ప్రధాని నరేంద్రమోదీ... లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పై సంచలన కామెంట్స్ చేశారు. లోక్ సభ స్పీకర్ చేసిన రెండో మహిళ సుమిత్రా మహాజన్. ఎలాంటిరాజకీయ నేపథ్యం లేకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. 8సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు మాత్రం ఆమె దూరంగా ఉన్నారు. కాగా... ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండోర్ లో పర్యటించిన మోదీ.. సుమిత్రా మహాజన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

తనకు సంభంధించి ఏ విషయంలోనైనా సరే మందలించగలిగిన ఏకైక వ్యక్తి సుమిత్రా మహాజన్  అని మోదీ పేర్కొన్నారు. ‘‘‘లోక్‌సభ స్పీకర్‌గా తాయి( సుమిత్రా మహాజన్) తన బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తించారు. ప్రజల మనసులో ఆమె పట్ల చాలా మంచి అభిప్రాయం ఉంది. మీ అందరికి నేను ఈ దేశ ప్రధానిగానే తెలుసు. ఇప్పుడు నేను చెప్పేబోయే విషయం నా పార్టీలో కూడా చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఏ విషయంలోనైనా సరే నన్ను మందలించగలిగిన ఏకైక వ్యక్తి తాయి మాత్రమే’ అని చెప్పారు.