ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు మే 23వ తేదీన విడుదల కానున్నాయి. కాగా... మళ్లీ అధికారం చేపట్టాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా... అధికారం కోసం కాంగ్రెస్ కూడా ప్రయత్నిస్తోంది.

ఇదిలా ఉంటే... మోదీ మళ్లీ ప్రధాని కావాలని ప్రార్థిస్తూ తమిళనాడులో ఓ వ్యక్తి గేదెలతో యాగం, పూజలు నిర్వహించాడు. తూత్తుకూడి జిల్లా వల్లనాడులో నారాయణన్‌ అనే వ్యక్తి గోశాలను నిర్వహిస్తున్నారు. మోదీ మళ్లీ ప్రధాని కావాలని ప్రార్థిస్తూ ఈ గోశాలలో ఇటీవల రహస్యంగా ప్రత్యేక యాగం నిర్వహించారు. 

గోశాలలోని 21 గేదెలకు 15 మంది వేదపండితులు నాలుగుగంటలపాటు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఒక గేదె కాలికి బంగారు గొలుసు అలంకరించి ప్రత్యేక యాగం నిర్వహించారు. గోప్యంగా జరిగిన ఈ యాగానికి మోదీ ప్రతినిధిగా హాజరైన వ్యక్తి మాత్రమే ఫొటోలు తీయగా, మిగిలిన ఎవ్వరూ సెల్‌ఫోన్‌ తీసుకురాకుండా కట్టుదిట్టం చేశారని సమాచారం.