కేంద్ర మంత్రి మేనకా గాంధీ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ లోని సల్తానాపూర్ లో పర్యటించిన మేనకాగాంధీ... ముస్లిం ఓటర్లను బెదిరించిన సంగతి తెలిసిందే. 

కేంద్ర మంత్రి మేనకా గాంధీ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ లోని సల్తానాపూర్ లో పర్యటించిన మేనకాగాంధీ... ముస్లిం ఓటర్లను బెదిరించిన సంగతి తెలిసిందే. తనకు ఓటు వేయకుంటే.. ప్రభుత్వం నుంచి అందాల్సిన ఎలాంటి సదుపాయం అందకుండా చేస్తానని ఆమె హెచ్చరించారు.

కాగా.. ఓటర్లతో ఆమె చేసిన కామెంట్లపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. ఓటర్లతో చేసిన కామెంట్స్ పై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ఈ విషయంపై ఎన్నికల ప్రధాన కార్యదర్శి బీఆర్ తివారి మాట్లాడుతూ.. ‘‘ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. సుల్తాన్‌పూర్ జిల్లా మేజిస్ట్రేట్ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి నివేదిక అందింది...’’ అని పేర్కొన్నారు. కాగా ఎన్నికల సంఘం నోటీసులపై స్పందించిన మేనకా గాంధీ.. బీజేపీ మైనారిటీ సెల్ సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు.

‘‘మా పార్టీ మైనారిటీ విభాగం సమావేశంలో నేను మాట్లాడాను. నా పూర్తి ప్రసంగాన్ని చూడకుండా... ఓ మాటను పట్టుకుని, అసంపూర్తిగా పదే పదే ప్రసారం చేశారు..’’ అని ఆమె పేర్కొన్నారు.

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి