మధ్యప్రదేశ్‌ లోక్‌‌సభ ఎన్నికల పోలింగ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఎన్నికల విధులకు వచ్చిన మహిళా పోలింగ్ అధికారి గుండెపోటుతో మరణించారు.

మధ్యప్రదేశ్‌ లోక్‌‌సభ ఎన్నికల పోలింగ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఎన్నికల విధులకు వచ్చిన మహిళా పోలింగ్ అధికారి గుండెపోటుతో మరణించారు. వివరాల్లోకి వెళితే.. సునంద కోటేకర్ అనే 50 ఏళ్ల మహిళా ఉద్యోగినిని చింద్వారా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని సౌన్‌సర్‌లో గల లోడీఖేడా పోలింగ్ బూత్ వద్ద ఎన్నికల డ్యూటీ వేశారు.

ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆమె అస్వస్థతకు గురయ్యారు. అయితే అధికారులు సునందకు ఎటువంటి వైద్య సహాయం అందించకపోవడంతో ఆమె కొద్దిసేపటికే గుండెపోటుకు గురై మరణించారు.