Asianet News TeluguAsianet News Telugu

బంగ్లా సరిహద్దులో దారితప్పిన మమతా బెనర్జి హెలికాప్టర్...

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచార సభలో బుధవారం కాస్సేపు ఉత్కంట చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచార సభకోసం మమత ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాస్సేపు కనిపించకుండా పోయింది. అయితే పైలట్ తప్పిదంతో దారితప్పిన హెలికాప్టర్ అరగంట తర్వాత గమ్యస్థానానికి చేరుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 

Mamata Banerjee Helicopter Loses Its Way Near Bangladesh Border
Author
Calcutta, First Published Apr 10, 2019, 6:12 PM IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచార సభలో బుధవారం కాస్సేపు ఉత్కంట చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచార సభకోసం మమత ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాస్సేపు కనిపించకుండా పోయింది. అయితే పైలట్ తప్పిదంతో దారితప్పిన హెలికాప్టర్ అరగంట తర్వాత గమ్యస్థానానికి చేరుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచార జోరు సాగుతోంది. అయితే ప్రస్తుతం అధికారంలో వున్న బిజెపికి ఎలాగైనా గద్దె దించాలని ముందునుంచి ప్రణాళికాబద్దంగా  అడుగులువేస్తున్నారు టీఎంసి అధినేత్రి మమతా బెనర్జీ. అయితే ముందుగా పశ్చిమ బెంగాల్ లోని మొత్తం  లోక్ సభ స్థానాలను గెలుచుకుని తన సత్తా చాటడం ద్వారా దేశ రాజకీయాల్లో క్రీయాశీల పాత్ర వహించాలని ఆమె చూస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రతి లోక్ సభ నియోజకవర్గంలోనూ ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. 

ఈ క్రమంలోనే బుధవారం ఆమె బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతమైన చోప్రాలో ప్రచారం నిర్వహించాల్సి వుంది. ఇందుకోసం మధ్యాహ్నం 1.05 గంటలకు ఆమె సిలిగురి నుండి హెలికాప్టర్ లో చోప్రాకు బయలుదేరారు. కేవలం 20 నిమిషాలలో గమ్యస్థానానికి చేరుకోవాల్సిన హెలికాప్టర్ గంటసేపైనా చేరుకోలేదు. ఈ హెలికాప్టర్ అదృశ్యం ఆందోళనకు దారితీసింది. 

అయితే ఓ గంట ఆలస్యంగా హెలికాప్టర్ గమ్యస్థానానికి చేరుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ సందర్భంగా మమత ప్రసంగిస్తూ... హెలికాప్టర్ దారి తప్పడంవల్లే ఆలస్యమైందని తెలిపారు. పైలట్ ఈ ప్రాంతాన్ని గుర్తించకలేకపోవడం వల్లే దారితప్పామన్నారు. కేవలం 22 22 నిమిషాల్లోనే తాను ఇక్కడకు చేరుకోవాల్సి ఉండగా 55 నిమిషాలు పట్టిందని... మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు క్షమించాలని ఆమె ప్రజలను కోరారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios