాయకుడు శత్రుఘ్నసిన్హా భార్య పునం సిన్హా మంగళవారం సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఈ విషయాన్ని సమాజ్ వాదీ పార్టీ అధికారికంగా ప్రకటించింది. శత్రుఘ్నసిన్హా.... ఇటీవల బిజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆయన కాంగ్రెస్ లో చేరిన వారం రోజులకే.. భార్య పూనం సమాజ్ వాదీ పార్టీలో చేరడం గమనార్హం.

సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ను లక్నోలోని నివాసంలో పూనం కలుసుకున్నారు. పూనం సిన్హాకి లోక్నో టికెట్ కూడా ఖరారు చేశారు. ఈ నియోజకవర్గం నుంచి బిజేపీ తరపున కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎన్నికల బరిలో నిలిచారు.

శత్రుఘ్నసిన్హా కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి.. పూనమ్ సిన్హాకి ఆ పార్టీ మద్దతు ఇస్తుందని సమాజ్ వాదీ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో లక్నో నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నెల 18వ తేదీన పూనమ్ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. వచ్చే నెల 6వ తేదీన పోలింగ్ జరగనుంది.