ఎన్నికలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని ప్రజల ముంగిట్లోకి తీసుకొచ్చింది ఎన్నికల సంఘం. ఈ క్రమంలో చాలా మంది ఓటర్లు తమ నేతల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. 

ఎన్నికలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని ప్రజల ముంగిట్లోకి తీసుకొచ్చింది ఎన్నికల సంఘం. ఈ క్రమంలో చాలా మంది ఓటర్లు తమ నేతల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు.

ముఖ్యంగా నేర చరిత, తమ పార్టీ అభ్యర్థి పేర ఆస్తులు, అప్పులు తెలుసుకోవడంపై జనం ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి వారి కోసం ఈసీతో, పలు సంస్థలు ఆన్‌లైన్‌లో సమాచారాన్ని అందుబాటులోకి వుంచాయి. 

అఫిడవిట్లు పరిశీలించాలనుకునే వారి కోసం

రాష్ట్రంలోని అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ సమస్త సమాచారాన్ని ఇందులో పేర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన విషయాలను https://affidavit.eci.gov.in/లో చూడవచ్చు.. ఈ లింక్ క్లిక్ చేస్తే ఎన్నికల సంఘం పేజి ఓపెన్ అవుతుంది. అందులో మీ రాష్ట్రం, అసెంబ్లీ/ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎంచుకుంటే మీ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులు పేర్లు ఉంటాయి. మీకు కావాల్సిన వారి పేరుపై క్లిక్ చేస్తే వివరాలు చూడొచ్చు.

* అలాగే ప్లేస్టోర్‌లో voter helpline యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ... హోమ్ పేజీలో ‘‘క్యాండిడేట్’’ ఆప్షన్‌లో ప్రస్తుత లోక్‌సభ అభ్యర్థుల వివరాలు ఉంటాయి.

* పలు ప్రైవేట్ సంస్థలు కూడా అభ్యర్థుల వివరాలు, ఆస్తులు, అప్పులు, సంపాదనకు సంబంధించిన డేటాను అందిస్తున్నాయి. http://www.myneta.info/ లో మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది. 

ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఎన్నికల కమిషన్ తీవ్రంగానే స్పందిస్తోంది. ఎన్నికల సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో ఎవరిపై కేసులు నమోదయ్యాయో https:// cvigil.eci.gov.in/mcc లో ఇందుకు సంబంధించిన వివరాలుంటాయి.