Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ కి ట్రాన్స్ లేటర్ సమస్య.. వైరల్ అవుతున్న వీడియో

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి  కొత్త చిక్కువచ్చి పడింది. ఆయనకు సరైన ట్రాన్స్ లేటర్స్ దొరకడం లేదు. దీంతో... ఆయన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

lost in translation, pj kuriens version of rahul gandhi speech takes internet by storm
Author
Hyderabad, First Published Apr 17, 2019, 1:26 PM IST

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి  కొత్త చిక్కువచ్చి పడింది. ఆయనకు సరైన ట్రాన్స్ లేటర్స్ దొరకడం లేదు. దీంతో... ఆయన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఇంతకీ మ్యాటరేంటంటే..  మంగళవారం రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళ వెళ్లారు.  ఆయన తన ప్రసంగాన్ని ఇంగ్లీష్ లో చెబుతుండగా.. దానిని  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ డిప్యుటీ ఛైర్ పర్సన్ పీజే కురియన్ మమళయాళంలోకి అనువదించారు.

ఇందులో వింతేముంది అనుకోవచ్చు. ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. రాహుల్ చక్కగా ఇంగ్లీష్ లో ప్రసంగిస్తుంటే.. దానిని మళయాళంలోకి ట్రాన్స్ లేట్ చేయడానికి కురియన్ చాలా తిప్పలు పడ్డారు.  అనువాదనం సరిగా రాకపోవడంతో ఒకానొక సమయంలో కురియన్ మైక్ ను పక్కను నెట్టి మళయాళంలో మాట్లాడటానికి ప్రయత్నించారు. అయితే.. రాహుల్ ఆ మమైక్ ను తిరిగి ఆయనకు దగ్గరగా జరిపారు.

 రాహుల్‌ ఆపకుండా ప్రసంగం చేస్తుంటే అది అర్థం చేసుకోవడానికి తరచూ కురియన్‌ చూపించిన హావభావాలు కామెడీని పూయించాయి. రాహుల్‌గాంధీ కూడా కురియన్‌ హావభావాలు చూసి నవ్వుతూ కనిపించారు. అయితే అనువాదంలో తరచూ తడబడుతుండటంతో రాహుల్‌ గాంధీకి ఓపిక నశించి తన ప్రసంగాన్ని ఆపేశారు. ఈయన ఇప్పుడే మళయాలం మాట్లాడటం నేర్చుకుంటున్నాడా అంటూ కసురుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios