లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం నాలుగో విడత పోలింగ్ ప్రారంభమైంది. 8 రాష్ట్రాల్లోని 71 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ నియోజకవర్గంలో రెండో దశ పోలింగ్ జరగనుంది
ముగిసిన నాలుగో విడత ఎన్నికలు
దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో మరో ఘట్టం ముగిసింది. నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా సోమవారం వివిధ రాష్ట్రాల్లో జరిగిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. పశ్చిమ బెంగాల్ లోని కొన్ని ప్రాంతాలతో పాటు మిగతా రాష్ట్రాల్లో చెదురుమదురు ఘటనలు మినహా మిగతా చోట్ల పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో కూడా ఇవాళే పోలింగ్ జరిగింది. దీంతో తమ ోటు హక్కును వినియోగించుకునేందుకు బాలివుడ్ సెలబ్రిటీలంతా పోలింగ్ కేంద్రాలకు కదిలొచ్చారు. అలాగే ముఖేష్ అంబానీ వంటి బడా పారిశ్రామికవేత్తలు కూడా తమ కుటుంంబ సభ్యులతో కలిసొచ్చి ఓటుహక్కును వినియోగించుకున్నారు. మొత్తానికి ఈ నాలుగో విడత ఎన్నికల్లో బాలివుడ్ ఇండస్ట్రీ గ్లామర్ మొత్తం పోలింగ్ బూతుల వద్ద కనిపించింది.
ఎన్నికల కమీషన్ వెల్లడించిన పోలింగ్ శాతాల ప్రకారం ఈ ఎన్నికల్లో కూడా పశ్చిమ బెంగాల్లో లోనే అత్యధికంగా పోలింగ్ శాతం నమోదయ్యినట్లు తెలుస్తోంది. ఇక అత్యల్పంగా జమ్ము కాశ్మీర్ 10 శాతం కంటే తక్కువ ఓటింగ్ శాతం నమోదయ్యింది.
ఓటేసిన తర్వాత అంబాని కుటుంబం ఇలా...
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ముంబైలోని విల్లా థెరెసా హైస్కూల్లోని పోలింగ్ బూత్ లో ఓటుహక్కును వినియోగించుకున్నారు. భార్య నీతా, ఇద్దరు కుమారులు, కూతురు ఇలా కుటుంబం మొత్తం కలిసివచ్చి ఓటేశారు.
సాయంత్రం 5గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు
నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లోని 72 లోక్ సభ నియోజకవర్గాల్లో ఉదయమే ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే సాయంత్ర 5 గంటల వరకు ఈ పోలింగ్ శాతం 50.06 శాతంగా నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
రాష్ట్రాలవారిగా పోలింగ్ శాతం
బీహార్: 44.33%
జమ్మూకాశ్మీర్: 9.37%
జార్ఖండ్: 57.13%
మధ్యప్రదేశ్: 57.77%
మహారాష్ట్ర: 42.52%
ఒడిషా: 53.61%
రాజస్థాన్: 54.75%
ఉత్తరప్రదేశ్: 45.08%
పశ్చిమ బెంగాల్: 66.46%
ఓటేసిన రీల్ లైఫ్ నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ లో లీడ్ రోల్ చేస్తూ వార్తల్లో నిలిచిన బాలీవుడ్ హీరో వికెక్ ఒబెరాయ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముంబై జుహు లోని గాంధీగ్రామ్ స్కూల్లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ లో అతడు ఓటేశాడు.
ఓటేసిన షారుఖ్ దంపతులు
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ముంబైలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. భార్య గౌరీ ఖార్ తో కలిసి వాంద్రాలోని పోలింగ్ బూత్ కి వెళ్లి ఓటేశారు.వీరి రాక సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద సందడి నెలకొంది. షారుఖ్ దంపతులను వీడియో తీసేందుకు మీడియా, చూసేందుకు అభిమానుల ఎగబడ్డారు.
బిజెపి రిగ్గింగ్ పాల్పడుతోంది: ఈసీకి బిజెడి ఫిర్యాదు
భారతీయ జనతా పార్టీ ఒడిషాలో జరుగుతున్న ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడుతోందని బిజూ జనతాదళ్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. జయపుర జిల్లాలోని బరి లోక్ సభ పరిధిలో భారీగా రిగ్గింగ్ జరుగుతున్నట్లు బిజెడి నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఈ లోక్ సభ పరిధిలోని 12 పోలింగ్ బూతుల్లో బిజెపి నాయకులు రిగ్గింగ్ కు చేయిస్తున్నారని వారు ఈసికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందువల్ల ఆయా పోలిగ్ బైతుల్లో వెంటనే పోలింగ్ నిలిపివేయాలని బిజెడి డిమాండ్ చేస్తోంది.
మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ వివరాలు
నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న పోలింగ్ మధ్యాహ్నం కాస్త నెమ్మదిగా సాగుతోంది. తొమ్మిది రాష్ట్రాల్లోని 72 లోక్ సభ సనియోజకవర్గాల్లో ఉదయమే ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు 49.53 శాతానికి చేరుకున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
రాష్ట్రాలవారిగా పోలింగ్ శాతం
బీహార్: 44.23%
జమ్మూకాశ్మీర్: 8.42%
జార్ఖండ్: 56.37%
మధ్యప్రదేశ్: 55.22%
మహారాష్ట్ర: 41.15%
ఒడిషా: 51.54%
రాజస్థాన్: 54.16%
ఉత్తరప్రదేశ్: 44.16%
పశ్చిమ బెంగాల్: 66.01%
ఓటేసిన జెట్ ఎయిర్ వేస్ ఛైర్మన్ నరేశ్ గోయల్...
జెట్ ఎయిర్ వేస్ ఛైర్మన్ నరేశ్ గోయల్ ముంబైలో ఓటేశారు. వివాదం కారణంగా జెట్ ఎయిర్ వేస్ విమానసర్వీసులు ఆగిపోయిన తర్వాత మొదటగా ఇలా ఓటేయడానికి వచ్చిన సందర్భంలోనే గోయల్ మీడియాకంట పడ్డారు. సౌత్ ముంబైలోని విల్లా థెరెసా కాన్వెంట్ స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్న అతడు మీడియాకు ఓటేసినట్లుగా సిరా కలిగిన వేలిని చూపిస్తూ అక్కడినుండి వెళ్లిపోయారు.

మధ్యాహ్నం 2 గంటలవరకు పోలింగ్ వివరాలు...
దేశవ్యాప్తంగా మధ్యాహ్నం రెండు గంట వరకు 38.63 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రాల వారీగా పోలింగ్ శాతం.
బీహార్: 37.71%
జమ్మూకాశ్మీర్: 6.66%
జార్ఖండ్: 44.90%
మధ్యప్రదేశ్: 43.44%
మహారాష్ట్ర: 29.93%
ఒడిషా: 35.79%
రాజస్థాన్: 44.62%
ఉత్తరప్రదేశ్: 34.42%
పశ్చిమ బెంగాల్: 52.37%
రెండు చేతులు లేకపోయినా:
మధ్యప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఓ దివ్యాంగురాలు అందరి మన్ననలు పొందింది. జబల్‌పూర్‌కు చెందిన భవానీ అనే దివ్యాంగురాలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆమెకు రెండు చేతులు లేకపోయినప్పటికీ, తన కాలివేలిపై సిరా చుక్క వేయించుకుని ఓటు వేసింది.
ఇందుకోసం పోలింగ్ సిబ్బంది సైతం ఆమెకు సహకరించారు. అనంతరం భవానీ మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, అందుకే అందరూ ఓటు వేయాలని.. అప్పుడే దేశ నిర్మాణంలో భాగస్వాములమవుతామని పేర్కొంది. ప్రస్తుతం ఆమె ఇంజనీరింగ్ చదువుతోంది.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాంద్రాలోని 203వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో భార్య అంజలీ, కుమార్తె సారా, కుమారుడు అర్జున్ టెండూల్కర్‌లతో కలిసి ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సారా, అర్జున్‌లు మొదటిసారిగా ఓటు వేశారు.
మధ్యాహ్నం ఒంటి గంట వరకు 38.39 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రాల వారీగా పోలింగ్ శాతం.
బీహార్: 37.1%
జమ్మూకాశ్మీర్: 6.66%
మధ్యప్రదేశ్: 43.3%
మహారాష్ట్ర: 29.24%
ఒడిషా: 35.79%
రాజస్థాన్: 44.51%
ఉత్తరప్రదేశ్: 34.19%
పశ్చిమ బెంగాల్: 52.37%
జార్ఖండ్: 44.90%
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముంబై బాంద్రాలోని 283వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో సల్లూభాయ్ ఓటు వేశారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అత్తారింట్లో అడుగుపెట్టేముందు పోలింగ్ బూత్‌కు:
దేశప్రజల్లో ముఖ్యంగా యువతలో ఎన్నికలు, పోలింగ్ పట్ల ఇప్పుడిప్పుడే వైఖరి మారుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కొత్త పెళ్లి కూతురు అత్తారింట్లో అడుగుపెట్టడం కంటే ముందు పోలింగ్ బూత్‌లో ఓటు వేసి ఇంటికి వెళ్లింది.
దీంతో ఈ వార్త స్థానికంగా సంచలనం సృష్టించింది. యూపీ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో యువత పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు.
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబైలోని వెర్సోవాలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో భర్త జుబిన్ ఇరానీతో కలిసి ఆమె ఓటు వేశారు.
బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్, మధుర బీజేపీ ఎంపీ అభ్యర్ధి హేమమాలిని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముంబైలోని విలే పర్లేలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో కుమార్తెలు ఈషా డియోల్, అహనా డియోల్‌తో కలిసి ఓటు వేశారు.
కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముంబై మలబార్ హిల్స్‌లోని వాల్‌సింగమ్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు.
శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముంబై గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో భార్య రష్మీ థాక్రే, కుమారుడు ఆదిత్య థాక్రేలతో కలిసి ఓటు వేశారు.
అనంత్‌నాగ్ జిల్లాలో రాళ్ల దాడి:
నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో అత్యంత సమస్యాత్మకమైన స్ధానంగా చెప్పుకుంటున్న జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ స్థానంలో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కుల్గామ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్థానికులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని నానూర్‌లో ఉద్రిక్తత (వీడియో):
పశ్చిమ బెంగాల్‌లోని బిర్‌భూమి జిల్లాలోని ననూర్‌లో తృణమూల్ మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలింద్ కేంద్రాల వద్ద బీజేపీ కార్యకర్తలు టీఎంసీ కార్యకర్తలను అడ్డగించడం ఉద్రిక్తతకు దారి తీసింది.
దీంతో తృణమూల్ కార్యకర్తలు కర్రలు, చీపుర్లు తీసుకుని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని శాంతించేందుకు ప్రయత్నిస్తున్నారు.
#WATCH TMC women supporters protest in Nanoor of Birbhum district, after BJP opposed TMC supporters who insisted on polling despite absence of central forces at the polling booth. Police is trying to mediate between the two groups. #WestBengal#LokSabhaElections2019pic.twitter.com/WhPWtwqeVG
బాలీవుడ్ దర్శక, నిర్మాత మాధుర్ భండార్కర్ తన భార్య రేణు నంబూద్రీతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాంద్రాలోని ఎంఎంకే కళాశాలలో ఏర్పాటు చేసిన 167వ నెంబర్ పోలింగ్ బూతులో వారు ఓటు వేశారు.
మధ్యాహ్నం 12 గంటల నాటికి 23.73% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రాల వారీగా పోలింగ్ శాతం..
బీహార్: 18.26%
జమ్మూకాశ్మీర్: 3.74%
మధ్యప్రదేశ్: 27.09%
మహారాష్ట్ర: 17.21%
ఒడిషా: 19.67%
రాజస్థాన్: 29.34%
ఉత్తరప్రదేశ్: 21.18%
పశ్చిమ బెంగాల్: 35.10%
జార్ఖండ్: 29.21%
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబై మలబార్ హిల్స్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు.
మొరాయిస్తున్న ఈవీఎంలు: అధికారులతో ఓటర్ల వాగ్వాదం:
నాలగో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని 13 స్థానాలకు సోమవారం పోలింగ్ జరుగుతుంది. అయితే పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. అక్బర్‌పూర్‌లోని బూత్ నెంబర్ 244లో ఈవీఎంలు మొరాయించడంతో ఉదయం 8 గంటల వరకు పోలింగ్ ప్రారంభం కాలేదు.
అలాగే బీతర్ గ్రామంలోని ఈవీఎంలు చెడిపోవడంతో ఓటర్లు గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. మరోవవైపు కాన్పూర్‌లోని బర్రా పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు చెడిపోవడంతో ఓటర్లు అధికారులతో గొడవకు దిగడంతో పోలీసులు జనాన్ని శాంతింపజేశారు.
