200 సీట్లు గాయబ్: బిజెపిపై మమత ఎగ్జిట్ పోల్

First Published 16, May 2019, 7:40 PM IST
lok sabha elections 2019: bengal CM Mamata Banerjee's 'Exit Poll' For BJP
Highlights

 ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పారు దీదీ. కమలానికి 100 సీట్ల లోపులోనే వస్తాయని బెంగాల్ సీఎం జోస్యం చెప్పారు

సార్వత్రిక ఎన్నికలు మోడీ వర్సెస్ దీదీగా మారిపోయాయి. ఎన్నికలకు ముందు నుంచి బీజేపీపై దూకుడుగా వ్యవహరిస్తున్న మమతా బెనర్జీ దానిని మరింత పెంచారు. తాజాగా అమిత్ షా ర్యాలీ తర్వాత నుంచి ఆమె బీజేపీ అంటే రగిలిపోతున్నారు.

తాజాగా ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పారు దీదీ. కమలానికి 100 సీట్ల లోపులోనే వస్తాయని బెంగాల్ సీఎం జోస్యం చెప్పారు. బీజేపీ ఒక గుండా పార్టీ అని.. డబ్బు వెదజల్లుతూ ఓట్లను కొంటున్నారని ఆమె ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని... మహారాష్ట్రలో కూడా 20 సీట్లకు మించి రావని... మొత్తం మీద 200 స్థానాలను బీజేపీ కోల్పోతోందని మమత జోస్యం చెప్పారు. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని తృణమూల్ గుండాలు ధ్వంసం చేశారంటూ ప్రధాన చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు.

మోడీ అబద్ధాలకోరని.. తమ పార్టీపై ఆమె చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించుకోవాలని లేనిపక్షంలో ఆయనను జైలుకు పంపుతామని మమత హెచ్చరించారు. ఈశ్వర చంద్ర విద్యాసాగార్ విగ్రహాన్ని పునర్నిర్మించే డబ్బు బెంగాల్ వద్ద వుందని.. కానీ, 200 ఏళ్ల వారసత్వ సంపదను మోడీ మళ్లీ తీసుకురాగలరా..? అని మమత ప్రశ్నించారు.

బీజేపీ కార్యకర్తలే విగ్రహాన్ని కూల్చారనే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని... కానీ మోడీ మాత్రం టీఎంసీని అంటున్నారని మండిపడ్డారు. ఇలా మాట్లాడటానికి మీరు సిగ్గు లేదా.. ? అని మమత ప్రశ్నించారు. 

loader