ఎన్నికల ఎఫెక్ట్: మూతబడ్డ ముంబై స్టాక్ మార్కెట్:
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశ వాణిజ్య రాజధాని ముంబై నిర్మానుష్యంగా మారింది. పోలింగ్ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో నగరం బోసిపోతోంది.
ముఖ్యంగా ఎప్పుడు రద్దీగా ఉండే స్టాక్ మార్కెట్ ప్రాంతంలో జనం హడావిడి ఏ మాత్రం లేదు. ఈ రోజు స్టాక్ మార్కెట్లు, ఫారిన్ ఎక్స్‌ఛేంజ్, కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌లు కూడా మూతబడ్డాయి. మంగళవారం మార్కెట్లు తిరిగి యథావిధిగా పనిచేస్తాయి.
తృణమూల్, బీజేపీ ఘర్షణలు: 9 మందికి గాయాలు:
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని బిర్భమ్ నానూర్‌లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 8 మంది గాయపడగా.. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
మహిళా రిపోర్టర్‌పై దాడి:
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అసన్‌సోల్‌లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగడంతో దానిని కవర్ చేయడానికి వచ్చిన మహిళా రిపోర్టర్‌పై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు. మైక్‌ను లాక్కొని రిపోర్టర్‌పై చేయి చేసుకున్నారు.
అభ్యర్ధిపై మావోయిస్టుల దాడి:
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మధ్యప్రదేశ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. బాలాఘాట్ స్వతంత్ర అభ్యర్ధి కిశోర్ సమ్రితి వాహనంపై కాల్పులు జరిపి, దానికి నిప్పటించారు. సోమవారం ఉదయం విలేకరులతో మాట్లాడిన అనంతరం కిశోర్ పోస్రా అనే గ్రామంలో ఆగి సమీపంలో ఉన్న దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ సమయంలో సుమారు 20 నుంచి 25 మంది సాయుధులైన మావోయిస్టులు కిశోర్ వాహనంపై కాల్పులు జరిపారు. అనంతరం కారుకి నిప్పు పెట్టారు. అయితే కిశోర్ దేవాలయంలో ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం దర్యాప్తును ఆదేశించింది.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముంబై ఖర్‌లో ఉన్న పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సంజయ్ దత్ సోదరి, ముంబై నార్త్ సెంట్రల్ కాంగ్రెస్ అభ్యర్ధి ప్రియా దత్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాంద్రాలోని సెయింట్ ఆన్స్ హైస్కూలులో ఆమె ఓటు వేశారు.
ఉదయం 11 గంటల నాటికి 14.59% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది
బీహార్: 13.95%
జమ్మూకాశ్మీర్: 3.69%
మధ్యప్రదేశ్: 18.69%
మహారాష్ట్ర: 8.15%
ఒడిషా: 10.10%
రాజస్థాన్: 15.08%
ఉత్తరప్రదేశ్: 17.69%
పశ్చిమ బెంగాల్: 21.69%
జార్ఖండ్: 20.87%
బీహార్, ఒడిషాలలో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. 60 చోట్ల ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఒడిషాలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. అయితే సాంకేతిక సిబ్బంది వాటిని పునరుద్దరించారు.
అలాగే బీహార్‌లోని ముంగేర్‌లో ఏర్పాటు చేసిన మూడు పోలింగ్ బూత్‌లతో పాటు దర్భంగా, బేగుసరాయ్‌లలోని పలు కేంద్రాల్లో ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
గుండెపోటుతో మహిళా ఎన్నికల అధికారి మృతి
మధ్యప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళా ఎన్నికల అధికారి గుండెపోటుతో మరణించారు. సునంద కోటేకర్ అనే మహిళా ఉద్యోగినిని చింద్వారా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని సౌన్‌సర్‌లో గల లోడీఖేడా పోలింగ్ బూత్ వద్ద ఎన్నికల డ్యూటీ వేశారు.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆమె అస్వస్థతకు గురయ్యారు. అయితే అధికారులు సునందకు ఎటువంటి వైద్య సహాయం అందించకపోవడంతో ఆమె కొద్దిసేపటికే గుండెపోటుకు గురై మరణించారు.
బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ ముంబై జూహులోని పోలింగ్ బూత్ నెం. 235, 240లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బాలీవుడ్ నటులు భాగ్యశ్రీ, సోనాలీ బింద్రెలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పర్లీలోని పోలింగ్ బూత్‌లో వీరిద్దరూ ఓటు వేశారు.
10 గంటల నాటికి 10.36 % పోలింగ్ నమోదు
నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా ఉదయం 10 గంటల నాటికి 10.36 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
బీహార్: 10.76%
జమ్మూకాశ్మీర్: 0.68%
మధ్యప్రదేశ్: 11.39%
మహారాష్ట్ర: 6.45%
ఒడిషా: 8.34%
రాజస్థాన్: 12.22%
ఉత్తరప్రదేశ్: 9.87%
పశ్చిమ బెంగాల్: 16.89%
జార్ఖండ్: 12.00 %
నేను ఓటెయ్యలేను.. కనీసం మీరైనా వేయండి: రిషీకపూర్
అనారోగ్యంతో బాధపడుతున్న తాను ప్రస్తుతం ఓటేయలేని పరిస్ధితిలో ఉన్నానని కానీ మీరంతా తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని బాలీవుడ్ నటుడు రిషీకపూర్ విజ్ఞప్తి చేశారు. ఓటు వేసేందుకు ముంబై రావడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ అనివార్య కారణాల వల్ల కుదరలేదు.
దీంతో న్యాయార్క్‌లోని భారత కాన్సులేట్ అధికారులను సంప్రదించారట. స్వస్థలానికి దూరంగా ఉంటున్న తనలాంటి వారి కోసం ఓటు హక్కును వినియోగించుకునేలా మరో మార్గం ఏమైనా ఉందా అని ప్రశ్నించగా.. అలాంటిదేమి లేదని అక్కడి అధికారులు రిషీ కపూర్‌కు తెలిపారు.
ఓటర్లకు ప్రధాని నరేంద్రమోడీ పిలుపు
నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు సందేశమిచ్చారు. ఓటర్లు భారీగా తరలివచ్చి పాత రికార్డులను బద్ధలు కొట్టాలని పిలుపునిస్తూ ట్వీట్ చేశారు. అలాగే యువ ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని మోడీ కోరారు.
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఓటర్లు భారీగా పోలింగ్‌లో పాల్గొనాలని కోరారు. ఓటు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు.. నవభారత నిర్మాణానికి దోహదం చేస్తుందన్నారు.
Another phase of the General Elections begins today. I hope those voting today do so in large numbers and break the voting records of the previous three phases.
A special appeal to young voters to head to the polling booth and exercise their franchise.
* ముంబై నగరంలోని వివిధ పార్లమెంట్ సెగ్మెంట్లలో ఉదయం 9 గంటల నాటికి నమోదైన పోలింగ్ శాతం ఇలా వుంది.
ముంబై సౌత్ సెంట్రల్: 6.44 %
ముంబై సౌత్: 6.02%
ముంబై నార్త్: 7.85%
ముంబై నార్త్ వెస్ట్: 6.9 %
ముంబై నార్త్ ఈస్ట్: 7.00%
ముంబై నార్త్ సెంట్రల్: 5.98%
ముంబై సౌత్ సెంట్రల్: 6.45%
ముంబై సౌత్: 5.91%
మమత భయపడుతున్నారు: బాబూల్ సుప్రియో
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటర్ల చైతన్యాన్ని చూసి భయపడుతున్నారన్నారు కేంద్రమంత్రి బాబూల్ సుప్రియో. అసన్‌సోల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెంగాల్ ఓటర్లు చైతన్య వంతులయ్యారని, భద్రతా బలగాలు లేనిదే ఓటు వెయ్యమని చెప్పటం శుభ పరిణామమన్నారు. భద్రతా బలగాలు లేని చోటుకు తాను స్వయంగా దళాలను తీసుకెళతానని ఆయన స్పష్టం చేశారు.
హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధినేత దీపక్ పరేఖ్ ముంబై పెద్దార్ రోడ్‌లో ఉన్న 40, 41 నెంబర్ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ భార్య కిరణ్ రావ్‌తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబై బాంద్రాలోని సెయింట్ అన్స్ హైస్కూల్‌లో వారు ఓటు వేశారు.
ఉదయం 9 గంటల నాటికి 10.27శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ మాధురి దీక్షిత్ ముంబై జూహులో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తర్దేవ్‌లోని 31వ నెంబర్ పోలింగ్ బూత్ వద్ద ఆయన ఓటు వేశారు.
అసన్‌సోల్‌లో ఉద్రిక్తత (వీడియో):
పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌లో బీజేపీ నేత, కేంద్రమంత్రి బాబూల్ సుప్రియోకి, తృణమూల్ కాంగ్రెస్ నేతలకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. సుప్రియో పోలింగ్ బూత్‌లోకి వచ్చి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ టీఎంసీ నేతలు అడ్డుకున్నారు. దీంతో పాటు సుప్రియో కారును ధ్వంసం చేశారు.
పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్‌లోకి కొంతమంది వ్యక్తులు చొరబడేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీఛార్జీ జరిపి వారిని చెదరగొట్టారు.
పశ్చిమ బెంగాల్ నదియా జిల్లా శాంతిపూర్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో నాటు బాంబు కలకలం రేపింది. దీంతో ఓటర్లు భయాందోళనలకు గురయ్యారు.
బాలీవుడ్ నటీ ప్రియాంక చోప్రా తన తల్లి మధు చోప్రాతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
నార్త్ ముంబై బీజేపీ అభ్యర్థి పూనమ్ మహాజన్ వర్లీలోని 48వ నెంబర్ పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అలనాటి నటీమణి శుభా కోటే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముంబై జూహులోని పోలింగ్ బూత్‌లో ఆమె ఓటు వేశారు
సినీనటి, నార్త్ ముంబై కాంగ్రెస్ అభ్యర్ధి ఊర్మిళ మటోండ్కర్ బాంద్రాలోని 190వ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆమె ఓటర్లతో ముచ్చటించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. చింద్వారా నియోజకవర్గంలోని శిఖాపూర్‌లో ఏర్పాటు చేసిన 17వ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు.
విద్యార్థి నేత, బేగుసరాయ్ సీపీఐ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈయన కేంద్రమంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్‌పై పోటీ చేస్తున్నారు
సీనియర్ నటుడు, బీజేపీ ఎంపీ పరేశ్ రావల్ తన భార్య స్వరూప్ సంపత్‌తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పర్లీలోని జమ్నా బాయ్‌లోని 250-256 పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు.
#Mumbai : BJP sitting MP Paresh Rawal & his wife Swaroop Sampat cast their vote at polling booth number 250-256 at Jamna Bai School in Vile Parle. pic.twitter.com/V4iXvzhD9D
భోజ్‌పూర్ సూపర్‌స్టార్, గోరఖ్‌పూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రవికిషన్ గుర్గావ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అలనాటి బాలీవుడ్ అందాల తార రేఖ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముంబై బాంద్రాలోని 283వ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఆమె ఓటు వేశారు.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సాధారణ ప్రజలతో కలిసి క్యూలైన్‌లో నిల్చున్నారు. ముంబై పెద్దార్ రోడ్‌లోని పోలింగ్ బూత్ నెంబర్ 40, 41లలో ఆయన ఓటు వేశారు.
బీజేపీ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింధియా జలావర్‌లోని 33వ నెంబర్ పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Rajasthan: Former Rajasthan CM and BJP leader Vasundhara Raje Scindia casts her vote at polling booth number 33 in Jhalawar. #LokSabhaElections2019pic.twitter.com/9iNp9geKtQ
కేంద్రమంత్రి, నవాడా నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి గిరిరాజ్ సింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లఖీసరాయ్ జిల్లా బరాహియాలో ఏర్పాటు చేసిన 33వ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ ముంబైలోని జీడీ సోమని స్కూల్‌లో ఏర్పాటు చేసిన 216 నెంబర్ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ పోలింగ్‌కు ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం నాలుగో విడత పోలింగ్ ప్రారంభమైంది. 8 రాష్ట్రాల్లోని 71 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ నియోజకవర్గంలో రెండో దశ పోలింగ్ జరగనుంది.
మొత్తం 945 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 12.79 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాగే ఒడిశాలోని 41 శాసనసభ స్థానాలకు సోమవారమే పోలింగ్ జరగనుంది.
ఊర్మిళా మతోండ్కర్, సంజయ్‌దత్ సోదరి ప్రియాదత్, పూనమ్ మహాజన్, మిలింద్ దేవ్‌రాతో పాటు సల్మాన్ ఖుర్షీద్, శతాబ్దీరాయ్, మూన్‌మూన్ సేన్, కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, సుభాష్ భామ్రే, ఎస్‌ఎస్ అహ్లువాలియా, బాబుల్ సుప్రియో తదితర ప్రముఖులు నాలుగో దశలో పోటీపడుతున్నారు.
